Sunday, March 25, 2012

మామిడి తోరణాలు

ఈ ఉగాదికి గుమ్మానికి, దేవుడి గదికీ మామిడి తోరణాలు కట్టాను. ఎప్పటిలా ఉదయమే మార్కెట్ కి వెళ్ళి, పూలు కొన్నాను. పండుగల రోజున నాడే ఈ పూల ధర భగ్గుమన్నట్లుగా ఉంటుంది. అయినా తప్పదు కదా..! అలా ఒక కిలో పూలు తీసుకోచ్చేశాను.

ఎప్పటిలా మామూలుగా ఒక దండలా దారానికి గుచ్చేద్దాం అనుకున్న వాడిని, ఈసారి కాస్త ప్రత్యేకముగా చేద్దామనిపించింది. సరే! అని దారానికి ఆ పూలు ఆగవు. నాలుగైదు వరుసలు పెడితే గానీ ఆ పూల బరువుని దారం ఆపదు. అన్ని వరుసలు పెడితే సూదికి కన్నం సరిపోదు. ఇలా కాదనుకొని, ఇంట్లో - టెంపరరీ కనెక్షన్స్ కోసం వాడే ఎలెక్ట్రికల్ వైర్ ని తీసుకున్నాను. 

సన్నని ఒక ఇనుప తీగ మీద తెల్లగా ప్లాస్టిక్ / PVC పూత ఉన్న వైరు ఇది. (దీని గురించి వివరాలకోసం ప్రత్యేకముగా వేరే పోస్ట్ త్వరలో పెడతాను) ఎటు పడితే అటు సులభముగా వంగుతుంది. గట్టిగా కూడా ఉంటుంది. మామూలు సుతిలీ (జనపనార త్రాడు), ప్లాస్టిక్ వైర కన్నా దీన్ని వాడటం చాలా సులభం కూడా. ముందు ఆ వైర్ మీద అరంగుళం పైన ప్లాస్టిక్ పొర తీసేసి, ఆ వచ్చిన ఇనుప తీగకి అలాగే పూలు గుచ్చటం మొదలెట్టాను. అలా తొందరగా పని ముగించాను. 


అలా పూల తోరణాలని ఈసారి సంప్రదాయముగా ఎప్పటిలా కాకుండా ఈసారి క్రొత్తగా చెయ్యాలనిపించి, చేశాను. అలా ఆ తీగకి గుచ్చేసి, ఇంటి గుమ్మాలకి అలంకరించాను. అలా మూడు రకాలుగా చేశాను.  ఇక్కడ మాత్రం రెండు రకాలని మాత్రమే పరిచయం చేస్తున్నాను, మూడో అలంకరణని మాత్రం పరిచయం చెయ్యలేకపోతున్నాను. వీటిని చూసి అవి ఎలా ఉన్నాయో చెప్పండి. 



బాగున్నాయా..? 

No comments:

Related Posts with Thumbnails