చిత్రం : ప్రాణం ఖరీదు (చిరంజీవి మొదటి చిత్రం)
సంవత్సరం : 1978
సంగీతం : చక్రవర్తి
గాయకుడు : S. P బాలసుబ్రమణ్యం.
రచన : జాలాది.
********************
పల్లవి :
చరణం 2:
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే - సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా - సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాకా - పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోల్ల కులం కోకిలంటరా - ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా
// యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు //
సంవత్సరం : 1978
సంగీతం : చక్రవర్తి
గాయకుడు : S. P బాలసుబ్రమణ్యం.
రచన : జాలాది.
********************
పల్లవి :
యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా - పూరి గుడిసెలోనైనా
గాలి ఇసిరి కొడితే… దీపముండదు
ఆ దీపముండదు // యాతమేసి తోడినా ఏరు ఎండదు //
చరణం 1:
పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా - పసుపుతాడు ముడులేత్తే ఆడదాయిరా
కుడితి నీళ్ళు పోసినా - అది పాలు కుడుపుతాది
కడుపు కోత కోసినా - అది మడిసికే జన్మఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు - తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం - తెలుసుకో // యాతమేసి తోడినా ఏరు ఎండదు // చరణం 2:
అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే - సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా - సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాకా - పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోల్ల కులం కోకిలంటరా - ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా
// యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు //
1 comment:
Exlent song.. Raj..gaaroo.. Thankyou verymuch. jaladhi rajarao.. gaari paatalu anni lyrical values..tho.. untaayi. thankyou!!!
Post a Comment