ఫేస్ బుక్ లో పుట్టినరోజు నోటిఫికేషన్ - 1 తరవాత మిగిలిన ఆ రెండో టెక్నిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. మీ ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యండి.
2. మీ ప్రొఫైల్ హోమ్ పేజీ ఓపెన్ చెయ్యండి.
3. మీ ప్రొఫైల్ ఫోటో క్రింద ఉండే Favorites లో Events మీద క్లిక్ చేసి, ( పైన ఫోటోలో వృత్తములో చూపినట్లుగా ) ఓపెన్ చెయ్యండి. అప్పుడు ఇలా ఈవెంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
4. అప్పుడు ఇలా ఈవెంట్స్ పేజీ ఓపెన్ అవుతుంది. మీరు పైన ఎడమ మూలన ఉన్న Events ప్రక్కన ఉన్న List ని నొక్కితే మీకు ఈవెంట్స్, పుట్టినరోజులు అన్నీ ఇక్కడ ఎప్పుడెప్పుడు ఉన్నాయో అన్నీ తెలిసిపోతాయి. ఇలా ఇంకో సంవత్సరము కి పైగా వచ్చే రోజులలో ఏమేమి ఈవెంట్స్, పుట్టినరోజులు, ఆహ్వానాలు.. ఉన్నాయో తెలిసిపోతుంది.
5. Calender ని నొక్కితే ఒక నెల పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏ ఏ రోజుల్లో - ఏమేమి ఈవెంట్స్, పుట్టినరోజులు, ఆహ్వానాలు ఉన్నాయో తెలిసిపోతుంది.
ఇలా చూసుకొని, మీ ఫ్రెండ్స్ పుట్టినరోజులు ఎప్పుడో తేలికగా తెలుసుకోవచ్చును.
No comments:
Post a Comment