కొందరు - మీకు ఎంతో సహాయం చేస్తున్నానని అనిపించేలా నటిస్తారు. వారితో కాసింత జాగ్రత్తగా ఉండండి.
అవును.. మనకు జీవితములో ఎందరో సహాయం చేస్తారు.. చేస్తుంటారు. అందులో కొందరు మనకి ఎంతో సహాయం చేస్తున్నామని అందరి ముందటా చేస్తున్న తమ సహాయాన్ని ప్రదర్శిస్తుంటారు. నిజానికి అది చాలా చిన్నది. కానీ పెద్దగా చేస్తున్నామని / ఎంతో చేస్తున్నామనే అర్థం వచ్చేలా చేస్తారు. ఒక మాటలో చెప్పాలీ అంటే - పావలా సాయం చేసి, వంద రూపాయల సాయం చేసినట్లుగా ఉంటుంది.
పై ఫోటో లోనే చూడండి. గోతిలో ఉన్నవాడిని పైకి లాగటానికి, పైన ఉన్నవాడు చేయి అందిస్తున్నాడు.. కానీ ఆ చేయి దూరం సరిపోదు. అయినా అందిస్తూనే ఉన్నాడు. అతని ప్రక్కన ఒక నిచ్చెన కూడా ఉంది. అది ఆ గోతిలో ఉన్నవాడిని పైకి తేలికగా వచ్చేలా చేస్తుంది. అయినా అది ఇవ్వక ఏదో సహాయం చేస్తున్నట్లుగా బిల్డప్. క్రిందవాడికి ఆ నిచ్చెన కనిపించదు. పైన ఉన్నవాడు తనని రక్షించటానికి శాయశక్తులా కృషి చేస్తున్నాడు అని అనుకుంటున్నాడు.. అచ్చు ఇలాగే ఉంటుంది - కొందరి సహాయం. వీరితో కాసింత జాగ్రత్తగా ఉండండి.
No comments:
Post a Comment