నీ అంగీకారం లేకుండా నీ ఆత్మగౌరవాన్ని ఎవరూ తగ్గించలేరు.
నిజమే ! గౌరవం వేరు.. ఆత్మ గౌరవం వేరు. గౌరవం అనేది ఇతరులు మనకి ఇచ్చేది. ఉదాహరణకి ఒక ఇంటికి గానీ, సభకి, సమావేశానికి గానీ వెళితే అక్కడ మనకి సముచిత స్థాయిలో మర్యాద దొరికితే / ఇస్తే అది గౌరవం. అదే ఆత్మ గౌరవం అంటే - మనకి మనం గౌరవం ఇచ్చుకోవడం. అంటే మనలోని మనిషికి మనం మర్యాద ఇచ్చుకోవడం. ఈ రెండింటికీ ముఖ్యమైన తేడా ఏమిటంటే - మన ప్రమేయం లేకుండానే ఇతరులు మన గౌరవం తగ్గించగలరు. కానీ మన ఆత్మ గౌరవాన్ని మనం తప్ప ఎవరూ తగ్గించలేరు.
ఉదాహరణకి : మనం ఒక సమావేశానికి వెళ్ళితే అక్కడ ఎవరో మన తప్పు లేకున్నా మనల్ని కించపరిచినట్లు మాట్లాడితే - అది విని తగు సమాధానం ఇవ్వక అలాగే భరించామే అనుకోండి.. అప్పుడు మన ఆత్మ గౌరవాన్ని మనమే తగ్గించుకున్నవారిమి అవుతాం.
అలాని ఈ ఆత్మ గౌరవం విషయంలో కాసింత అతిగా చేస్తే - అంటే బాగా పట్టించుకుంటే దెబ్బ తినేదీ మనమే అని బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా బాగా చేసి దెబ్బతిన్న చక్కని ఉదాహరణగా మహాభారత గాధ లోని దుర్యోధనుడు @ సుయోధనుడు కానవస్తాడు.
2 comments:
చక్కగా చెప్పారు.
ధన్యవాదములు అనూ గారూ!
Post a Comment