Saturday, June 1, 2013

Bhadrakali Temple, Warangal - 2

Bhadrakali Temple, Warangal - 1  తరవాయి పర్యటన దృశ్యాలు. 


ఇదే భద్రకాళి చెరువు. ఆలయానికి ఆనుకొని ఉంటుంది. ఇందులోంచి నగరానికి నీటి సరఫరా చేస్తుంటారు. 


అలా ఇంకో నాలుగడుగులు వేశాక, మీకు ఇలా ఎడమ వైపున ఒక కుటీరం కనిపిస్తుంది. అదే శ్రీ గోకులం. ఇది కుటీరంలా కనిపించే ఆవుల పాక. దీనికి ప్రక్కగా కాళ్ళు కడుక్కోనేందుకై  కుళాయిలు ఉంటాయి. ఇక్కడే మనం దైవదర్శనానికి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కోవాలి.     


ఈ శ్రీ గోకులం కుటీరంలో  రెండు వృత్తాకార కట్టడాలు కనిపిస్తాయి. మధ్యలో ఉండే శ్రీ కృష్ణుడి పాలరాతి స్థూపం చుట్టూ కొంత స్థలం వదిలి  మూడడుగుల ఎత్తులో ఒక ప్రాకారం ( గోడ ) ఉంటుంది. ఇందులోనే ఆవు కుటుంబం ఉంటుంది. అంటే దూడతో సహా, ఒక మగ ఆవు (ఎద్దు)తో కలిసి మూడు ఆవులు ఉంటాయి. అవి బయటకి రాకుండా ఒక చిన్న గేటు కూడా ఉంటుంది. ఈ ప్రాకారానికి చుట్టూ మరో ప్రాకారం ఉంటుంది. అందులోంచి మనం నడవడానికి వీలుగా ఉంటుంది. 


ఇది లోపలి ప్రాకారం. ఇందులోనే గోవులుంటాయి చూడండి. అలాగే ఇక్కడ ఒక హుండీ కూడా ఉంది చూడండి.    


ఈలోపలి ప్రాకారానికి చుట్టూ ఇంకో ప్రాకారం ఉంది. ఇందులో మనం ఉండి, ఆ గోవులకి పూజ చేసుకోవచ్చును. సనాతన హిందూ ధర్మాలలో గోపూజ చాలా శ్రేష్టమైనది. సర్వ పాపాలూ తొలగించుకోవచ్చును.. అలాగే చాలా పుణ్యాలూ పొందవచ్చును. అది ఇక్కడ చాలా తేలికగా, సురక్షితముగా, ధైర్యముగా చేసుకోవచ్చును. గోపూజకి రూ. 25 తీసుకుంటారు. గో గ్రాసానికి (గోవు ఆహారము = పచ్చిక ) రూ. 5 తీసుకుంటారు. నేను సమయం లేక గో గ్రాసము పెట్టాను. అక్కడే డబ్బులు తీసుకొని, కొంత వాటి ఆహారముని మనకు ఇస్తారు. మనం మన చేతులతో ఆ ఆ గ్రాసాన్ని వాటికి ఆహారముగా అందించాలి. ఇలా చెయ్యటం చాలా మంచిది అని  పురాణాల్లో చదివా. అలా చెయ్యాలన్న కోరిక నేడు తీరింది. 


నేను అందిస్తున్న పచ్చికని హాయిగా భుజిస్తున్న ఆవు దూడ. 


శ్రీ గోకులం కి ఎదురుగా, అంటే గుడికి వెళ్ళే దారికి కుడివైపున ఇలా కనపడే "  రాధాకృష్ణుల "  అద్దాల మందిరం కనిపిస్తుంది. చాలా చిన్నగా ఉన్నా, చాలా బాగుంటుంది. మధ్యలో పైకప్పు నుండి వ్రేలాడే ఊయలలో అలంకరణ చేసిన రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. ఈ మందిరము చుట్టూరా ఉన్న గోడలకి అద్దాలు ఉంటాయి. అంటే ప్రతిబింబాలు అనేకానేకంగా కనిపిస్తాయి. ఆ మందిరం చుట్టూ బయట ఉన్న పరిసరాలు కూడా చాలా ఆహ్లాదకరముగా ఉంటాయి. 


రాధాకృష్ణుల మందిరం ఇలా ఉంటుంది. 


ఆ రాధాకృష్ణుల మందిరానికి ఎడమవైపున ఉన్న కొండకి ఒక స్లాబ్ లా వేసి, దానిపైన ఆదిశంకరాచార్యులు - తన శిష్యులకు బోధన చేస్తున్న దృశ్యాన్ని సుందరముగా ప్రతిమల రూపములో చేసి, అమర్చారు. ఇలా చెయ్యటం చాలా బాగుంది. 


ఆ విగ్రహాల పైన చక్కని మడపం ఆకారములో నీడ కలిపిస్తే - ఆ విగ్రహాలకి ఎండా, వానల నుండి రక్షణగా ఉంటుంది. 

(..continue / ఇంకా ఉంది.)

No comments:

Related Posts with Thumbnails