జీవితం లోని శక్తి, మాధుర్యం అంటే ఇదే..
జీవితం యొక్క శక్తీ, జీవనం లోని మాధుర్యం చాలా గొప్పది. పైన ఉన్న చిత్రమే చూడండి. ఎంత ప్రేరణగా ఉంది కదూ.. ఎక్కడో రోడ్డు మీదున్న చెట్టుని కొట్టేసి, ఆ చెట్టు మొదలు మీద నుండి తారు రోడ్డు వేసి, బలముగా లెవల్ మెషీన్ తో త్రోక్కించినా, ఆ చెట్టు జీవితం మీద ఆశ కోల్పోలేదు. తగిన వనరులు, సమయం రాగానే తన మీద ఉన్న బలమైన తారు బంధాన్ని కూడా అవలీలగా బ్రద్దలు కొట్టి, వాటి మధ్యనుండే తలెత్తుకొని సగర్వముగా ఎదిగింది. అదీ జీవితానికి ఉన్న గొప్ప బలం.
కాబట్టి - పరిస్థితులు ఎంతగా మనల్ని అణగద్రొక్కినా, జీవితములో సర్వం కోల్పోయినా, ఇంకా నాకు ఏమీ మిగల్లేదు నాకు... అని అనిపించినా సమయాల్లో పై చిత్రాన్ని ప్రేరణగా తీసుకోండి. మీ మనసులో ఏర్పడిన భయాలు పటాపంచలు అవుతాయి. మీలో తెలీని శక్తీ, ఉత్సాహం కలుగుతుంది.
No comments:
Post a Comment