Monday, December 3, 2012

Good Morning - 198


సమస్తాన్ని (ప్రకృతిలో అన్నింటినీ) శిశిరకాలం నాశనం చేస్తుంది. అది శిశిర కాలం (ఆకురాలు ఋతువు) విధి. ప్రకృతిలోని కొన్ని మాత్రమే ఆ కాలం బారిన పడకుండా ఉంటాయి. మిగతా అన్నీ ఎండిపోయి, జీవం కోల్పోయి ఉంటాయి. అలా ఉన్న ప్రకృతిని శిశిర కాలం తరవాత వచ్చే వసంత ఋతువు బాగుచేస్తుంది. ప్రకృతి తనంతట తానుగా అలా బాగుచేసుకుంటుంది. 

అలాగే రాత్రి పగలు మధ్య అంటే - పుట్టినప్పటినుండి, చనిపోయే మధ్యన ఉండే జీవితములో - ఒక మంచి స్నేహం కూడా వసంత ఋతువు లాగే ఉంటుంది. అది నిజం కూడా. జీవితాన సర్వం కోల్పోయినప్పుడు (శిశిర ఋతువు) మళ్ళీ క్రొత్తగా జీవితం పునర్మించుకోవటానికి (వసంతకాలం) ఒక మంచి స్నేహం ఉంటే చాలు. ఆ స్నేహం అండన జీవితంను మళ్ళీ చిగిరించుకోవచ్చును. అది సత్యం. నాకూ అలాంటి అనుభవం ఉంది. వీలు చేసుకొని చెబుతాను ఎపుడైనా.

ప్రకృతి లోని ఋతువులతో, స్నేహాన్ని కలిపి చిన్న మాటల్లో (జీవితానికి) పెద్ద అర్థం ఉంది కదూ.. 

No comments:

Related Posts with Thumbnails