ఈ దీపావళి పండగ కి మీకు శుభాకాంక్షలతో పాటు మీకు ఒక చక్కని సుందరమైన ఐడియా ని ఇద్దామని అనుకుంటున్నాను.. అది వాడండి.
మామూలుగా ఇంటి ముందు దీపాల తోరణాలు గా దీపపు ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిదల్లో నూనె పోసి, వత్తులని పెట్టి, ఎంతో శ్రద్ధగా, భక్తిగా పెట్టేసి, నాయనాందకరముగా ఉండేట్లుగా తీర్చి దిద్దుతారు. లేదా క్రోవ్వోత్తులని అందముగా ఒక వరుసలో ఉండేట్లుగా వెలిగించుతారు. కాని ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే - గాలికి అవన్నీ ఉండవు. లేదా టపాసుల చప్పుళ్ళ లో అవన్నీ ఆరిపోతాయి. పండగ పూట ఈ ఆరిపోవటం, లేదా మాటి మాటికి వెలిగించటం కాస్త విసుగ్గా ఉంటుంది కూడా..
సంప్రదాయవాదులు కాస్త కోపం చేయకుండా, తిట్టకుండా, ఏమీ అనకుండా ఉంటే - అభ్యంతరం లేకుంటే - ఈ రెండు పద్దతులని పాటించండి.
చైనా మేడ్ సీరియల్ ల్యాంప్స్ ఉంటాయి. అవి మామూలుగా మార్కెట్ లో Rs. 30 కి దొరుకుతాయి. కొన్ని చోట్ల Rs. 50 కి అమ్ముతారు. వాటిని నేల మీద వరుసగా ప్లాస్టర్ల సహాయన అతికేసి, కనెక్షన్ ఇస్తే సరి. అప్పుడు చీకటి పడ్డాక లైట్లు వేస్తే దీపాల్లా వెలిగిపోతాయి.
ఇంకా ఈ ఎలెక్ట్రికల్ లైట్లని నిజమైన దీపాల్లా వాడాలి అంటే కూడా అలాగే చెయ్యవచ్చును. (ఇది ఎలాగో కాసేపట్లో అప్డేట్ చేస్తాను) కాకపోతే చిన్నగా మూడు రూపాయల ఖర్చు అంతే!.. నిజానికి ఈ పోస్ట్ కి సమయం లేక ఆదరాబాదరాగా చెప్పేస్తున్నాను.. లేకుంటే ఇంకా డిటైల్డ్ గా చెప్పెసేవాడినే..
ఇంకో పద్ధతి.. ఇది మరీ బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా..
బర్త్ డే నాడు వాడే మ్యాజిక్ క్యాండిల్స్ ఇవి పది, పదిహేను రూపాయల్లో దొరుకుతాయి. వీటిని ఇంటి ముందు అలా వెలిగించి ఉంచితే మరీ మరీ బాగుంటుంది. ఎలా అంటే - వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలు క్రోవ్వోత్తులా ఉండి, వెలిగించినప్పుడు మామూలు క్రోవ్వోత్తుల్లానే వెలిగిపోతాయి. వీటిని అలా వరుసగా వెలిగించి ఉంచండి. గాలి వచ్చి ఆరిపోయినా, వాటంతట అవే కాకర పువ్వోత్తులకి లాగా చిన్నగా మిణుగురులు వచ్చి, మళ్ళీ మామూలుగా వెలిగిపోతాయి. ఇది బర్త్ డే పార్టీల్లో వీటిని వెలిగించినప్పుడు అందరికీ అనుభవమే.
వీటిల్లో ఏదైనా వాడి మీ యొక్క దీపావళిని ఘనముగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను..
5 comments:
Thank You And Happy Diwali To All.
Idea baagundi. Happy Deepaavali.
కృతజ్ఞతలు.. మీకందరికీ దీపావళి శుభాకాంక్షలు.
హాయ్ రాజ్ గారు.... మీ బ్లాగ్ బావుంది... మీ బ్లాగ్ ఆసాంతం చదవలేదు కానీ చదివినంత వరకూ మాత్రం అన్నీ నన్ను ఆకట్టుకున్నాయి... నా బ్లాగ్ లో మీ అమూల్యమైన కామెంట్స్ కై మీకు కృతజ్ఞతలు..
మీ అమూల్యమైన సమయం వెచ్చించి, నా బ్లాగ్ ని దర్శించి, కామెంట్ పెట్టినందులకు ధన్యవాదములు..
Post a Comment