Tuesday, February 5, 2013

I miss you friend..

ఫిబ్రవరి 5


మిత్రమా..! 
మీ స్నేహ జీవితాన ఒక శ్రేయోభిలాషిలా ఉన్న నేను, ఇదేరోజున ఒక ముద్దాయిలా దూరం అయ్యాను. అలా ఎందుకు చేశావు అని మీరు అడగలేదు. నేను చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.! 
నేను మీకు దూరమైతే - మీరు మరింత సంతోషముగా ఉంటారని అలా దూరమయ్యాను. ఉన్నారు కూడా.. మిమ్మల్ని బాధ పెట్టనని మాటిచ్చాను. నేనుంటే సంతోషముగా మీరుండరు. అందుకే నామీద మీకు అసహ్యం కలిగేలా చేశాను. దూరమయ్యాను. నా నేస్తం సంతోషముగా ఉంటుందీ అంటే అంతకన్నా ఈ ప్రపంచములో నాకు కావలసింది ఏముందీ..?

ప్రేమే కాదు స్నేహం కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. నమ్మకమే జీవితం అన్నట్లే - స్నేహం కూడా నమ్మకం పునాది మీదే ఆధారపడుతుంది. అవతలివారికి మనమీద నమ్మకం ఎప్పుడైతే తొలగిపోతుందో - ఇక దూరంగా ఉండటం చాలా మంచిది. పూర్తిగా దూరం కానవసరం లేదు.. వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వరకూ కాదు. వారికి ఎప్పుడైనా మీనుండి మాత్రమే అయ్యే సహాయం అవసరమయ్యేటప్పుడు కనీస అందుబాటు దూరములో ఉంటే చాలు. అంతవరకూ బాగున్న స్నేహం ఒక్కసారిగా దూరం అయితే ఆ ఇద్దరూ లోలోన కుమిలిపోతూనే ఉంటారు. ఎదుటివారు బాగుండాలి అని కోరుకుంటుంటారు. కాలమే ఇక బాధని తీర్చాలి.  

నిజానికి ఇలా విడిపోవటం చాలా బాధని కలుగజేస్తుంది. మామూలుగా చేసిన స్నేహాల్లో తొందరగానే విడిపోతారు. రెండుమూడు రోజుల్లో తేరుకుంటారు. కానీ మనసుతో స్నేహం చేసినప్పుడు మాత్రం - ఆ బాధ అంత తొందరగా తీరదు. వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యముగా ఇరువురి మధ్యా వచ్చిన అపోహలు ఏమిటో తెలుసుకొని, చర్చించుకుంటే అంతా సర్దుకుంటుంది. కానీ అలా చెయ్యటానికి అహం ( Ego ) అడ్డు వస్తుంది. అయినా స్నేహితునితో మాట్లాడటానికి అహం ఎందుకూ.. నిజానికి ఆ అహమే పెద్ద అడ్డు. 

ఒక్క నిముషం భరించండి. ఆ అహం పటాపంచలు అవుతాయి. దూరం అయిన స్నేహితునితో మాట్లాడండి. లేదా మధ్యవర్తితో మాట్లాడించండి. ఎక్కడ మనస్పర్థలు జరిగాయో, ఆ అంశాల మీద ఇద్దరూ మనసు విప్పి చర్చించుకోండి. ఒకరి మాటలకు లేని పోని భేషజాలకి పోకుండా నిజాయితీగా సమాధానం ఇవ్వండి. అది ఒక మెట్టుదిగి మాట్లాడినట్లుగా ఉండాలి. కాసేపట్లో అంతా మామూలు అవుతుంది. పూర్వం లాగే మళ్ళీ మంచి మిత్రుల్లా కలసిపోతారు. 

స్నేహం అన్నాక, పొరపొచ్చాలు రావటం సహజమే, భార్యాభర్తల బంధములో ఉన్న అలకలూ, కోల్డ్ వార్, గిల్లికజ్జాలు .. ఇక్కడా మామూలే. మళ్ళీ కలిస్తే - ఆ స్నేహానికి పట్టిన దోషాలు, దిష్టీ పోయాయి అనుకోవాలి. హ హ హ్హ. 

2 comments:

Chinni said...

మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది. బాగా వ్రాశారు. సర్దుకుపోయే తత్త్వం ఉన్నంతవరకు ఫరవాలేదు కాని ప్రతిసారీ ఎవరు తగ్గారో వాళ్లే తగ్గుతారులే అని కొంతమంది అనుకుంటారు. నమ్మకం లేని ఏ బంధమైనా నిలవదు. అది చాలా వరకూ పొగొట్టుకోకుండా ఉండటం మేలు.

Raj said...

ధన్యవాదములు.. మీ కామెంట్ బాగా నచ్చేసింది నాకు..

Related Posts with Thumbnails