ఈ పరిచయాల జడిలో తడిసిపోయి, అలజడిని మరచిపోయాను, 
మీ చిరునవ్వుల సవ్వడిలో - శబ్దాన్ని కోపమనే శత్రువుని వదిలించుకున్నాను, 
మీరు పంచిన జ్ఞాపకాలలో మునిగి, అనురాగపు అలలపై తేలుతున్నాను. 
అంతే లేని అందాలు, కన్నీళ్ళే లేని బాధలు, 
బాధలే లేని కష్టాలు, కష్టాలే లేని జీవితం ఉండదేమో, 
అన్నీ ఉన్నా - 
నువ్వు - నాతో ఉన్నావన్న భావమే నన్నింకా బతికిస్తోంది.. 
ఈ జన్మకది చాలు నేస్తం.. 

 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment