Sunday, December 16, 2012

Good Morning - 208


ఏదైనా విషయాన్ని అంగీకరించటముగానీ, అనంగీకరించటం గానీ మనతో బాటు చేసేవాళ్ళతో చాలా కలుపుగోలుగా ఉంటాం. వారి సహచర్యాన్ని ఎప్పుడూ కోరుకుంటాము కూడా. వారితోనే మన సంతోషాలనీ, ఆనందాలని, ఆలోచనలనీ పంచుకుంటాము. మనం అవును అంటే అవును, కాదు అంటే కాదు అనే వారితో చాలా సంతోషముగా సమయం గడిచిపోతుంది. కానీ, నిజానికి అలాంటివారితో మనం జీవితాన ఎదగలేము. నమ్మలేకున్నా, అర్థరహితంగా అనిపించినా - ఇది మాత్రం నిజం. 

మరీ ఖచ్చితముగా చెప్పాలీ అంటే - మనం చేసే పనులని ప్రశ్నించే సన్నిహితులు "మనవాళ్ళలో " ఉండాలి. అలాంటివారు ఉంటే మొదట్లో చికాకుగా, వీళ్ళు వేస్ట్ గాళ్ళు అని చిరాకు పడ్డా, చాలాసార్లు వారు మన అభిప్రాయాన్ని సమ్మతించనప్పుడు, మనం ఏమాత్రం వారి మీద చీకాకు పడకూడదు. అలా చేస్తే మనం జీవితాన ఎదిగే దారులని మన చేజేతులా కోల్పోతున్నాం అన్నమాటే! 

ఎందుకు అలా మన అభిప్రాయముతో ఏకీభవించటం లేదు - అని వారిని ప్రశ్నించండి. 
వారు చెప్పే సమాధానాన్ని సావధానముతో, శ్రద్ధగా వినండి. 
వారి చెప్పేది పూర్తిగా వినండి. 
సుత్తి చెబుతున్నాడు అనే ఆలోచనతో దయచేసి వినకండి. 
అలా చెప్పటం ముగిశాక, కొంత సేపు ఆలోచించండి. 
అలా అయ్యాక ఏమైనా సందేహాలు ఉంటే వాటిని అడగండి. 
అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. 
అప్పుడు వారు మన అభిప్రాయము / ఆలోచన సరియైనదా? కాదా? చెబుతారు. 
ఆ విశ్లేషనాత్మక అభిప్రాయం మన జీవితాలని ఖచ్చితముగా మారుస్తుంది. 
కనీసం మన ఆలోచన ధోరణి అయినా మారుతుంది.
అందువల్ల - మన చుట్టూ గల వారిలో కొందరిని " శ్రేయోభిలాషులని " ఎంచుకోవాలి. 

మొదట్లో నేనూ నా అభిప్రాయాలని అవుననే వారితోనే సమయం గడిపేవాడిని. నాకొక మిత్రురాలు పరిచయం అయ్యాక, ఇప్పుడు ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఇప్పుడు నేను చేసే ఒప్పులూ, తప్పులూ తెలుసుకుంటున్నాను. కొన్ని విషయాల్లో నేను చేసిన ఆలోచనలు ఎంతవరకు సబబు అని బాగా తెలుసుకున్నాను. మానసికముగా కాసింత పరిపక్వత మెల్లగా పెరగసాగింది. ఈ విషయం ఒప్పుకోవాలంటే కూడా బాగానే " గట్స్ " ఉండాలనుకోండి. అది వేరే విషయం. 

No comments:

Related Posts with Thumbnails