Telugu Group లో నేను ఒకరి ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలు. మీలో ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని, కాపీ, పేస్ట్ చేస్తున్నాను. [తెలుగుబ్లా గు:21977]
1) నేను బరహా వాడి తెలుగులో టైపు చేస్తున్నాను. బరహా పేడ్’లో అయినా, వర్డ్’లో అయినా టైపు చేసేటప్పుడు ‘కర్సర్’ బాగా కదిలిపోయి ఇక్కడా, అక్కడా కదిలిపోయి రక రకాల ‘టేబ్’లు’ తెరచి తెగ ఇబ్బంది పెడుతోంది. దాదాపు 170 పైన పోస్టింగులు చేసినా ఇంత వరకు దీనికి నివారణ కనిపెట్టలేక పోయాను. అలాగే నెట్టుకొస్తున్నాను. కర్సర్ కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
2) వర్డ్’లో టైపు చేసాక సేఫ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ఫైల్ సబ్’మిషన్ ఎర్రర్’ అని చూపిస్తూ , అదే ఫైల్లో సేవ్ కావడం లేదు ! మాటి మాటికీ ఫైలు పేరు మార్చ వలసి వస్తోంది ! దీనికి ఏం చేయాలి ?
3) లేప్ టాప్ త్వరగాఅ వేడి ఎక్కిపోతోంది. అప్పుడప్పుడు, బహుశా టెంపరేచర్ కంట్రోల్ వల్లనేనేమో కంప్యూటర్ ఉన్నట్లుంది ,‘డెడ్’ అయి పోతోంది ! మళ్లీ సిస్టంని ఆన్ చేసి ఫైలు తెరచేసరికి, చేసినదంతా చెరిగిపోతోంది,
మీ సలహాల కోసం ఎదురు చూస్తుంటాను ---
=======================
1) నేను బరహా వాడి తెలుగులో టైపు చేస్తున్నాను. బరహా పేడ్’లో అయినా, వర్డ్’లో అయినా టైపు చేసేటప్పుడు ‘కర్సర్’ బాగా కదిలిపోయి ఇక్కడా, అక్కడా కదిలిపోయి రక రకాల ‘టేబ్’లు’ తెరచి తెగ ఇబ్బంది పెడుతోంది. దాదాపు 170 పైన పోస్టింగులు చేసినా ఇంత వరకు దీనికి నివారణ కనిపెట్టలేక పోయాను. అలాగే నెట్టుకొస్తున్నాను. కర్సర్ కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
2) వర్డ్’లో టైపు చేసాక సేఫ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ఫైల్ సబ్’మిషన్ ఎర్రర్’ అని చూపిస్తూ , అదే ఫైల్లో సేవ్ కావడం లేదు ! మాటి మాటికీ ఫైలు పేరు మార్చ వలసి వస్తోంది ! దీనికి ఏం చేయాలి ?
3) లేప్ టాప్ త్వరగాఅ వేడి ఎక్కిపోతోంది. అప్పుడప్పుడు, బహుశా టెంపరేచర్ కంట్రోల్ వల్లనేనేమో కంప్యూటర్ ఉన్నట్లుంది ,‘డెడ్’ అయి పోతోంది ! మళ్లీ సిస్టంని ఆన్ చేసి ఫైలు తెరచేసరికి, చేసినదంతా చెరిగిపోతోంది,
మీ సలహాల కోసం ఎదురు చూస్తుంటాను ---
=======================
మీరు పడుతున్న ఇబ్బందులు చదివాను. అవి తొలగటానికి - నా సలహాలు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి..
1. మీరు వాడుతున్న బరహా సాఫ్ట్వేర్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. బరహా ప్యాడ్ లో మీరు టైప్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ సమస్యల్లా మౌస్ పాయింట్ ' కర్సర్ ' వల్లనే. ఈ సమస్య మీకు డెస్క్ టాప్ వాడుతున్నప్పుడా? లేదా లాప్ టాప్ వాడుతున్నప్పుడా తెలియచేయలేదు..
డెస్క్ టాప్ లో ఇలా కర్సర్ కదలటానికి గల కారణాల్లో ఒకటి - మీరు వైర్ లెస్ మౌస్ వాడటం వలన కూడా జరుగుతుంది.
- అందులోని బ్యాటరీలు వీక్ గా ఉన్నా,
- మౌస్ లో సరిగా అమర్చలేకున్నా,
- మౌస్ - రిసీవర్ కి సరిగా కనెక్ట్ అవకున్నా,
- రీచార్జ్ బ్యాటరీలు సరిగా చార్జ్ కాకున్నా.. అలాగే కర్సర్ కదిలిపోతుంది. నేను వాడేది వైర్ లెస్ కీ బోర్డ్, మౌస్ కాబట్టి అలా చెబుతున్నాను.
ఒకవేళ మీది లాప్ టాప్ అయితే - మౌస్ పాడ్ మీద వత్తిడి ఎక్కువై, లేదా అది మరీ సున్నితం అవటం మూలాన అలా జరుగుతుండవచ్చును.
ఇక టాబ్స్ ఓపెన్ చెయ్యటం :
ఇది మీ సిస్టం నెమ్మదిని తెలియచేస్తున్నది. ఇది మీరు ఎక్కువగా మౌస్ క్లిక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీరు నొక్కడమే - మీకు తెలీకుండా డబల్ డబల్ సార్లు నొక్కుతున్నారనుకుంటాను. మొదటిసారి నొక్కగానే విండోస్ వెంటనే తెరచుకోలేదని, సరిగా నోక్కలేదేమో అనుకొని డబల్ క్లిక్ చేస్తే, మీ సిస్టం నెమ్మది వల్ల కాసింత ఆలస్యముగా ట్యాబ్స్ ఓపెన్ అవుతున్నాయి అనుకుంటాను. అలా ట్యాబ్స్ రావటానికి - ముఖ్యముగా ఇదే కారణంగా ఉంటుంది. సాధారణముగా సిస్టం నెమ్మదనానికి ఈ క్రింది కారణాలు ఉంటాయి.
- మీరు మీ పని చేసుకుంటున్నప్పుడు ఏవైనా ఎక్కువ ర్యాం మెమొరీ వాడుతున్న ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే అలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఇదొక్కటే కాదు. చాలా కారణాలు ఉంటాయి.
- స్క్రీన్ సేవర్ ని హై రిజల్యూషన్ లో వాడటం,
- ర్యాం RAM మేమోరీని ఎక్కువగా వాడే ప్రోగ్రామ్స్ ఓపెన్ చెయ్యటం (యు ట్యూబ్ వీడియోలు పనిచేస్తున్నప్పుడు వీక్షించటం వంటివి),
- అలాగే ఎక్కువ ట్యాబ్స్ తెరచి ఉంచి వాడకుండా ఓపెన్ చేసి ఉంచటం..
- మీ ఆపరేటింగ్ సిస్టం My Documents లో ఫైల్స్ ఎక్కువైపోయి కూడా అలా మీ సిస్టం నెమ్మదిగా పనిచేస్తుంది.
- మీ సిస్టం ర్యాం తక్కువ మెమొరీదై ఉండవచ్చును. ఇంకా చెప్పాలీ అంటే DDR 1 లేదా 2 లో 1 GB కన్నా తక్కువ అయి ఉండొచ్చు. ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయే అనుకుందాం..
- బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. వాటిని మీరు మీ సిస్టం లోని టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి వాటిని " కిల్ " చెయ్యాలి (ఆపాలి).
- ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పార్టిషన్ లోని ఖాళీ స్థలం ఒక జీబీ ( 1 GB ) కన్నా తక్కువ అయిన సందర్భాల్లో కూడా జరుగుతుంది.
- సాఫ్ట్ వేర్ అప్డేట్స్ పెట్టినప్పుడు / అవుతున్నప్పుడు కూడా ఇలా అవుతుంది.
- మీ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చును.
- మీ సిస్టం Disk fragmentation వల్ల కూడా అలా సిస్టం నెమ్మదిగా పనిచేస్తుంది.
- ఏదైనా మాల్వేర్ అటాక్ జరిగి ఉండొచ్చు. ఇదే కారణం అయితే పాత అంటి వైరస్ సాఫ్ట్ వేర్ తీసేసి, క్రొత్తగా అంటి సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చెయ్యండి. ఇది మీ సిస్టములో అంతర్జాల కనెక్షన్ కనెక్ట్ అయ్యాక ఆ పని చెయ్యండి. అలా చేస్తే అప్డేట్స్ అన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి.
2. ఎమ్మెస్ వర్డ్ గురించి అంతగా తెలీదు. కారణం దాన్ని ఎప్పుడూ వాడలేదు.. బ్లాగులో నేరుగా టైప్ చేస్తాను కాబట్టి అంతగా తెలీదు. మీరు నేరుగా బ్లాగ్ లోనే టైప్ చేస్తే మీకు చాలా సమయం సేవ్ అవుతుంది అనుకుంటాను. " ఆటోసేవ్ " అనే ఆప్షన్ ని మీరు ఎన్నుకుంటే - టైప్ చెయ్యగానే వెంటనే సేవ్ అవుతుంది. మధ్యలో పవర్ పోయినా సేవ్ అయి ఉండటంతో మీరు టైప్ చేసినదంతా కోల్పోరు. మీరు ఆఫ్ లైన్ లో బ్లాగ్ వ్రాసుకుంటానూ అంటే వర్డ్ యే చాలా మంచిది. కానీ వ్రాస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు Control + Save నోక్కాల్సి ఉంటుంది. అలా మరిచామా! పవర్ పోతే వ్రాసినదంతా పోతుంది.
మీరు వర్డ్ లో వ్రాసింది సేవ్ చేసుకున్నాక, అందులోనే మళ్ళీ వ్రాయాలనుకున్నప్పుడు మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసి, అందులోనే వ్రాసి, సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇంకో ఫైల్ గా సేవ్ కాదు. ఇది మీకు తెలియనిది కాదు. ఇందాక వర్డ్ పరీక్షించి చూశాను. అంతా బాగానే ఉంది. వేరే ఫైల్ ఓపెన్ చేసి అందులో వ్రాసి, మొదటి ఫైల్ పేరు మీద సేవ్ చేస్తే - అప్పుడు తప్పకుండా ఎర్రర్ వస్తుంది. అప్పుడు అక్కడ ఒక చిట్కా పాటించండి. అది ఏమిటంటే - మీరు సేవ్ చేస్తునపుడు, ముందున్న ఫైల్ పేరు ప్రక్కన 1, 2, 3, 4.. ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఒకదాని గురించి వ్రాస్తున్న ఫైల్స్ అన్నీ వరుసగా సేవ్ అవుతాయి.
3. లాప్ టాప్ త్వరగా వేడి అవుతుంది అంటే లోపల ఉన్న కూలింగ్ ఫ్యాన్ తిరగటం లేదేమో.. ఒకసారి సరి చూడండి. దానికి అంటుకొని ఉన్న దుమ్ము వల్ల కూడా అది పనిచెయ్యదు. ఆ ఫ్యాన్ కి అడ్డముగా ఏదైనా వుండి ఉండవచ్చును. దీనికి లాపీ అధీకృత సర్విస్ పర్సన్ అవసరం. ఒకవేళ ఫ్యాన్ సరిగా ఉంటే - చిన్న ఫ్యాన్స్ ఉన్న లాప్ టాప్ స్టాండ్ మార్కెట్లో దొరుకుతుంది. దాని మీద మీ లాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకోవటం వలన మీ లాప్ టాప్ మరింత సమర్థవంతముగా పనిచేస్తుంది.
మళ్ళీ తెరిచేసరికి మీరు టైప్ చేసినదంతా పోతుంది అన్నారు.. అది ఎప్పటికప్పుడు కంట్రోల్ + సేవ్ నోక్కాల్సిందే. దీనికి మరింత వివరణ రెండవ సమాధానములో చూడండి.
2 comments:
Use full post Raj gaaru ..Thank you very much.
Welcome..
Post a Comment