Sunday, May 15, 2011

Yaathamesi thodinaa - Pranam Khareedu

చిత్రం : ప్రాణం ఖరీదు (చిరంజీవి మొదటి చిత్రం)
సంవత్సరం : 1978
సంగీతం : చక్రవర్తి 
గాయకుడు : S. P బాలసుబ్రమణ్యం.
రచన  : జాలాది.
********************
పల్లవి :

యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు
దేవుడి గుడిలోదైనా - పూరి గుడిసెలోనైనా
గాలి ఇసిరి కొడితే… దీపముండదు
ఆ దీపముండదు  // యాతమేసి తోడినా ఏరు ఎండదు //

చరణం 1: 

పలుపుతాడు మెడకేత్తే పాడి ఆవురా - పసుపుతాడు ముడులేత్తే ఆడదాయిరా
కుడితి నీళ్ళు పోసినా - అది పాలు కుడుపుతాది
కడుపు కోత కోసినా - అది మడిసికే జన్మఇత్తాది
బొడ్డు పేగు తెగిపడ్డ రోజు - తలుసుకో
గొడ్డు కాదు ఆడదనే గుణం - తెలుసుకో // యాతమేసి తోడినా ఏరు ఎండదు //

చరణం 2: 

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే - సీము నెత్తురులు పారే తూము ఒక్కటే
మేడమిద్దెలో ఉన్నా - సెట్టు నీడ తొంగున్నా
నిదర ముదర పడినాకా - పాడె ఒక్కటే, వల్లకాడు ఒక్కటే
కూత నేర్సినోల్ల కులం కోకిలంటరా - ఆకలేసి అరిసినోల్లు కాకులంటరా

// యాతమేసి తోడినా ఏరు ఎండదు - పొగిలి పొగిలి ఏడ్చినా పొంత నిండదు //

1 comment:

vanajavanamali said...

Exlent song.. Raj..gaaroo.. Thankyou verymuch. jaladhi rajarao.. gaari paatalu anni lyrical values..tho.. untaayi. thankyou!!!

Related Posts with Thumbnails