అర్థం చేసుకోవటానికి ఒక జీవితకాలం పడుతుందేమో కానీ, అపార్థం చేసుకోవటానికి ఒక నిమిషం చాలు.
నిజమే కదా...! ఒక వ్యక్తి మనసుని, అతని వ్యక్తిత్వాన్నీ, చేస్తున్న పనుల్నీ, పలికే మాటలనీ, నడవడికనీ... అర్థం చేసుకోవటానికి చాలాకాలం పడుతుంది. అది ఒక్కోసారి జీవిత కాలం కూడా అవచ్చును. కానీ అదే ఎదుటివ్యక్తిని - అపార్థం చేసుకోవటానికి - కేవలం ఒక నిమిషం మాత్రమే చాలు. అంటే ఒక మనిషిని తప్పుగా అంచనా వేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. అందుకే ఒక మనిషి మీద అంచనాకి వచ్చే ముందు కాసింత సమయం తీసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని, ఒక అభిప్రాయానికి రండి. అలా చేస్తే మీ జీవితాన ఒకరి పరిచయం / స్నేహం / ప్రేమ / అభిమానం .. ఇవేవీ మీ నుండి దూరం కాదు.
ఒకవేళ దూరం అయితే - వెంటనే ఒక మెట్టు దిగి, ఆ అవతలి వ్యక్తిని తొందరగా కలిసి, క్షమాపణ వేడుకోండి. మీ తప్పుని నిర్లజ్జగా ఒప్పేసుకోండి. ఇది చాలా నిజాయితీగా చెయ్యండి. అప్పుడు ఎప్పటిలా మీ అనుబంధం కొనసాగవచ్చును.
No comments:
Post a Comment