మొన్న మార్కెట్ కి వెళ్ళినప్పుడు క్రొత్త చింతపండు కనిపించింది. చింతపండు అనగానే దాని పులుపు రుచి గుర్తుకువచ్చి, మీ అందరి నోట్లో నీరు ఊరుతుండవచ్చును. ఈ చింతపండు తో చేసే రసం మనకెందరికో మిక్కిలి ప్రీతిపాత్రమైనది. చాలామందికి ఈ చింతపండుతో చేసే రసం, సాంబార్, పప్పుచారు, పులిహోర, చేపల పులుసు.. (ఇవన్నీ గుర్తు చేసి మిమ్మల్నందర్నీ బాధపెట్టాను - నన్ను మన్నించండి) అంటే చాలా ఇష్టం. ఓకే.. ఓకే.. ఇప్పుడు టాపిక్ లోకి వద్దాం.
అలా మార్కెట్ కి వెళ్ళిన నేను - చింతపండు కనిపించగానే రానున్న ఉగాదికీ, దైనందిక అవసరాలకీ ఇదుకిలోల చింతపండు తీసుకోవటానికి వెళ్లాను. మొదట ఒక అమ్మేవాడి వద్దకి వెళ్ళి అడిగాను. అతడి వద్ద చింతపండు మీద ఉండే పెంకు లాంటిది తీసేసి, సగం వరకూ నార తీసేసి, లోపల ఉన్న గింజలు పూర్తిగా తీసేసి, రెండు రెక్కలుగా విప్పదీసి, అమ్మేస్తున్నారు. ధర ఇంతా అని అడిగితే, " కిలో - అరవై " చెప్పాడు. బేరం చేస్తే " యాభై ఐదు " చెప్పాడు.
తన ప్రక్కనే ఉన్న ఇంకో చింతపండు అమ్మే ఆమె దగ్గరికి వెళ్లాను. ఆమె దగ్గర చింతపండు పైన పెంకు దాదాపుగా తీసేసి, రెండు రెక్కలుగా విప్పదీయకుండానే, గింజలతో సహా నారతో కలిపి (క్రింద ఫోటో) అమ్మేస్తున్నది. ధర ఎంతా అని అడిగితే " కిలో - ఇరవై " అని చెప్పింది ఆవిడ. అంటే మొదట అతను చెప్పిన దానిలో మూడోవంతు ధర. (60 : 20)
ఒక ఆలోచన వచ్చి, " ఒకవేళ ఈ పైన పెంకూ, నారా, లోపల గింజలూ.. తీసేస్తే కిలోకి ఎంత తరుగు వస్తుంది? ఒక పావుకిలో ఉంటుందా? " అని ఆమెని అడిగాను. ఆమె నవ్వి, " అంత వస్తుందా బాబూ..! కిలోకి మహా అంటే సౌ గ్రామ్ (ఒక వంద గ్రాములు) అలా తుట్టి / తరుగు (Wastage) వస్తే గొప్ప.. " అని చెప్పింది.
అవునా! అని హాస్చర్యపడిపోయాను. అంటే ఇంకో వంద గ్రాములు నష్టం వేసుకుంటే ఆ వచ్చే రెండు రూపాయలు (20 Rs. Kg * 10% = 2 Rs.) కలుపుకున్నా ఇరవైరెండు రూపాయలు అవుతుంది. పోనీ - ఇంకో మూడు రూపాయలు తరుగు వేసుకున్నా ఇరవై ఐదుకన్నా మించదు. అంటే మొదట చెప్పిన అరవై రూపాయలతో పోలిస్తే - చాలా చవక అని అర్థం అయ్యింది. సూపర్ మార్కెట్లో మేలిమి ఫ్లవర్ రకం చింతపండు ప్రతి కిలోకి 140 - 180 Rs. గా ఉంది. దానితో పోలిస్తే ఆ చింతపండు ఆవిడ చెప్పిన రేటు చాలా చా.....లా చవక. (ఇది ఇంకా చవక సూపర్ మార్కెట్లో ధరలో 10% ధర ఆధారం చూడండి : http://m.sakshi.com/Sakshi/Visakhapatnam/13254684)
అయినా చింతపండుని ఎక్కువగా అంటే 99 % వాటి నుండి రసం తీసుకోవటానికి ఉపయోగిస్తాం. ఇంకా పిక్కలూ, గింజలూ, నారతో ఉంది ఉంటే - నానబెట్టి, ఆతరవాత చేతిలోకి తీసుకొని, పిసికి రసం తీయుటకి చాలా అనువుగా ఉంటుందని ఆవిడ చెప్పింది. ఇదీ ప్లస్ పాయింటే అనుకొని అక్కడే ఐదు కిలోలు చింతపండు తీసుకున్నాను.

2 comments:
Thank u somuch raj garu
Welcome..
Post a Comment