Telugu quotations
నమ్మకం..
ఇది ఏర్పడాలి అంటే కొన్ని సంవత్సరాలు కావాలి.
కానీ నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు.
నిజమే కదూ! స్నేహితులలో కానీ, బంధువుల్లో కానీ, చుట్టుప్రక్కల ఉన్నవారి మీద కానీ.. నమ్మకం ఏర్పడాలీ అంటే చాలా కాలం సమయం తీసుకుంటుంది. అదే నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు. ఇంకోరకముగా చెప్పాలీ అంటే - బొట్టు బొట్టు చేరిస్తే కుండలో నీరు నిండినట్లే, ఆడే కుండ పగిలితే అంత సమయం తీసుకొని చేర్చిన నీరు, కొద్ది క్షణాల్లో ఆ కుండ నుండి వెళ్ళిపోతాయి. ఇదీ అంతే!
ఒకసారి మీ మీద ఏర్పడిన నమ్మకాలని వమ్ము చేసేలా అసలు ప్రయత్నించకండి. అవసరమైతే కొంత త్యాగం చేసి, మీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి. కాసింత ఓపికగా, నెమ్మదిగా ఉండండి. ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన అసలు విషయమేమిటో, ఆ విషయం ఎలా వచ్చిందో, ఏమి చేస్తే ఆ విషయం తొలగిపోతుందో - ఆలోచించండి. ఆ దిశగా ప్రయత్నాలు ఆరభించండి. అలా చేస్తున్నప్పుడు మరింతగా అడ్డంకులు ఎదురవుతాయి. ఈ లోకం మీ మాటలు నమ్మదు. అయినా ప్రయత్న లోపం చెయ్యకండి. ఆశాభావం తో ముందుకు సాగండి.
ఇలా చేస్తున్న ప్రయత్నాలలో - ఎవరినీ, ఎక్కడా కించపరిచే మాటలు తూలకండి. ఇవి మరీ ప్రమాదకరం. ఎందుకంటే ఒకసారి పౌరుష మాటలు అన్నామూ అంటే - వెనక్కి తీసుకోలేము. ఎదుటివారిని ఆ మాటలు తాకాక, వారు మీ పట్ల మరింతగా కఠినముగా మారుతారు. అప్పుడు ఎంత ప్రయత్నించినా - మనసు విరిగిపోయి, మీరు చేసే ప్రయత్నాల పట్ల విశ్వాసం చూపించరు. ఫలితముగా వారు మీకు శాశ్వతముగా దూరమై పోతారు.
3 comments:
చాలా బావుంది. మీరు చెప్పినది నిజం. థాంక్స్ అండీ!
నచ్చి, కామెంటేట్టినందులకు ధన్యవాదములు.
Nice
Post a Comment