మొన్న నా మిత్రుని షాప్ కి రద్దీ లేని సమయాన వెళ్ళి, పిచ్చాపాటీగా కబుర్లాడుతూ కూర్చున్నాను.. ఇంతలో ఒకతను ఆదరాబాదరాగా వచ్చాడు. ఆయన్ని చూడగానే నా మిత్రుడు నవ్వుతూ పలకరించాడు.. "ఆవో సేట్.. ఆప్ కైసే హై.." (రండి సేట్ గారూ.. మీరెలా ఉన్నారు) అంటూ. నన్ను చూసి ఎవరు అని కళ్ళతో సైగ చేస్తూ తనని అడిగాడు. దానికి మా మిత్రుడు - నా ఫ్రెండ్ అన్నాడు.
నాకూ అతనికి మధ్యగా కూర్చున్నాడు. బంగారం ధర ఎంతుంది? అడుగుతూ అక్కడ డెస్క్ మీద ఉన్న కాలుక్యులేటర్ తీసుకొని, ఏదో నొక్కాడు. అది అతనికి చూపించాడు. నా మిత్రుడు "అబ్బా! అంతనా.. కష్టం సేట్." అన్నాడు. "నీకెందుకయ్యా!. వారిని ఒప్పించి ఆర్డర్ ఇచ్చేలా చేయిస్తాను.." అన్నాడు. దానికి నా మిత్రుడు అన్యమనస్కముగానే ఓకే అన్నాడు. అలా ఒప్పుకుంటున్న సమయములోనే, ఆ షాప్ లోకి బిలబిలమంటూ కొద్దిమంది లోపలి వచ్చేశారు. అంటే ఆయన కాస్త కొన్ని అడుగుల ముందుగా ఆ షాప్ లోకి వచ్చేశాడన్న మాట.
ఆ సేట్, నా మిత్రుడూ వాళ్ళని సాదరముగా లోపలి ఆహ్వానించి, కాసిన్ని కుశల ప్రశ్నలు అయ్యాక, నగల డిజైనుల వరకూ వచ్చారు. నా మిత్రుడు అవన్నీ చూపిస్తూ, రకరకాల కేటలాగులు చూపించాడు. అలాగే వాటి గురించిన వివరాలు చెప్పసాగాడు. గంటా గంటన్నర వరకూ అలాగే సాగింది. నేను వారిని గమనిస్తూ పోయాను. ఆ వచ్చిన సేట్ సమయం దొరికినప్పుడల్లా నా మిత్రుని గురించి డప్పు వేస్తూ, ఎంత బాగా చేయిస్తాడో, ఎంత నమ్మకముగా ఆభరణాలు చేయిస్తాడో చెబుతున్నాడు. మధ్య మధ్య వారినీ కాసింత ఎక్కువ ధర పెట్టేలా మానసికముగా ఒప్పిస్తున్నాడు.
నా మిత్రుడు అప్పుడప్పుడు నాకేసి చూస్తూ, వారిని గమనించు అన్నట్లు సైగ చేస్తున్నాడు. మొత్తానికి వారికి కావాల్సిన నగల సెలక్షన్స్ అన్నీ అయ్యాయి. బిల్లింగ్ కూడా అయ్యింది. కొన్నింటికి డెలివరీ డేట్ చెప్పాడు. అందరూ నా మిత్రుని వద్ద నుండి వీడుకోలు తీసుకున్నారు.
ఆ తరవాత నా మిత్రుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని (తాను చూపించినవన్నీ అక్కడే ఉన్నాయా? ఏమైనా మాయం అయ్యాయా? అనీ) ఓకే చేసుకున్నాక, అప్పుడు అన్నీ లోపలికి సర్డుకోసాగాడు. నా మిత్రుని మొహములో ఆనందం. మంచి బేరం తగిలిందని కావచ్చును.
"ఏమిట్రా అంత సంతోషం..?" అన్నాను నేను.
"హా!.. అవునురా.. ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది. ఆ సేట్ వచ్చి అడిగాడు గుర్తుందా..? నిజానికి అతను అడిగింది కమీషన్. ఆ వెంట వచ్చింది తనకి బాగా తెలిసిన బంధువులు అంట. ఈ ఆర్డర్ ఇప్పించినందులకు ఆయనకీ కాసింత వాటా కావాలిట. అందుకే అలా.. " అంటున్నప్పుడే ఆ సేట్ మళ్ళీ వచ్చాడు.
మా వాడు కొన్ని డబ్బులు లెక్కపెట్టి ఆయన చేతిలో ఉంచాడు. ఆయన లేక్కపెట్టుకొని, "ఇంతేనా.." అన్నాడు.. మా వాడు ఇంకో వంద నోటు ఇచ్చాడు. మోహం మీద సంతృప్తిగా నవ్వు మొఖం పెట్టుకొని, వస్తాను బాబూ.. అంటూ వెళ్ళిపోయాడు. నిజానికి అది చాలా మొత్తమే.! మధ్య తరగతివాడు ఒకరోజు హాయిగా, యమ దర్జాగా బ్రతకగలిగే డబ్బు అది. ఈ మధ్యవర్తిత్వం బిజినెస్ బాగుంది.
మా మిత్రుడు మళ్ళీ నాతో మాట్లాడటం మొదలేడుతూ "ఇలా అన్ని బిజినెస్ లలో ఉన్నాయి.." అన్నాడు.
"అవునా.. దగ్గరివారి దగ్గర ఆయన అలా తీసుకోవటం నాకు నచ్చలేదు.." అన్నాను నేను.
"నిజం చెప్పాలీ అంటే - ఈ మధ్యవర్తిత్వం వాళ్ళు వస్తే మాకు కాసింత హ్యాపీ. మేము కొద్దిగా వివరిస్తే చాలు. మిగతా అంతా వారే చెప్పేస్తారు. వచ్చినవారు ఆటా.. ఇటా అన్న సందేహములో ఉన్నప్పుడు, వారే ఒప్పిస్తారు. అలా మాకు లాభం. వారికి ఇచ్చే మొత్తం కూడా ఆ వచ్చినవారి బిల్ లోనుండే "ఎక్కడో అడ్జస్ట్" చేసి, ఇచ్చేయ్యడమే. మా జేబులనుండి తీసివ్వటం అంటూ మీ ఉండదు. పైపెచ్చు పనిలో పనిగా ఈ మధ్యవర్తికి తెలీకుండా ఇంకాస్త నోక్కేస్తాం. అది ఈయనికి తెలిసినా - తేలుకుట్టిన దొంగలా నోరు మెదపడు. పైపెచ్చు మాకూ ఇంకొంత ఎక్కువ లాభం. అలా ఈరోజు ఆయనికి ఇచ్చినదానికన్నా రెట్టింపు మొత్తం నాకు అదనపు ఆదాయం.." అన్నాడు.
"హవునా.. నీ పనే హాయిగా ఉంది. అసలు వచ్చే లాభం కన్నా, ఇంకా అదనపు ఆదాయం.. యే సాఫ్ట్వేరూ ఉద్యోగీ పనికి రాడు.." అన్నాను.
"హా! అలా ఎప్పుడూ రాదు. ఎప్పుడో ఒకసారి ఇలా. అంతే!. అయినా ఈ పబ్లిక్ పిచ్చోళ్ళు. వారికి అన్నీ తెలిసినా మారరు. మారితే వారే లాభపడుతారు. అయినా అంతే!. మారరు. ఇప్పుడు డైరెక్ట్ గా వస్తే నాకు వచ్చిన అదనపు ఆదాయం + ఆ మధ్యవర్తికి ఇచ్చిన మొత్తం వారికి మిగిలేటివి కదా.. అయినా జనాలు స్వంతముగా కొనుక్కోవడం ఎలాగో ఇంకా తెలుసుకోరు.. అలా మారితే చాలామందికి చాలానే మిగులుతుంది.." అన్నాడు.
ఉదాహరణకి ఇన్స్యూరెన్స్ పాలసీలలో(ఆన్లైన్ పాలసీలు మరో మార్గం), ఇంటి అమ్మటం, కొనటం (స్థానిక దినపత్రికలలో తక్కువ ఖర్చుకి ప్రకటన చేసి, బ్రోకర్ ని దూరం చెయ్యటం ద్వారా ఇరువురు లాభ పడటం.), వాహనం అమ్మటం, కొనడం, ఆస్థుల పంపకాలు.. ఇలా చాలానే ఉన్నాయి.
నిజమే!. చాలామంది మారరు. ఇతరులని మధ్యవర్తులుగా పెట్టేసుకొని, చాలా దెబ్బ తినేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. ఇద్దరు కలిసి ఒక డీల్ కుదుర్చుకుంటే - ఆ ఇద్దరూ లాభపడాలి. లేదా ఒక్కరైనా (ఎక్కువ) లాభం పడాలి. అనవసరముగా మధ్యన ఉన్న మూడో వ్యక్తికి ఎందుకు పెట్టాలి? అని ఆలోచించరు. ఇలా ఒక్క బిజినెస్ లలోనే కాక, చాలా విషయాల్లో వర్తిస్తుంది.
ఉదాహరణకి ఇన్స్యూరెన్స్ పాలసీలలో(ఆన్లైన్ పాలసీలు మరో మార్గం), ఇంటి అమ్మటం, కొనటం (స్థానిక దినపత్రికలలో తక్కువ ఖర్చుకి ప్రకటన చేసి, బ్రోకర్ ని దూరం చెయ్యటం ద్వారా ఇరువురు లాభ పడటం.), వాహనం అమ్మటం, కొనడం, ఆస్థుల పంపకాలు.. ఇలా చాలానే ఉన్నాయి.
No comments:
Post a Comment