ఈ ఫోటోలోని ఆ బాబుని చూడండి.. అమ్మకి కలిగిన, ఇంట్లోకి వచ్చిన క్రొత్త బుజ్జి పాపాయిని ఎలా హత్తుకున్నాడో చూశారా.. ఆ చిట్టి తల్లిని ఎంత మమకారం తో, వాత్సల్యంతో ఎలా దగ్గరికి తీసుకున్నాడో చూశారో కదూ.. అతడి మొహం లో వెలుగులూ, ఆ కౌగిలింతలో - నేను నేనున్నాను, ధీమాగా ఉండు అనే సందేశం, తన్మయత్వాన్ని - ఆ గుండెల నిండా నింపుకొన్నట్లు కళ్ళు మూసి మరీ ఆ భావనని ప్రకటించటం.. ఓహ్! అద్భుతం. ఈ బాలుడిని, ఆ సన్నివేశాన్ని ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ నీ మెచ్చుకోలేక ఉండలేకపోతున్నాను.
Friday, December 7, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment