తనని తాను తెలుసుకోవడం చాలా కష్టం.
దానికి తీవ్ర సాధన కావాలి.
మన వీపు గురించి మనకి తెలీనట్లే మన గురించి మనం ఏమాత్రం తెలుసుకోలేం. నిజానికి అది కష్టం కూడా. అంతెందుకు.. మీ గురించి మీరు చెప్పేసుకోండి, స్నేహం మీదనో, ప్రేమ మీదనో, మానవ బంధాల గురించో, మనమూ - మన పిల్లల గురించి ఉన్న అనుబంధం గురించో, జీవిత భాగస్వామి మధ్యన ఉన్న బంధం గురించో - ఇలా మనకి సంబంధించిన అంశాల మీద మనకి ఉన్న అభిప్రాయం ఏమిటో చెప్పమంటే - ఒకవేళ ఎవరూ అడగకున్నా, మీకు మీకుగా చెప్పుకోమంటే - రెండు, మూడు వాక్యాలు చెప్పేసి ఆగిపోతారు. కొందరికైతే ఏమి చెప్పాలో కూడా తెలీక తల గోక్కుంటారు.
ఇలాంటి స్థితిలో ఉన్నామూ అంటే - అది మన గురించి మనమేమిటో - మనమే తెలుసుకోలేదన్నమాట. ఇలా తెలుసుకోకున్నా ఏమీ కాదు. ఆకాశము నుండి ఏమీ కూలదు కూడా. కానీ మీరు కాస్త ప్రయత్నించి, మీ గురించి మిమ్మల్ని తెలుసుకోండి. అప్పుడు మీలో మీ జీవన శైలి మీద మీకు నమ్మకం కలిగి, మీలో చాలా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. అది మీ ముఖములో చాలా స్పష్టముగా ప్రతిఫలిస్తుంది. మీరు చాలా ఆనందముగా ఉంటారు కూడా.
నిజానికి ఇలా తెలుసుకోవటం చాలా కష్టమే!. అలా తెలుసుకోవాలంటే కొంతవరకూ మీ చుట్టూ ఉన్న పరిసరాలు, స్నేహ బృందం, ఆత్మీయుల అండా కావాలి. ఎక్కువగా అయితే మీమీదే ఆధారపడి ఉంటుంది అని మరచిపోవద్దు. ఇలా సాధన చెయ్యటం చాలా కష్టమే అయినా, సాధించాక చాలా మధురముగా ఉంటుంది.
2 comments:
సాధన చెయ్యాలని చెప్పారు బాగానే వున్నది, కాని ఎలా చెయ్యాలో చెప్పండి. తెలుసుకోవాలని కుతూహలంగా వున్నది.
ఈ సాధన ఎవరికీ వారు చెయ్యాల్సిందే. నాకంటే మీ గురించి మీకు తెలుసు కదా.. కనుక మీరే ప్రయత్నించాలి.
Post a Comment