Monday, May 23, 2011

Social NW Sites - 30 - వైరస్ లు ఎలా వస్తాయి?

ఈ సోషల్ సైట్లలో వైరస్ లు ఎలా వస్తాయీ - అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది వైరస్ అంటూ ఈజీగా గుర్తుపట్టేలా ఇక్కడ ఏమీ ప్రత్యేకముగా ఉండవు. వాటి విషయము మీద కాస్త అవగాహన కలిగి ఉన్నవారు కాస్త చూచాయగా చెప్పగలరేమో!. కాని వైరస్ బారిన పడ్డాకే - అది వైరస్ ఫైల్ అని అప్పటిదాకా ఏమీ తెలీక పోవచ్చును. కనుక తస్మాత్ జాగ్రత్తగా ఉండండి.

ఈ వైరస్ లు పెట్టడం కొన్ని పద్దతుల్లో చేస్తారు. వీటిని ఇలా పెట్టడములో ముఖ్యోద్దేశ్యం ఏమిటీ అంటే - వారి అకౌంట్ లో వైరస్ ని, మాల్వేర్ ని గానీ పెడితే వారి మెయిల్ ID, పాస్ వర్డ్ లని, తెలుసుకొని ఆయా సైట్లలోనికి వెళ్ళటానికి ఎలా తెలుసుకోవాలని. ఇవి మీరు వాటిని టైపు చేసినప్పుడు కీ లాగర్ లాగా పని చేసి ఎవరికీ అందించాలో వారికి నమ్మకముగా తెలియచేసే మాలిషియస్ కోడ్ గలవి. కీ లాగర్ అంటే - మీరు పాస్ వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు, మీరు ఏ ఏ కీలని నొక్కారో అవతలివారికి తెలిపే ఒక ప్రోగ్రాం. అలా మీ పాస్ వర్డ్, మెయిల్ ID తెలుసుకొని, మీ ప్రొఫైల్ ని ఓపెన్ చేసి, మీ ప్రొఫైల్ లోని మీ సమాచారం, మీ ప్రొఫైల్ ద్వారా - మీ మిత్రుల ప్రొఫైల్ లోని సమాచారం, ఫొటోస్.. ఇవన్నీ దొంగిలిస్తారు. వామ్మో అని అనుకుంటున్నారా.. నిజం ఇది. వారేం చేసుకుంటారు వాటినీ అనుకుంటే - చేసుకోదగినట్లుగా ఏదైనా ఉంటే - బాగా ఉపయోగిస్తారు వాటిని..

ఈ మాలిషియస్ కోడ్ లని ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి అని ఏదైనా లింక్ ద్వారా కానీ, ఏదైనా ఫోటోలో గానీ, యానిమేటెడ్ GIF స్క్రాప్ లలో గానీ వీటిని పెట్టడం చాలా ఈజీ. ఎక్కువగా ఇలాగే వస్తుంటాయి. కొన్ని గ్రీటింగ్స్ సైట్లు కూడా ఇలాంటి పనులు చేస్తుంటాయి. ఇలాంటివి ఎక్కువగా బాగా పేరున్న, ఎక్కువమంది సభ్యత్వం గల సోషల్ సైట్లలో చాలా ఎక్కువ. పేరు తక్కువ ఉన్న సైట్లో తక్కువ అని కాదు. వాటిల్లో కూడా ఎక్కువే! వైరస్ కి గురి అయ్యామన్నది అప్పుడే తెలీదు. ఆ తరవాతనే తెలుస్తుంది.

ఇలాంటివాటి బారిన పడొద్దు అనుకుంటే - ముందుగా కాస్త జాగ్రత్తగా ఉండటం మీరు చెయ్యాల్సింది. మీ అక్కౌంట్లలో అనుమానిత లింక్స్ కానీ, అభినందన కార్డ్స్ కానీ ఎక్కువగా ఉంచుకోకండీ. ముఖ్యముగా పోర్నో కి సంబందించిన ఇమేజెస్ - వీటిల్లో చాలా వైరస్ ఎక్కువ. నేను అయితే ఎక్కువగా - ఫోటో గ్రీటింగ్ కార్డ్స్ అసలు ఉంచను.. అన్నీ తీసేస్తుంటాను.

ఇప్పుడు మీకు అలాంటి వైరస్ ప్రోగ్రాం స్క్రాప్ చూపిస్తాను. ఇది నిజమే కావచ్చును.. కాకపోవచ్చును. మీకు చూపించాలని సగం వరకూ వెళ్లాను. కాని ఎందుకో ముందుకు వెళ్లాలని అనిపించలేదు. ఒకవేళ వైరస్ వస్తే నేను ఎందుకు ఇబ్బంది పడాలీ అని - అక్కడితో ఆగిపోయాను.

ఒక పోర్నో స్క్రాప్ ఎన్నుకొని, దాన్ని ఓపెన్ చేశాను.. (ఆ స్క్రాప్ ని పూర్తిగా బ్లర్ గా చేశాను. కాని అర్థం అవుతుంది. అది వీడియో అన్నట్లుగా భ్రమ వచ్చేలా స్క్రీన్ షాట్ చేసి, JPEG ఫోటో పెట్టారు.)


దాని క్రిందుగా - నేను ఇందులో ఉన్నాను. నన్ను చూడాలీ అనుకుంటే అది ఓపెన్ చేసి చూడండి అని టెక్స్ట్ వ్రాస్తారు. అది నమ్మి ఓపెన్ చేస్తే -



ఇలా వస్తుంది. ఇందులో వచ్చిన ఆ నీలి రంగులో ఉన్న లింక్ ని ఓపెన్ చేస్తే, మిగతాది చూడొచ్చు, కాని అంతటితో ఆపేశాను. అలా చేస్తే వైరస్ ఆక్టివేట్ అయితే? ఒకవేళ వైరస్ వస్తే నా ప్రొఫైల్ దెబ్బతింటుంది. అందుకే అక్కడితో ఆపేశాను. అందులో వైరస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చునూ - కాని రిస్క్ తీసుకోదలచుకోలేదు. (అలా వైరస్ కావాలని ఆహ్వానించటం బాగోదుగా) ఒకసారి వైరస్ బారిన పడి చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అంత సీన్ మళ్ళీ అవసరం లేదు. మీరూ ఇలాంటి వాటి బారిన పడి, ఇబ్బందులు తెచ్చుకోకండీ! ఇక్కడ మీకు కొన్ని టిప్స్ చెబుతాను.

1. పోర్నో సంబంధిత, అనుమానిత స్క్రాప్స్ మీ ప్రొఫైల్ లో ఉంచుకోకండి.

2. పోర్నో స్క్రాప్స్ ఎవరి స్క్రాప్ బుక్ లో ఉన్నా వాటిని క్లిక్ చేసి ఓపెన్ చెయ్యాలని చూడకండి.

3. మీ స్క్రాప్ బుక్ లో ఎక్కువగా JPEG ఫొటోస్, గ్రీటింగ్ కార్డులని పెట్టుకోకండీ.

4. ఎవరైనా ఏదైనా లింక్ పంపిస్తే, అక్కడే నొక్కి ఓపెన్ చెయ్యాలని చూడకండి. అంతగా చూడాలీ అని అనుకుంటే ఆ లింక్ ని కాపీ చేసి, ఇంకో టాబ్ లో పేస్ట్ చేసి, ఓపెన్ చెయ్యండి. కాస్త మాత్రమైనా సెక్యూర్ గా ఉంటారు. 

No comments:

Related Posts with Thumbnails