Sunday, September 5, 2010

మెమొరీ కార్డ్ - మొబైల్ సెంటర్ - 2

మొబైల్ సెంటర్లలో ఇంకో విషయం గమనించినది ఏమిటంటే.. వారి సిస్టం గురించి. అన్ని సిస్టమ్స్ లాగా ఉంటాయి. కాని వైరసూ ఉంటుంది. అదెలా అంటే మెమొరీ కార్డ్ నింపటానికో వారివద్దకి వేలతాముగా.. అలా చెయ్యటానికి ఆ మెమొరీ కార్డ్ ని కార్డ్ రీడర్ లో పెట్టి సిస్టం కి అమర్చుతారు. చెప్పానుగా వెంటనే కాస్త నైపుణ్యముగా ఆ మెమొరీ అంతా సిస్టం లోనికి అప్లోడ్ చేస్తాడని. అప్పుడు మనల్ని ఏమి పాటలు వేయమంటారో అడుగుతాడనీ.. మనం కోరిన పాటలు వేస్తారు. ఆతర్వాత ఆ నింపిన మెమొరీ కార్డ్ ని మనకి ఇస్తాడు. దాన్ని మనం వాడుకుంటూ ఉంటాము.

సాధారణముగా అవతలివాడి మెమొరీ కార్డ్ లో ఏమున్నాయో, తనవద్ద ఏమిలేవో చూసుకోవటానికి అలా చేస్తుంటారు. అవతలి వాడి కార్డులో ఏవైనా రహస్యమైనవి ఏమైనా ఉన్నాయో చూడటానికి అలా చేస్తుంటారు. ఎక్కువగా రఫ్ కారేక్టేర్స్ ఉన్న వారి మొబైల్ మెమొరీ కార్డులో బూతు కి సంబంధించినవి బాగా ఉంటాయి. అవి మామూలువే! కొంత ఎక్కువ చదువుకున్నవారి, సంఘములో హై ప్రొఫైల్ మెమొరీ కార్డ్ కి ఇలా చేస్తుంటారు.. కాలేజీ విద్యార్థులు వీరికో వరం. వారి దాంట్లోనే వీరికి బాగా దొరుకుతాయి. అలా చెయ్యటానికి ఆ విద్యార్థుల కార్డుని ఆక్సెస్ చేయాలి అంటే వీరి సిస్టం ఫుల్ సెక్యూర్ గా ఉంటే ఆ కార్డ్ ని ఆక్సెస్ చెయ్యదు. కారణం ఏమిటంటే వారి దాంట్లో వైరస్ ఉంటుంది కాబట్టి. అలా వారివి ఉంచుకొని, చూడాలి అంటే తప్పనిసరిగా అంటి వైరస్ ని ఐడిల్ లో ఉంచుతారు. అలా ఉంచితే ఆ కార్డు ని సిస్టమ్ ఆక్సెస్ చేస్తుంది.. అప్పుడు వీరి మెమొరీ కార్డు లోనివి వారి సిస్టం కి పంపించుకుంటారు. వీరు ఏమైనా డాటా వేయమంటే వేసినప్పుడు వేస్తారు.. అప్పుడే ఆ సిస్టం లోని వైరస్ ఈ మెమొరీ కార్డ్ లోకి వస్తుంది. ఇప్పుడు ఆ మెమొరీ కార్డ్ ని ఫోన్ లో పెట్టుకొని ఆ డాటా ని వాడుకుంటూ ఉంటారు.

ఇక్కడే ఇంకో తిరకాసు ఉంది. ఆ మెమొరీ కార్డ్ లోని డాటా వాడుతున్నప్పుడు ఆ మెమొరీ కార్డ్ లోని వైరస్ ఆ కార్డ్ అంతటా మెల్లగా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే ఆ కార్డు లోని డాటా కి అంతా వ్యాపించేస్తుంది. ఈ కార్డు లోని డాటాని (వైరస్ ఉన్న ఒక్క డాటా గాని ) ఫోన్ మేమోరీలోకి మార్చితే గనుక ఇక ఆ వైరస్ ఫోన్ మేమోరీకీ కూడా పట్టేసుకుంటుంది. అంటే నెమ్మదిగా ఈ ఫోన్ అంతా కూడా వైరస్ తో నిండిపోతుంది అన్నమాట!.. అప్పుడు కొద్దిరోజుల తరవాత ఒక శుభ ముహూర్తాన మీ ఫోన్ పనిచెయ్యదు. స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఏమిటాని మీరు ఎన్నోసార్లు స్విచ్ ఆన్ చేసినా అది పనిచెయ్యదు. మెకానిక్ వద్దకి వెళితే - ఫోన్ మరియు మెమొరీ కార్డ్ లోని డాటా క్లీన్ కోసం చెరో యాభై అంటే వంద రూపాయలు తీసుకొని అంతా క్లీన్ చేసిస్తాడు. అంటే ఆంటివైరాస్ పెట్టి క్లీన్ చెయ్యడు.. కొన్ని కోడ్స్ వాడి క్లీన్ చేస్తాడు ( అవి ఏమిటో ఈ బ్లాగులోనేవ్రాశాను - చూడండి) దీనివలన మెమొరీ కార్డ్ లోని డాటా మొత్తమూ, ఫోన్ మెమొరీ లోని మొత్తం అన్నీ - ఆఖరికి ఫోన్ నంబర్స్ తో సహా అన్నీ పోతాయి. ఒకే ఒక్కమాటలో చెప్పాలీ అంటే మీరు ఆ ఫోన్ కొన్నపుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మళ్ళీ ఫోన్ నంబర్స్ అన్నీ ఎక్కించుకోవాలి.

ఇలాంటి మొబైల్ ఫోన్ లో నుండి ఏదైనా డాటాని - ఇన్ఫ్రా రెడ్ వల్లనే గానీ, బ్లూటూత్ వల్లనే గాని, సిస్టం వల్లనే గానీ (ఆంటీ వైరస్ పనిచేయని సిస్టమ్), మీ ఫోన్ లోకి డాటా ఎక్కించినా ఆ ముందున్న వైరస్ ఇందులోకి కూడా వస్తుంది.. ఈ ఫోన్ కూడా దానిలాగే కొద్దిరోజులకి మూగనోము పడుతుంది. ఇది ఎన్నిరొజులో అంటే - ఏమీ చెప్పలేము. మీ ఫోన్ సామర్థ్యం, మెమొరీ కార్డ్ లోనిఫోల్డర్స్, ఆ డాటాని వాడకం, అందులో ఉన్న వైరస్, ఆ వైరస్ టైప్ వల్ల ఏదీ ఇతిమిధ్యముగా చెప్పలేము. నా ఫోన్ ఒకటి క్రొత్తగా కొన్నాను.. దానికి ఆ షాప్ వాడు చేసిచ్చిన ఉచిత మెమొరీ కార్డ్ వల్ల - నాకు వంద రూపాయల చేతి చమురు వదిలింది. అప్పుడే ఈ విషయాలు అన్నీ తెలిశాయి. మీకూ ఇలా కావద్దని ముందు జాగ్రత్తగా హెచ్చరించడం.

4 comments:

భాస్కర రామి రెడ్డి said...

Raj గారూ...,వినాయక చవితి శుభాకంక్షలు

హారం

Hemalatha said...

రాజ్ గారు .. మీ బ్లాగ్ చాల బాగుందండి ఇన్ఫర్మేటివ్ గా ..అభినందనలు.
hemalatha putla

Raj said...

భాస్కర రామి రెడ్డి గారూ,
కృతజ్ఞతలు.. అలాగే మీకు కూడా..

Raj said...

Hemalatha గారూ!.. నా బ్లాగ్ నచ్చిందులకి చాలా కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails