మీ ఫేస్ బుక్ సోషల్ సైట్ అకౌంట్ లోని మిత్రులతో హాయిగా ప్రతిరోజూ ముచ్చట్లు, మీ భావజాలాన్ని పంచుకుంటూ ఆనందముగా ఉంటున్నారా..! అలాంటిది ఒకరోజు ఉదయాన మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ లోకి లాగిన్ అయ్యినప్పుడు, ఎప్పుడూ ఉండే స్నేహితుల సంఖ్య కొద్దిగా తగ్గినట్లుగా అనిపిస్తున్నదా..? ఖంగారు పడి, మీరు మీ స్నేహితుల లిస్టు మీద క్లిక్ చేసి, ఒక్కరినీ గుర్తు తెచ్చేసుకుంటూ, మీ లిస్టులో ఉన్నారా? వెళ్లిపోయారా? అని వెదుకుతున్నారా.. ?
నిజానికి అలా వెదకటం చాలా కష్టముగా ఉంటుంది కదూ.. "జై ఫేస్ బుక్.." అంటే వెంటనే ఆ వెళ్ళిపోయిన మిత్రుడు(రాలు) ఎవరో తెలిసేలా ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందా..? అయితే వెంటనే ఈ పద్ధతి ఫాలో అయిపోండి.
1. సర్చ్ బార్ 1 లో Unfriends అని టైపు చెయ్యండి.
నిజానికి అలా వెదకటం చాలా కష్టముగా ఉంటుంది కదూ.. "జై ఫేస్ బుక్.." అంటే వెంటనే ఆ వెళ్ళిపోయిన మిత్రుడు(రాలు) ఎవరో తెలిసేలా ఉంటే చాలా బాగుంటుంది అన్న ఆలోచన వచ్చిందా..? అయితే వెంటనే ఈ పద్ధతి ఫాలో అయిపోండి.
1. సర్చ్ బార్ 1 లో Unfriends అని టైపు చెయ్యండి.
2. 2 వద్ద సర్చ్ బటన్ ని నొక్కండి.
3. ఇలా Unfriends అనే అప్లికేషన్ వస్తుంది. దాని మీద నొక్కి, ఆ అప్లికేషన్ 3 ను మీ ప్రొఫైల్ కి ఆడ్ చేసెయ్యండి.
ఇప్పుడు మీ హోం పేజీలోన ఆ అప్లికేషన్ ని - మీ ఫ్రెండ్ ఎవరైనా మీ లిస్టు నుండి వెళ్లిపోయారా అని సందేహం వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూడండి. తేలికగా తెలుసుకోవచ్చును.
కానీ కొన్ని ముఖ్య సూచనలు. :
ఈ అప్లికేషన్ ఒకరు మన ఫ్రెండ్స్ లిస్టు నుండి వెళ్ళిపోయినప్పుడు ఉపయోగిస్తే - ఒకసారికి మాత్రమే వారెవరో చూపిస్తుంది. రెండోసారి ఓపెన్ చేస్తే - ఏమీ చూపించదు.
వెళ్ళేవారు మనం నచ్చక వెళ్ళిపోతారు. అంత మాత్రాన కక్ష సాధింపు ధోరిణి ప్రదర్శించి, వారిని ఏదో చెయ్యటానికి ప్రయత్నించకండి. అసలు వారెవరో తెలీదు అన్నట్లు ఉండిపొండి.
ఈ అప్లికేషన్ ని అతి తక్కువసార్లు వాడటం నేర్చుకోండి.
ఒక్కోసారి ఈ అప్లికేషన్ చాలా తప్పుగా కూడా చూపిస్తుంది. ఒక పెద్ద ఆఫీసర్ నా లిస్టు నుండి ఐదుసార్లు,(ఈ విషయమై ఒక పోస్ట్ కూడా పెట్టాను అప్పట్లో.. తనని తీసేద్దాం అనుకున్నా. నిజానికి అది ఇప్పుడు తెలిసింది - ఆ సోషల్ సైట్ టెక్నికల్ ప్రాబ్లెం.. ఈ లింక్ ని నొక్కండి ) ఒక టీవీ సంస్థలో పనిచేసే అబ్బాయి ఇవాల్టి వరకూ నాలుగుసార్లూ నా లిస్టు నుండి వెళ్ళిపోయారు అని చూపెట్టింది. నిజముగానే వెళ్ళిపోతే వారు మళ్ళీ నాకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టాలి కదా.. అలాంటిదేమీ లేకుండానే నా లిస్టు లో ఉన్నారు. ఇలా నిన్న కూడా జరిగింది. అది అలా జరగటం ఒక వింతగా ఉంది కూడా. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే - తొందరపడి, ఎవరితో ఏమీ పోట్లాడక, కాసింత ఓర్పుని ప్రదర్శించండి.
ఈ అప్లికేషన్ ని మీకు పరిచయం చెయ్యటానికి మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. కానీ ఇది వాడి, అనవసరముగా అలా వెళ్ళిపోయినవారెవరో కనుక్కొని, మానసిక వేదన పడి, లేనిపోని చిక్కుల్లో పడకూడదని హెచ్చరిస్తూ, విన్నవించుకుంటున్నాను.
1 comment:
Welcome.
Post a Comment