మనలో చాలా మందికి మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు కదూ.. దానిలోని మెమొరీ కార్డులో పాటలూ, ఫొటోస్ వేసుకొని, వాటిని చూస్తూ, వింటూ ఆనందిస్తారు కదూ.. మనమే కాదు, చాలామంది ఈ మొబైల్స్ సెంటర్స్ కి వెళ్లి అందులోని కంప్యూటర్ ద్వారా ఈ మెమొరీ కార్డ్ లోనికి పాటలూ, ఫొటోస్, వీడియోలూ.. వేసుకుంటూ ఉంటారు. తిరిగి ఆ మెమొరీ కార్డ్ ని మీ మొబైల్ ఫోన్ లోకి పెట్టేసుకొని ప్లే చేసుకొని, ఆనందిస్తూ ఉంటారు కదూ.. మొదట్లో నేనూ అలాగే చేసేవాడిని.. అందులోని కొంత చాకచాక్యమూ, నేర్పరితనమూ, మోసమూ... చూసి మళ్ళీ ఆ మొబైల్ సెంటర్లలో ఆ పనికోసం అడుగు పెట్టలేదు. అలా ఎందుకో ఇప్పడు మీకు చెబుతాను.
మీరు మీ మెమొరీ కార్డు తీసుకొని వారివద్దకి వెళ్లి - పాటలు / వీడియోలూ / ఫొటోస్.. నింపమని అడుగుతే, సరే అని అంటారు. ఆ మెమొరీకార్డ్ ని ఇమ్మని అడుగుతారు. మీరు మీ ఫోన్ మెమొరీకార్డ్ ని తీసిస్తారు. ఆ మీ మెమొరీకార్డ్ ని ఒక మెమొరీకార్డ్ రీడర్ లోన అమర్చి, సిస్టంకి అమర్చుతాడు.. అప్పుడు అది ఆటో రన్ ద్వారా ప్లే అవుతుంది. అంటే - ముందుగా ఒక మెనూ వస్తుంది. ఆ వచ్చిన మెనూలో ఈ ఫోటో లో చూపినట్లుగా Copy pictures to a folder on my computer అనే ఆప్షన్ ఎన్నుకొని, Always do this selected action అన్న వద్ద క్లిక్ చేస్తాడు. ఇలా ముందుగానే సెట్ చేసుకొని ఉంటాడు. అలా చేస్తే మీరిచ్చిన మేమోరీకార్డు లోని మీ ఫొటోస్, మీ వీడియోలూ, ఇంకా మీరు దాచుకున్న మీ పర్సనల్ ఫైల్స్ అన్నీ అతడి కంప్యూటర్లోకి వెళ్లి ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. అంటే మీ కార్డులోనివీ అలాగే ఉండి.. ఒక కాపీ అతడి సిస్టం లోనికి చేరుకొని భద్రముగా ఉంటుందన్న మాట. (అందరూ అలా చేస్తారని చెప్పటం లేదు.)

ఇప్పుడు మీరు అలా మీ మెమొరీ కార్డ్ ఇవ్వగానే,మిమ్మల్ని మాటల్లో పెట్టి, అతడు అలా సిస్టం కి పెట్టి, ఇలా మెనూ బాక్స్ రాగానే వెంటనే OK నొక్కేస్తాడు.. ఇదంతా చెయ్యటానికి ఐదు, పది సెకన్ల కన్నా మించి సమయం తీసుకోదు.. అంతా మీరు గమనించేసేలోగా అయిపోతుంది. అప్పుడు ఆ మెమొరీ కార్డ్ లోని డాటా "అంతా" అతడి సిస్టం లోనికి చేరుకోవటం ప్రారంభం అవుతుంది. ఇప్పడు అతడు మీతో తీరిగ్గా ముచ్చట మొదలెడుతాడు - ఇందులో ఏమేమి వేద్దాం అని. మీరు ఎటో ఆలోచిస్తూ, అందులో ఎమేమి ఉండాలో, మీకు ఏమేమి కావాలో అన్నీ వివరముగా చెబుతూ ఉంటారు. మీరు అలా చెప్పేలోగానే అందులోకి కాపీ అయిపోతుంది. ఇప్పుడు అతడు రిఫ్రెష్ చేస్తాడు అతడి సిస్టమ్ ని.
ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీ మెమొరీకార్డ్ లోకి చేరుస్తూ ఉంటాడు.. అన్నీ ఒక ఫోల్డర్ లోకి వేసి, దాన్ని ఆ మెమొరీ కార్డు లోకి, సిస్టం సహాయముతో ఎక్కించేస్తాడు. అలా ఆ మెమొరీకార్డ్ లో డాటా పూర్తిగా నిండగానే, సిస్టం నుండి దాని డిటాచ్ చేసి, ఆ కార్డుని, మీ ఫోన్ లోకి అమర్చి, ప్లే చేసి చూపిస్తాడు. మీరు ఆ సంతోషములో వాటిని తన్మయత్వము లో ఉండి అసలు విషయాన్ని మరచిపోతారు. అతడు అడిగిన డబ్బులు ఇచ్చేసి బయటకి వచ్చేస్తారు.
ఇలా మీరు వెళ్ళిపోయాక, లేదా తన షాప్ కట్టేసే వేళ, లేదా ఎవరూ లేని సమయాన - తన సిస్టం లోకి కాపీ చేసుకున్న మీ మెమొరీ కార్డ్ లోని డాటాని పరిశీలిస్తాడు.. మీ దాంట్లోని పాటలు ఉంటే తన సిస్టం లోని పాటల ఫోల్డర్ లోకి వేసుకుంటాడు. వీడియోలు ఉంటే వీడియోల ఫోల్డర్ లోకి... అలా వేసుకుంటాడు. ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. మీ కార్డులో ఏమైనా రహస్యమైన బెడ్ రూం వీడియోలూ, ఫొటోస్ గాని ఉండి ఉంటే, లేదా అలా కార్డ్ ఇచ్చిన వారు అమ్మాయి ఆయితే - అమ్మాయిల ఫొటోస్ గనుకే ఉంటే ఇక వారికి పండగే పండగ. అక్కడి నుండి యే యూ ట్యూబ్ కో, పోర్న్ సైటులోనో, లేదా ఏదైనా అప్లోడ్ సైటులో గాని చేరుస్తారు. ఇక అలా విశ్వరూపమే.. విశ్వవ్యాప్తమే. అలాంటి మూడు ఫొటోస్ మీకు చూపిస్తున్నాను చూడండి.
(పై ఫోటోలూ మూడూ అలాగా నెట్లో పెట్టినవే!..చాలా ఫొటోస్, వీడియోలు అలా నెట్లోకి ఎక్కినవే అని వినికిడి.!! నాకే ఏదోలా అనిపించి అన్నీ కనపడకుండా దాచేసి, క్లారిటీ (బ్లర్) కూడా తగ్గించేశాను.. మొదటి ఫోటో ఏదో సరదాగా వారు చూడనప్పుడు తీసుకున్నారు అనుకుందాం. ఆ రెండో ఫోటో - కావాలనే అలా పిట్ట గోడ మీద కూర్చొని దిగారు. ఇక ఈ మూడో ఫోటో చూడండి. ఈ ప్రేమికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని - అంటే వెనక బ్యాక్ గ్రౌండ్ కనిపించనీయకుండా కర్టేన్స్ వేసి మరీ సెల్ఫ్ ఫోటోగ్రఫీ చేసుకున్నారు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నవారు - ఈఫోటో ని ఎలా బయటకి పంపించారో నాకు అర్థం కాలేదు. అన్నింటిలో నాకు కామన్ గా అనిపించినది ఏమిటంటే - అలాంటి ఫోటోలలో నెట్ లోకి ఎక్కేవి చాలా వరకు ఆడవారి ఫొటోస్. వారితో ఉన్న మగవారి ముఖాలు కనపడటం చాలా అరుదు. భార్యలో, ప్రియురాల్లో, స్నేహితులో, సన్నిహితులో.. ఇలా వీరే బలి అవుతున్నారు. పైశాచిక ఆనందం ఆ మగవారిది. మానసిక క్లేశం ఈ ఆడవారిది. ఇదంతా నా బ్లాగు రేటింగ్స్ కోసం చెప్పటం లేదు. ఆడవారు ఈ విషయాన్ని కాస్త గమనించ గలరు - అని హెచ్చరించటం అంతే. )
కొసమెరుపు: మీరు అనుకోవచ్చు.. మా కార్డుని అంతా డిలీట్ చేసి ఇస్తానుగా.. ఎలా చూస్తాడు.. అని అడగవచ్చు. టెక్నాలజీ రెండువైపులా పదనున్న కత్తి. దాన్ని వాడే బుద్ధిని బట్టి ఉంటుంది. నెట్లో ఉచితముగా దొరికే ఒక సాఫ్ట్వేర్ ని (పేరు చెప్పను) ఉపయోగించి అలా డెలీట్ చేసిన మెమొరీ కార్డ్ లోని సమాచారం అంతా యధాతతముగా తిరిగి తీయవచ్చును. దీనికి పట్టే కాలము రెండు నుండి ఐదు నిముషాల సమయం అంతే! నా ఫ్రెండ్ నమ్మకపోతే - వాడి కళ్ళముందే అలా తీసి చూపాను నేను. తన ఫొటోస్ డెలీట్ అయ్యాయి అని అంటేనూ.. కాసేపట్లో మళ్ళీ తీసిచ్చాను.
అందుకే తస్మాత్ జాగ్రత్త.. ఒకసారి మీ చేతినుండి జారిందా -
ఆపటం మీ తరం కాదని గుర్తుపెట్టుకోండి!!.
No comments:
Post a Comment