మనిషి జనన మరణాల మధ్య దొరికే ఒకే ఒక్క అవకాశం జీవితం. పోరాటాలే తప్ప ఓటమి తెలియకూడదు. ప్రయత్నాలే తప్ప నిస్పృహలుండరాదు. ఆశాతత్వమే తప్ప నిరాశావాదం తలెత్తరాదు. అప్పుడు నీకు దక్కిన అవకాశం వందశాతం సద్వినియోగమే అవుతుంది.
ఎంత సరియైన మాటలు..
నిజమే! అన్ని జన్మలలో మనిషి జన్మ ఉత్తమమైనది.
జననానికీ, మరణానికీ మధ్య ఉన్న కాలమే జీవితం.
ఆ జీవితాన ఎన్నెన్నో సమస్యలు, అడ్డంకులు, అవరోధాలు..
వాటితో నిత్యం పోరాటాలు చెయ్యక తప్పదు.
ఆ పోరాటములో ఓటమి అస్సలు పొందకూడదు.
ఒకవేళ పొందినా - రెట్టించిన కసితో మళ్ళీ పోరాడి, గెలుపు కోసం కృషి చెయ్యాలి.
ఆ ప్రయత్నములో మనలో ఆశావాహ దృక్పథం ఉండాలి గానీ,
మనం గెలవలేం అన్న నిరాశా, నిస్పృహవాదం మన మదిలో అస్సలు ఏర్పడరాదు.
అలా చేసినప్పుడు మీకు దక్కిన ఆ అవకాశంని సంపూర్ణముగా ఉపయోగములోనికి తెచ్చుకున్నట్లే అవుతుంది.
No comments:
Post a Comment