మొన్న నా మిత్రుని కూతురి వివాహం సందర్భముగా వరంగల్ కి వెళ్లాను. అక్కడ కొన్ని చారిత్రాత్మక, స్థానిక ప్రదేశాలని సందర్శించాను. అవి ఇప్పుడు మీకోసం చూపిస్తాను. ( పెద్దగా చూసేందుకై ఆ ఫోటోల మీద క్లిక్ చెయ్యండి. అలాగే ఈ ఫోటోల సైజులు అన్నీ - త్వరగా తెరచుకోవటానికి కుదించబడ్డాయి.)
ఇదే ఆ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. రెండు అంతస్థుల మీద మూడో అంతస్థులో ( అంటే గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్థు మీద ఉండే మరో అంతస్థు లో ) ఈ ఆలయాన్ని నిర్మించారు. వరంగల లోని భద్రకాళి ఆలయ దారిలో, మొదటగా వచ్చేది ఈ ఆలయమే. భద్రకాళి ఆలయానికి క్రొద్ది అడుగుల దూరములో ఈ ఆలయం ఉంది. నల్లని గ్రానైట్ మెట్ల మీదుగా వెళ్ళితే, పాలరాతి బండలున్న మంటపానికి చేరుకుంటాం. గుడి ముందు మెట్ల వరకూ నేరుగా వాహనములో వెళ్ళవచ్చును.
ఇలా పాలరాతి గచ్చు ఉన్న ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి అటూ, ఇటూ మరోరెండు చిన్న ఆలయాలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయములో - శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామీ వారు, సతీమణి గోవిందమ్మ గార్ల నల్లని శిలామూర్తులు కనిపిస్తాయి.
ఆలయం లోని గచ్చు మీద ఉన్న పాలరాయి బండ డిజైన్.
సమయాభావం వల్ల క్రింద అంతస్థులలోకి వెళ్ళలేక పోయాను.
No comments:
Post a Comment