Sunday, September 30, 2012
Saturday, September 29, 2012
Friday, September 28, 2012
Good morning - 146
నిజమే కదూ! మిత్రులూ, మన మంచి నడవడిక మాత్రమే మనల్ని ఈ ప్రపంచములో ఒక గుర్తింపును ఇస్తాయి. ఆ గుర్తింపు వల్ల మనం సంపద కలిగిన వారు వెళ్ళలేని చోటుకు కూడా తేలికగా వెళ్ళగలుగుతాము. ఆ చోటుల్లోని ఆనందాన్ని మనం అనుభవిస్తాము. డబ్బు ఉంటే ప్రతిదీ పొందవచ్చును అనుకుంటాము. కొంతవరకూ నిజం కావచ్చును. కానీ వాస్తవముగా డబ్బుతో అన్నీ పొందలేము. కొన్నింటిని పొందాలంటే - మంచి మిత్రుల సహకారం, మన నడవడిక తప్పనిసరి.
Wednesday, September 26, 2012
Tuesday, September 25, 2012
Sunday, September 23, 2012
Saturday, September 22, 2012
Friday, September 21, 2012
Thursday, September 20, 2012
Wednesday, September 19, 2012
Blog new look
బ్లాగర్ స్వరూపం పూర్తిగా మారింది. ఎప్పటినుండో మారుస్తాము.. మారుస్తున్నాము అంటూ ప్రకటించిన బ్లాగర్ వారు ఈరోజు వినాయక చవితి మంచిరోజు అన్నట్లు, మంచిగా, విఘ్నాలన్నీ తొలగి, ఆటంకాలు రాకుండా, బ్లాగర్లకి ఉపయోగకముగా ఉండాలని.. బ్లాగర్ల అభిమానం చూరగొనాలని ఈరోజే ప్రవేశ పెట్టారులా ఉంది.
నిజానికి ఇలా మార్చి చాలా రోజులయ్యింది. నాకు తెలిసీ ఆరు నెలలకి పైగానే ఉండొచ్చు. కానీ అప్పుడు అది ఐచ్చికం (Optional) ఇప్పుడు మాత్రం తప్పనిసరి చేశారు. ఇలా మార్చడం కూడా మీ హోం పేజీ వరకే. మీ బ్లాగ్ టెంప్లేట్ గానీ, డిజైన్ గానీ, అందులోని విడ్జెట్స్ (Widgets) గానీ ఏమీ మార్చలేదు. కేవలం మీ హోం పేజీ మార్చారు. కనుక మీరు ఏమీ కోల్పోరు.
ఈ క్రొత్త హోం డిజైన్ ని చూస్తే - కొద్దిగా అలవాటు చేసుకోవాలి. పాత వాటిలో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఒకేఒక ఇబ్బంది ఏమిటంటే - అవన్నీ ఎక్కడక్కడ ఏమి ఉన్నాయి, అందులో ఏమేమి ఉంటాయో, వాటిని నొక్కితే ఏమేమి టూల్స్ వస్తాయో.. అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంతే! ఒకరకముగా చెప్పాలీ అంటే ఈ క్రొత్త డిజైన్ - పాత డిజైన్ కన్నా కాసింత ఉపయోగకరముగానే ఉంది కూడా. కాలం మారినట్లు మనమూ మారాలి కదా..
మన బ్లాగులకి ఈ క్రోత్త రూపు రావటానికి మీరేమీ చెయ్యాల్సిన అవసరం లేదు. ఆ బ్లాగర్ వారే మారుస్తారు. ఇలా చేస్తే - వారికేమి లాభం అంటే - చాలా సింపుల్. హోం పేజీలో ఉన్న డిజైన్ వల్ల మారి సర్వర్ లలో కాసింత జాగా Space మిగులుతుంది. అది కాసింత KB లలో ఉన్నా, అన్ని బ్లాగుల్నీ కలిపితే GB లలోకి మారుతుంది.
మరోవిషయం ఏమిటంటే - ఇప్పుడు బ్లాగులు మొబైల్స్ లలో, టాబ్ లలో ఓపెన్ చేసి, బ్లాగులని నిర్వహించేవారికి ఇది చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఇప్పుడు తక్కువగా ఉన్న ఈ వాడకం రాను రానూ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు నా బ్లాగ్ 1% లోపలే అలా ట్యాబ్స్, మొబైల్స్ లలో చూస్తున్నట్లు గణాంకాలు Statistics చెబుతున్నాయి. ఇంగ్లీష్ మాధ్యమం ఉన్న బ్లాగుల్లో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది కూడా. మొబైల్స్ లలో, ట్యాబు లలో తెలుగు భాష కనిపించేలా మార్పులు కంపనీ వాళ్ళు ముందే ఇన్స్టాల్ చేసి ఇవ్వటం లేదు. ఎవరికీ వారు అలా మార్చుకొని వాడుకుంటున్నారు. ఇలా మార్చటం అనేది ఆయా మొబైల్స్ కంపనీ వారు, ట్యాబ్ కంపనీ వారు ముందే ప్రీ లోడెడ్ గా చేసిస్తే, అప్పుడు ఈ బ్లాగ్ హోం పేజీ మార్పులు చాలామందికి అనుభవములోకి వస్తుంది.
ఇదిగో నా బ్లాగ్ హోం పేజీ మారిన తీరు. (ఇందులోని వివరాలు అన్నీ అందరికీ తెలిసినవే)

Monday, September 17, 2012
Sunday, September 16, 2012
Saturday, September 15, 2012
మీ మెయిల్ బాక్స్ లో స్టార్ Star గుర్తులు
జిమెయిల్ లో ఒక క్రొత్త సౌకర్యాన్ని కలిపించారు. మనకి వచ్చిన మెయిల్స్ లలో ఏది ముఖ్యమైనదో తేలికగా గుర్తుపెట్టుకోవటానికి స్టార్ Star గుర్తులని ఇచ్చారు. మనకి వచ్చిన మెయిల్స్ ప్రక్కన ఒక నలుచదరపు గడి, దాని ప్రక్కన స్టార్ గుర్తు ఉంటుంది. ఈ స్టార్ గుర్తుని వెంటవెంటనే నొక్కుతూ పోతూ గనుక ఉంటే, వివిధ రంగుల్లో స్టార్ గుర్తులు వస్తాయి.
తెలుపు రంగు తార నుండి ఆకుపచ్చరంగు తార గుర్తులు మరియు ఇంకొన్ని గుర్తులు వస్తాయి. ఇవి వాడి మన మెయిల్ బాక్స్ లలోని ఏయే మెయిల్స్ ప్రాధాన్యతవో, వాటికి ఆ రంగుల స్టార్స్ పెడుతూ తేలికగా మీ మెయిల్స్ ని వెదుకోవచ్చును.
Friday, September 14, 2012
Good Morning - 138
స్నేహం అన్నది నిజముగా మధురమైన భావన.. కష్టాలూ, కన్నీళ్ళూ, ఆనందాలూ, ఆలోచనలూ, భావాలూ, కోరికలూ, ఇష్టాలూ, అయిష్టాలూ, ఆప్యాయతలూ, అనురాగాలూ... ఇవన్నీ మన తల్లితండ్రులతో పంచుకోలేం. ఏవో కొన్నింటిని మాత్రమే పంచుకుంటాము. ఈరోజుల్లో చాలామంది తల్లితండ్రులు స్నేహితుల్లా పిల్లలతో మెలుగుతున్నారు. అది మంచి శుభపరిణామం. ఈకాలం పిల్లలు అదృష్టవంతులు అనుకుంటాను నేను.
తల్లి తండ్రులకన్నా ఎక్కువగా మన మదిని తెరిచేది కేవలం స్నేహితుల వద్దనే.. ఉన్న పరిచయస్థుల్లో కొంతమంది స్నేహితులు అవుతారు. అలాంటి వారిలో ముఖ్య స్నేహితులు అంటే వ్రేళ్ళ మీద లెక్క పెట్టేవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇందులో ఒకరో ఇద్దరో మాత్రం ఆత్మీయ నేస్తాలు అయి ఉంటారు. వాళ్ళు మాత్రమే మన గుండె గదిలోన నిలిచిపోతారు. వాళ్ళతో మాత్రమే మన ఆలోచనలు.. అన్నీ పంచుకుంటాము. మనసంతా తెరచి ఉంచుతాము. వారిని మన ఆత్మీయ స్నేహితులు అని పిలుచుకోవచ్చును. ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే Soul mate friend అని డిసైడ్ అవచ్చును. ఈ సోల్మేట్ ఫ్రెండ్ అన్న పదం క్రొత్తగా ఉంది కదూ..
ఎన్నో వడపోతల తరవాత మీరు అలా నిర్ణయించుకున్న మీ ఫ్రెండ్ - మీకు దొరికాడూ అంటే మీరు అదృష్టవంతులే అన్నమాట. అలాంటి ఒక మంచి నేస్తాన్ని సమకూర్చుకున్నందులకు మీకు అభినందనలు. మన జీవనయానములో అలాంటి స్నేహితులను - మన మదిలో ఉన్నది అంతా చెప్పుకోవటానికి కనీసం ఒక్కరైనా మనకి ఉండాలి. అలా ఉండేలా ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ అలాంటి స్నేహితురాలు / స్నేహితుడు కానీ మీకు లభిస్తే, ఆ ప్రయత్నములో మీరు విజయం సాధించారు అన్నమాటే! అలాంటి స్నేహితులు ఇంకా దొరకుంటే - త్వరగా ప్రయత్నాలు చెయ్యండి.
త్వరలో మీకు అలాంటి స్నేహితులు దొరకాలని ఆశిస్తూ..
Wednesday, September 12, 2012
Good Morning - 137
నిజమే కదూ!.. నాకైతే ఇది నిజమే అని అనుభవంలో తెలిసింది. ఒక్కోసారి ఏదో అహంకారాలకి లోనై, కొన్నింటిని వదిలేసుకుంటాం లేదా అంతగా పట్టించుకోము. అవి దూరమయ్యాక అప్పుడు వాటిని తిరిగి పొందాలనుకొని, తెగ తాపత్రయ పడతాం. ఇది వస్తువులకే కాదు, మనుష్యుల బంధాలు కూడా.
వస్తువులోనైతే చిన్నప్పటి నేస్తాలు ఇచ్చిన ఆటోగ్రాఫ్, నెమలీక, సగం వాడిన పెన్సిల్ ముక్క, వారి తాలూకు ఫొటోస్.. ఇలా చాంతాడంత లిస్టు ఉంటుంది. ఎప్పుడో గానీ మళ్ళీ చూసుకోం.. చూసుకోవాలనుకున్నప్పుడు పాడయిపోయి ఉంటాయి లేదా పోగొట్టుకుంటాము.
అలాగే మనుష్యులతో బంధాలు కూడా. గుండె గడిదాకా వచ్చిన మిత్రులని తీలీక దూరం చేసుకున్నాక, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారితో గల సాన్నిహిత్యం గుర్తుకువచ్చినప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. ఎవరివైపుకి వారు గల కారణాలు సబబే అనిపిస్తాయి. మళ్ళీ దగ్గరవ్వాలని ఉంటుంది.. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ చెయ్యం. మనసు ఇంకా ఒంటరి అవుతూ ఉంటుంది కూడా. ఒక మెట్టు దిగి ప్రయత్నాలు చేస్తుంటే ఖచ్చితముగా సఫలీకృతం అవుతాం.
దగ్గరగా ఉన్నప్పుడు వారు మనకి చేసే మేలు అసలు తెలుసుకోం.. ఉన్నవారిని దూరం చేసుకున్నాకనే - ఏదో ఒక లోటు కనిపిస్తుంది. అప్పుడే వారి దగ్గరి తనం ఏమిటో, అప్పుడు వారు తమ సామీప్యములో ఉంటే ఎంత బాగుంటుందో అప్పటికి గానీ అనుభవంలోకి రాదు.
Tuesday, September 11, 2012
భాగస్వామి ఆసరా
మొన్న నా మిత్రుడి వద్దకి వెళ్లాను. తన ఇంటిమీద క్రొత్తగా నిర్మిస్తున్న అంతస్థులోకి నన్ను తీసుకెళ్ళాడు. అందులోని పోర్షన్ ల రూపు ఎలా ఉంటుందో చూపసాగాడు. చాలా బాగా కడుతున్నారు. దాదాపుగా అంతా ముగిసింది. ఎలెక్ట్రికల్, పంబ్లింగ్, కార్పెంటరీ పని మిగిలుంది.
అలా చూస్తుండగా క్రింద నుండి ఒక ముస్లిం జంట వచ్చింది. నలబై నుండి యాభై ఏళ్ళ వయస్సులో ఉంటారు వాళ్ళిద్దరూ. ఎవరబ్బా! క్రొత్తగా ఆ పోర్షన్ లో దిగటానికి అన్నట్లు అడగటానికి వచ్చారేమో అనుకున్నాను. ఆయన భుజాన ఫోల్దబుల్ అల్యూమినియం నిచ్చెన, చేతిలో ఒక పాత, లావాటి బ్యాగు కాసింత బరువుగా ఉంది. ఆమె చేతిలో ఒక బుట్టిలాంటిది ఉంది.
వారిని చూడగానే మా ఫ్రెండ్ వారిని సాదరముగా పిలిచాడు. కాసేపు వారితో ఆ పోర్షన్ రూములన్నీ కలియదిరుగుతూ మాట్లాడసాగాడు. అప్పుడు అర్థం అయ్యింది - ఆయన చేసే పని ఆ పోర్షన్ కి కరెంట్ వైరింగ్ అనీ.
ఆరోజుకి అయ్యే ఎలెక్ట్రికల్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకున్నాడు. చాక్ పీస్ తో, గీతలు గీసుకున్నాడు. ఎక్కడెక్కడ ఏమేని రావాలో అన్నీ అడుగుతున్నాడు. ఇక - వాళ్ళావిడనేమో పనిచెయ్యటానికి నిచ్చెనని సిద్ధం చేసింది. అలాగే బ్యాగు నుండి తనకి అవసరమైన పరికరాలు అన్నీ బయటకి తీసి సిద్ధం చేసింది. అలా బయట పెట్టాక ఆయనకేసి చూసింది. వాళ్ళిద్దరి కళ్ళు మాత్రమే మాట్లాడుకున్నాయి. ఆ చూపులతో వాళ్ళిద్దరికే తెలిసిన భాష ఏదో మాట్లాడుకున్నారు.
ఆమె తన చేతి సంచీతో లోపలి గదిలోకి వెళ్ళి, కాసేపట్లో బయటకి వచ్చింది. ఇప్పుడు ఆమె సాంప్రదాయమైన బురఖా తీసేసి, మగవారి పొడుగు చేతుల చొక్కా, దానికి ముందట నాలుగు జేబులు ఉన్నది ధరించి, వచ్చింది. ఆయననేమో నడుముకి ఎలెక్ట్రికల్ సామాను బిగించే పనిముట్లని పెట్టుకోవటానికి ప్రత్యేకముగా చేయించుకున్న బెల్ట్ నడుముకి ధరించాడు. మరు నిమిషములోనే వాళ్ళిద్దరూ ఆ విద్యుత్ వైరింగ్ చెయ్యటం మొదలెట్టారు.
వారు చాలా పక్కా ప్రొఫెషనలిజం తో పనిని మొదలెట్టారు. చాలా ఫాస్ట్ గా, నేర్పుతో, నైపుణ్యముగా చేస్తున్నారు. ఆయన కుర్చీ నిచ్చేనెక్కి పని చేస్తుండగా, ఆమె క్రింద ఉండి, చిన్న చిన్న పనులు చేస్తూ, ఆయనకీ కావలసినవి అందిస్తున్నది.
ఈ హౌస్ వైరింగ్ పని అంతా వచ్చిన నాకు వారు చేస్తున్న పనిని చూస్తూ, నా మిత్రునితో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను. మధ్యమధ్యలో చేసే ఆవిడ పనిని చూస్తున్నాను. ఒక పనివాడి నైపుణ్యం ఏమిటో మరో అంతటి పనివాడే గుర్తు పడతాడు అన్నట్లు, ఆవిడ చేసే పనిలో నైపుణ్యం ఏమిటో చూశాను.
చూడటానికి సాదా పనిలా ఉన్నా, చాలా పక్కా ప్రొఫెషనలిజం చూపుతూ చాలా నేర్పుగా పని చెయ్యసాగింది. కాసింత సేపటిలోనే ఆమె ఆ పనిలో ఆరితేరినట్లుందని అర్థమయ్యింది. చదువు ఏమీ రాని గృహిణి అంత బాగా పనులు చెయ్యటం, అందునా మగవారే ఇబ్బందులు పడుతూ చేసే ఆ హౌస్ వైరింగ్ పనిని చాలా వేగముగా, నైపుణ్యముగా చేస్తున్నది.
నా మిత్రుడు నా మదిలోని భావాలు చదివి, ఆ వైరింగ్ చేసే ఆయనతో మాట్లాడటం మొదలెట్టాడు. అలా మొదలైన మాటల్లో.... ఆయన తన కథ చెప్పటం మొదలెట్టాడు.
ఆయనకి ముగ్గురు ఆడపిల్లలు. అబ్బాయిలు ఎవరూ లేరు. తమకి అబ్బాయిలు లేకున్నా అమ్మాయిలనే బాగా పెంచుకోవాలని, బాగా అభివృద్ధిలోకి తీసుకరావాలని వారి తాపత్రయం. తమలాగా వారు కష్టపడకూడదు అని వారి నిర్ణయం. ఒక అమ్మాయిని డిగ్రీ కాగానే, మంచి సంబంధం వస్తే, పెళ్లి చేశారు. రెండో అమ్మాయి హాస్టల్లోఉంటూ కంప్యూటర్ సైన్స్ చేస్తుంది. మూడో ఆమె రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటూ ఇంటర్ చేస్తున్నది.
ఇక తరవాత ఆమె గురించి చెప్పాడు. తను చదూకోలేదు అంట. మొదట్లో బాగా ఇబ్బందులు పడ్డ ఆ కుటుంబం ఒకానొక దశలో సర్వం కోల్పోయారు. ఆ సమయములో అయిన వారందరూ మొహం చాటు చేశారు. అప్పుడే ఆయన పక్షవాతం + లో బీపీ కి గురయ్యాడు. ఒక్కోసారి తినడానికి తిండి లేక నీళ్ళు త్రాగి పడుకున్న రోజులూ ఉన్నాయంట. అప్పుడే - ఆవిడ చాలా సేవ చేసి, ఆయనని ఆ జబ్బుల నుండి బయటకి తీసుకోచ్చేసింది. అంతలోగా కుటుంబం గడవటానికి మంచం మీద పడుకొని, తనకి వచ్చిన ఏకైక పని - కరెంట్ పనిని ఆమెకి నేర్పించాడు. అలా మొదలైన ఆ పనిలో ఆమె నిష్ణాణితురాలైంది.
ఆ తరవాత ఇల్లూ, షాపూ ఒకే దగ్గర ఉన్నది తీసుకొని, భర్తకి ఎక్కువగా వచ్చిన పనిని వెనకరూములో చేస్తూ, ఆయనకీ పనిలో సహాయము చెయ్యసాగింది. అలా అలా చేస్తూ, సర్వం కోల్పోయిన జీవితాన్ని చక్కపెట్టుకున్నారు. కొద్దిగా స్థితిమంతుల స్థాయికి చేరుకున్నారు. అయినా ఎక్కడా సాంప్రదాయం వీడలేదు. బాగుపడ్డ జీవితం క్రెడిట్ అంతా ఆయనదే అని తనకే ఇచ్చింది ఆవిడ. ఎక్కడా లోకానికి పరిచయం కాలేదు.
ఆ తరవాత పిల్లలు హాస్టల్లో చేరాక, ఒక్కతే ఇంట్లో ఉండబుద్ది కాక, కంపెనీ ఇచ్చినట్లు ఉంటుందని, ముచ్చట్లు పెడుతూ పని చేసినట్లూ ఉంటుందనీ, అసిస్టంట్ గా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నట్లు, ఎవరికీ బయటకి తెలీకుండా / కనిపించకుండా ఉంటూ, ఇంటి పోర్షన్ వైరింగ్ గదుల్లోనే ఉంటూ చేస్తున్నది. .. అంటూ చెప్పాడు.
ఇంత చెప్పినా ఆవిడ ఎక్కడా గర్వముగా చూడలేదు. కనీసం తలెత్తి చూడనేలేదు. అదో పిచ్చి సోది అన్నట్లు అస్సలు పట్టించుకోలేదు. ఆవిడ పనిలో ఆవిడ నిమగ్నమైనది.
ఆమెని పిలిచి, క్రింద ఉన్న బండిలో ఉన్న సామాను తెమ్మని చెప్పి పంపాడు. (మాకు ఇది చెప్పటానికే ఆమెని అలా దూరముగా పంపాడని ఆ తర్వాత అర్థం అయ్యింది) అలా ఆమె వెళ్ళగానే మళ్ళీ మొదలేడుతూ -
నేను జబ్బు పడ్డప్పుడు నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. కానీ ముగ్గురు పిల్లలూ, నా భార్య కళ్ళల్లో మెదిలి అడ్డువచ్చారు. వాళ్ళ జీవితాలని నడిరోడ్డు మీద వదిలేయ్యాల్సి వస్తుందని, అడుక్కు తినేలా చేసేలా ఉంటుందని.. అంటూ వచ్చిన ఊహ నన్ను అలా చెయ్యకుండా ఆపింది. ఆవిడ నాకు చేసిన సేవ, ఆమె పడిన కష్టాలూ అన్నీ చూసినవాడిని. నాకంటూ మళ్ళీ ఒక జీవితాన్ని ఇచ్చినవారికి ఏమీ ఇచ్చుకోలేను. అప్పుడు ఆస్థి అంటూ ఏమీ మిగల్లేదు.. ఉన్నదల్లా వైరింగ్ లో నైపుణ్యము + కష్టపడటం. వీళ్ళ కోసం ఏదైనా చెయ్యాలని అనుకున్నాను. గౌరవముగా బ్రతికేలా చెయ్యాలని అనుకున్నాను. అందుకే పిల్లల్ని బాగా చదివిస్తున్నాను. పెద్దమ్మాయి లైఫ్ బాగుంది. మిగతా ముగ్గురు బాగుండాలి కదా.. అందుకే - నేను హటాత్తుగా ----- పోతే, (గొంతు బొంగురు పోయింది ఆయనది) వారిని ఒక స్థాయిలో చూడటానికి, చదువు రాని మా ఆవిడకి అన్ని కరెంట్ పనులూ నేర్పాను. అన్నీ చేస్తుంది. నేను లేకున్నా ఒంటరిగా ఉండి, అన్ని పనులు చేసేలా నేర్పాను. ఆమెకి మొదట్లో ఆసక్తి లేకున్నా జీవితములో వచ్చే కష్టాలేమిటో తెలుసుకుంది కాబట్టి, బాగా ఆసక్తితో పని నేర్చుకుంది. ఎంతోమందికి పని నేర్పించాను. కానీ ఎవరూ మనవారు కాదు కదా.. నా వాళ్ళకి నేర్పిస్తే, మా జీవితమే బాగుంటుంది కదా.. త్వరలో ఆమెకి ఎయిర్ కండీషనర్ లు రిపేర్ చేసేలా మంచి సంస్థలో శిక్షణ ఇప్పిద్దామని అనుకుంటున్నాను. మొన్నే ఆమెకి తెలీకుండా వెళ్ళి రిఫ్రిజరేషణ్ శిక్షణ సంస్థలో అడిగి వచ్చాను. ఆవిడని ఒప్పించి పంపాలి. నేను ఒకవేళ ఏమైనా వాళ్ళు బాగుండాలి కదా.. అని పునాది వేస్తున్నా.." అని అంటుండగానే బండిలోని సామానుతో ఆవిడ వచ్చింది. మొఖం ఒకసారి చేతితో రుద్దుకొని, కళ్ళలోని నీటిని పనిలో పనిగా తుడి చేసుకొని ఏమీ తెలీనట్లు మామూలుగా వైరింగ్ చేయసాగాడు.
చెమర్చిన గుండెతో నా మిత్రుని వద్ద, వారి వద్ద సెలవు తీసుకొని వచ్చాను.

Monday, September 10, 2012
Sunday, September 9, 2012
Saturday, September 8, 2012
Friday, September 7, 2012
Thursday, September 6, 2012
Facebook - Social Protection
Facebook లో ఇప్పుడు ఒక క్రొత్త అప్లికేషన్ జత చేశారు. మీరు మీ ఫేస్ బుక్ ప్రొఫైల్ లో మీరు పెట్టే ఫొటోస్ ని మీ మిత్రులు గానీ, ఇతరులు గానీ కాపీ చేసుకోకుండా, కనీసం స్క్రీన్ షాట్ ద్వారా కూడా కాపీ చేసుకో వీలులేకుండా చేసేందుకు ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుందని ఆ McAfee సంస్థ వారు చెబుతున్నారు. మీకు ఫేస్ బుక్ ప్రొఫైల్ గనుక ఉంటే - ఈ అప్లికేషన్ ని వాడి, మీరు అప్లోడ్ చేసే మీ ఫొటోస్ ని ఎవరూ కాపీ చేసుకోకుండా చూసుకోగలరు.
ఈ అప్లికేషన్ కేవలం - Internet Explorer 8 ఆ తరవాత బ్రోజర్ మరియు Mozilla Firefox నందు మాత్రమే పనిచేస్తుంది. కనుక మీరు ఆయా బ్రౌజర్స్ ని ఓపెన్ చేసి, అందులో ఈ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మరొక ముఖ్య అంశం - మీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ - Windows 7 ఉండాలి. XP ఉన్నా ఏమీ కాదు కానీ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ వెర్షన్ (సర్వీస్ ప్యాక్ 3) ఉండాలి.
ముందుగా మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ ని పై రెండింటిలో ఏదైనా ఒక బ్రౌజర్ లో ఓపెన్ చెయ్యండి. ఇక్కడ ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ని ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాను.
1. మీ ఫేస్ బుక్ అకౌంట్ ఒపేన్ చెయ్యండి.
2. సర్చ్ బార్ నందు Social Protection అని టైప్ చేసి, సర్చ్ నొక్కండి.
3. అందులో వచ్చే McAfee Social Protection ని ఎన్నుకోండి.
అప్పుడు ఇలా ఆ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఆ 4 వద్ద Download Now ని నొక్కాలి.
డౌన్లోడ్ అయ్యాక ఆ వచ్చే డైలాగ్ బాక్స్ లో Run 5 ని నొక్కి ఆ అప్లికేషన్ ప్రోగ్రాం ని రన్ చెయ్యాలి.
అలా ఓపెన్ అయ్యాక ఇప్పుడు 6 వద్ద నున్న Install ని నొక్కాలి.
ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది.
అప్పుడు ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు Agree వద్ద ఓకే చేసి, Next 7 నొక్కండి.
ఇప్పుడు ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది.
ఇలా ఇన్స్టాల్ అయినట్లు విండో వస్తుంది.
ఇప్పుడు మీ బ్రౌజర్ మళ్ళీ ఓపెన్ చెయ్యండి. అంతే!
Wednesday, September 5, 2012
Tuesday, September 4, 2012
Monday, September 3, 2012
Sunday, September 2, 2012
తెలుగు బ్లాగర్స్ గ్రూప్
ఈ ప్రపంచములో వ్యక్తులకీ, వృత్తులవారికీ, కళాకారులకీ ఎన్నో సంఘాలు, ఫోరమ్స్ ఉన్నాయి. మరి బ్లాగింగ్ చేసేవారికి? అలాంటివి ఉన్నాయా? లేవా?? అని ఆలోచిస్తున్నారా?..
లేకేం! భేషుగ్గా ఉంది. తెలుగు బ్లాగర్స్ (Telugu bloggers) గ్రూప్. ఇది గూగుల్ గ్రూప్స్ వారిలోని భాగము. క్రొత్తగా బ్లాగ్ మొదలెట్టినవారికి, బ్లాగ్ నడిపిస్తున్నవారికి - బ్లాగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు వస్తే - ఎవరిని అడగాలి? ఎలా అడగాలి..? ఎవరు తీర్చగలరు? అన్న ప్రశ్నకి సమాధానం ఇక్కడ దొరుకుతుంది. మీకు ఏమైనా సమాచారం కావాలన్నా, ఏదైనా బ్లాగ్ నిర్వహణా ఇబ్బందులు, సందేహాలు ఉంటే, ఇక్కడ ఉన్న సభ్యుల గ్రూప్ లో అడిగితే (పోస్ట్ చేస్తే), అందులో సభ్యుల వద్ద నుండి మీకు సమాధానాలు వస్తాయి.
చాలామంది పాత బ్లాగర్స్ కి ఈ విషయం తెలిసియున్నా, క్రొత్తగా బ్లాగింగ్ మొదలెడినవారికీ, తెలీనివారికీ తెలియచెప్పటానికే ఈ టపా.
ఈ గ్రూప్ లో మొదట్లో అనుకోకుండా ఏదో లింక్ పట్టుకొని, ఆ గ్రూప్ లో చేరాను. అప్పుడు ఆ గ్రూప్ లో 13,000+ సీరియల్ పోస్ట్ జరుగుతున్నది. (మనకి వచ్చే మెయిల్స్ కి ఆ సీరియల్ నంబర్ ఉంటుంది. ఏమైనా మెయిల్స్ అందకుంటే ఆ వరుస తప్పామా, లేదా అని అలా చెక్ చేసుకోవచ్చును.) ఈ గ్రూప్ అవసరమా అనుకున్నాను. కానీ చాలా ఉపయోగపడే గ్రూప్ తెలుసుకొని కొనసాగుతున్నాను. నేను అందులో అడిగిన సందేహాలకన్నా - నేను ఇచ్చిన జవాబులే ఎక్కువ. ఇలా చెప్పుకోవటం గొప్పగా ఫీలవటం లేదు. నాకు తోచినంతలో ఏదో ఉడుతాభక్తిగా బ్లాగర్స్ కి సేవ చేస్తున్నాను అని అనుకుంటున్నాను. అక్కడ ఎంతోమంది లబ్ధ ప్రతిష్టులూ మీ సందేహాలకి సమాధానాలు అందచేస్తారు.
గూగుల్ వారి గ్రూప్ అయిన ఇక్కడ మీకు ప్రస్తుతం 4825+ టాపిక్ / సందేహాల మీద సభ్యులు ఇచ్చిన సమాధానాలు ఇక్కడ లభిస్తాయి. మీరు ఇక్కడ సభ్యులయితే - మీ మెయిల్ ID కి మెయిల్స్ వస్తుంటాయి.
Saturday, September 1, 2012
Subscribe to:
Posts (Atom)