Monday, October 3, 2011

Share your Orkut photos on Google+

మీకు గూగుల్ ప్లస్ లో అకౌంట్ ఉందా?.. అందులోకి మీ ఆర్కుట్ ఫొటోస్ ని పెట్టుకోవాలని అనుకుంటున్నారా?.. మీ ఆర్కుట్ అకౌంట్ లోని ఫొటో ఆల్బమ్స్ అన్నీ అందులోకి ఆడ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 

మామూలుగా అయితే ఒక్కో ఫోటో మీ సిస్టం లో సేవ్ చేసుకొని, ఆ తరవాత గూగుల్+ లో చేర్చుకొని, ఆ ఫోటోకి ఉన్న ట్యాగ్ ని, కాపీ & పేస్ట్ పద్ధతిలో ఆల్బమ్స్ ని చేర్చుకున్నట్లయితే - మీరు చాలా ప్రయాసతో, సమయాన్ని వృధా చేస్తున్నారన్న మాటే! దీన్ని ఈజీగా చేసుకోవాలని మీకు ఉంటే - ఓకే.. ఈ క్రింది పద్దతులని స్టెప్ బై స్టెప్ ఆచరించండి. మీ గూగుల్+ ని మీ ఆర్కుట్ లోని ఆల్బమ్స్ తో నింపేసుకోండి. ఇదంతా సెకండ్స్ లలో పని అవుతుంది కూడా.. చాలా ఈజీ.. 

ముందుగా మీరు మీ ఆర్కుట్ అకౌంట్ ఓపెన్ చెయ్యండి. ఒకవేళ మీ ఆర్కుట్ అకౌంట్ పాత వెర్షన్ లో ఉంటే 


పైన ఉండే నూతన వర్షన్ బటన్ నొక్కి క్రొత్త వర్షన్ కి వచ్చెయ్యండి.  అప్పుడు మీరు నూతన ఆర్కుట్ New Orkut లోకి వచ్చేస్తారు.. ఇలా. అప్పుడు మీకు మీ ప్రొఫైల్ లో ఇలా క్రిందలా Share your Orkut photos on Google+ అని ఒక ప్రకటన కనిపిస్తుంది. ఇందులో మీరు బాణం చూపిన 1 వద్ద Copy my Orkut photos to Google+ now అనే లింక్ బటన్ ని నొక్కండి. 


అలా నోక్కారా?.. ఓకే.. ఇప్పుడు మీరు మీ Google+ అకౌంట్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీ గూగుల్+ అకౌంట్ మీకు ఇంకా లేకుంటే అది క్రియేట్ చేసుకోండి. చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చును. ఒకవేళ మీకు అకౌంట్ లేకుంటే మీ జిమెయిల్ అకౌంట్ మెయిల్ ఐడి తో మాత్రమే - ఇక్కడ https://plus.google.com/ మీరు లింక్ నొక్కి, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆ తరవాత ఈ సెట్టింగ్స్ అన్నీ పాటించండి. 

ఒకవేళ మీకు ఇంతకు ముందే మీకు గూగుల్+ అకౌంట్ ఉంటే ఇక మిగతా పద్దతులని పాటించండి. అలా  నొక్కగానే మీ ఆర్కుట్ అకౌంట్ లోని మీరు పెట్టేసుకున్న ఫోటో ఆల్బమ్స్ అన్నీ, ఆ గూగుల్+ లోకి ఆటోమేటిక్ గా టెంపరరీగా చేరుకుంటాయి. ఆ ఆర్కుట్ ఆల్బమ్స్ వాటి వాటి ఆల్బమ్స్ పేర్లతో మీకు అక్కడ కనిపిస్తాయి. మీరు వేటినైతే ఆ గూగుల్+ ఆల్బమ్స్ లో చేర్చదలచుకున్నారో - వాటి మీద క్లిక్ చేస్తే వాటి చుట్టూ 2 లా మార్కింగ్ చేయబడతాయి. ఆ తరవాత మీరు 3 దగ్గర ఉన్న IMPORT SELECTED అనే ఎర్ర రంగులో ఉన్న బటన్ ని నొక్కండి. 


అప్పుడు ఆ ఆల్బం ఇలా 4 వద్ద చూపినట్లుగా అప్లోడ్ అవుతుంది. వంద ఫొటోస్ ఉన్న ఆల్బం సెకన్లలో / రెప్పపాటు కాలములో అప్లోడ్ అవుతుంది. 
అప్పుడు అప్లోడ్ పెట్టిన మిగతా ఆల్బమ్స్ మీద ఇలా waiting అని 5 వస్తుంది. అంటే అవి అప్లోడ్ అవటానికి క్యూ లో ఉన్నాయన్నమాట. 

అవన్నీ అప్లోడ్ అయ్యాక మీకు ఇలా uploaded అని 6 ఆయా ఆల్బమ్స్ మీద ఆకుపచ్చని రంగులో వస్తుంది. 


అలా అంతా అయిపోయాక, 7 లా Done అని వస్తుంది. అలా వచ్చిందీ అంటే అన్ని ఆల్బమ్స్ ఆ గూగుల్+ లోకి చేర్చబడ్డాయి అన్నమాట. ఒకవేళ అప్లోడ్ అవటములో ఏదైనా సమస్య వచ్చి, సరిగా అప్లోడ్ కాకపోతే ఆయా ఆల్బమ్స్ మీద Failed అని వస్తుంది. అలాంటి సమయాల్లో వాటిని మళ్ళీ మార్క్ చేసి, ఆ ఇంపోర్ట్ సెలెక్టెడ్ ని నొక్కాలి. అప్పుడు సరిగ్గా అప్లోడ్ అవుతాయి. 


ఇప్పుడు మీ గూగుల్+ అకౌంట్ ని రెఫ్రెష్ చేసి, మళ్ళీ ఓపెన్ చేస్తే - 8 వద్ద ఫోటో ఆల్బమ్స్ ఐకాన్ ని క్లిక్ చేస్తే, ఆల్బమ్స్ ఓపెన్ అవుతాయి. ఆ పేజీలోని ఎడమవైపున ఉన్న ఆప్షన్స్ లలో 9 వద్ద నున్న Your albums ని నొక్కితే, మీ గూగుల్+ అకౌంట్ లోకి మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఆల్బమ్స్ అన్నీ కనిపిస్తాయి. 10 వద్ద నున్న ట్రాఫిక్ సిగ్నల్ అయిన అడ్డు గీత ఉన్న వృత్తం లా కనిపిస్తాయి. అలాని ఉంటే ఆ ఆల్బం ఎవరికీ చూపేలా షేర్ చెయ్యలేదని అర్థం.  


ఇక్కడ మీరు కొన్ని విషయాలు స్పష్టముగా గమనించవచ్చును. :

1. మీ ఆర్కుట్ అకౌంట్ బోర్ కొట్టేసి, మీరు గూగుల్+ లోకి రావాలని అనుకుంటున్నప్పుడు - అందులో పెట్టుకున్న ఫొటోస్ ని ఇందులోకి ఆడ్ చేసుకోవచ్చును. 

2. మీ ఆర్కుట్ ఖాతాని డిలీట్ చేసి, ఈ గూగుల్+ కి రావాలని అనుకుంటే అందులోని ఫొటోస్ ఇందులోకి శ్రమ లేకుండా ఆడ్ చేసుకోవచ్చును. 

3. చాలా తేలికగా, శ్రమ లేకుండా ఈజీగా ఆ గూగుల్+ లో ఆడ్ చేసుకోవచ్చును. 

4. మీ ఆర్కుట్ ఖాతాలోని ఫొటోస్ ని బ్యాకప్ గా కూడా ఇందులో దాచుకోవచ్చును. ఆర్కుట్ లో పెట్టిన ఫొటోస్ పోయినట్లయితే - ఇందులోని ఫొటోస్ తో మళ్ళీ ఆల్బం తయారు చేసుకోవచ్చును. 

5. ఆర్కుట్ లోని మీ వ్యక్తిగత ఆల్బమ్స్ అన్నీ కూడా ఇందులోకి అంటే - ఈ గూగుల్+ లోకి ఆడ్ చేసుకోవచ్చును. అవి అప్లోడ్ అయ్యాక, మీరు ఇతరులకి షేర్ చేసేదాకా ఎవరికీ కనిపించవు అని ఆ అప్లోడ్ చేసేటప్పుడు ఆ గూగుల్+ వాడు చెబుతాడు. కనుక మీరు నిశ్చింతగా ఉండొచ్చును. అంటే మీరు అలా మీ స్వంత పర్సనల్ ఫొటోస్ కూడా బ్యాకప్ గా ఈ గూగుల్+ లో పెట్టేసుకోవచ్చన్న మాట. 

6. మీరు ఇతరులకి షేర్ చేసేదాకా ఎవరికీ ఇక అందులో ఆ ఆల్బమ్స్ ఉన్నాయని ఇతరులకి తెలీవని ఆ గూగుల్+ వాడి ఉవాచ. 

7. ఆల్బమ్స్ అన్నీ సెకనులలో అప్లోడ్ అవుతాయి. ఇరవై ఆల్బమ్స్ కేవలం అర నిమిషములో అప్లోడ్ అవుతాయి. అంత వేగముగా అప్లోడ్ అవుతాయి. 

8. మీరు సెలెక్ట్ చేసిన ఆల్బమ్స్ మాత్రమే అప్లోడ్ అవుతాయి. 

9. పనిలో పనిగా ఇంకో మాట కూడా చెబుతాను. ఈ Google+ లో జిమెయిల్ లో చేసే చాట్ ఇందులో కూడా చేసుకోవచ్చును. 

10. మీ ఆర్కుట్ ఖాతో లో పెట్టిన ఫొటోస్ కి వచ్చిన ఫోటో ట్యాగ్స్ - ఇక్కడికి కూడా అప్లోడ్ అవుతాయి. మళ్ళీ కష్టపడి ట్యాగ్స్ వ్రాసుకునే శ్రమ ఉండదు. కాని ఫోటో కామెంట్స్ మాత్రం  అప్లోడ్ కావు. ఇక్కడ మళ్ళీ ఎవరైనా కామెంట్స్ పెట్టాల్సిందే.! 

No comments:

Related Posts with Thumbnails