ఆర్కుట్ - సోషల్ సైట్ ని మూసేస్తున్నారన్నది మీకందరికీ తెలిసిన విషయమే. అందులోని పోస్ట్స్, మన కామెంట్స్, ఫోటోలకి వచ్చిన కామెంట్స్ నీ, టెస్టిమోనియల్స్, కమ్యూనిటీలలో మనం వ్రాసిన పోస్ట్స్ ని మనం ఎల్లకాలం దాచుకొనే విధముగా ఆర్కుట్ (గూగుల్) వారు ఒక సౌకర్యాన్ని కలిగించారు. దాన్ని ఎలా వాడుకోవాలో మీకు ఇప్పుడు తెలియచేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా ఆలస్యముగా తెలియచేస్తున్నందులకు మన్నించండి. నాకున్న బీజీ జీవితాన అలా అయ్యిందని అర్థం చేసుకోగలరని మనవి.
ఈ క్రింది విధముగా ఆర్కుట్ - సోషల్ సైట్ లో ఖాతాలు ఉన్నవారందరికీ - వారి వారి ప్రోఫైల్స్ లలో మొదటగా కనిపించే విధముగా ఇలా వస్తుంది. ఈ సంవత్సరం 30, సెప్టెంబర్ 2014 వరకూ ఆర్కుట్ ఖాతా కనిపిస్తుంది. ఆతరవాత ఇక కనిపించదు అని దాని సారాశం.
మీకు ఒక ఆర్కుట్ మూసేస్తున్నట్లుగా మెయిల్ వచ్చి ఉండవచ్చును. ఒకవేళ రాకుంటే ఏమీ బాధపడకండి. అందులో ఇచ్చిన ఒక లింక్ ని నొక్కితే ఇలా ఈ పేజి మీకు కనిపిస్తుంది. ఇందులో మీకు కనిపిస్తున్న రెండు లింకుల్లో ఒకటి అంటే Export your photos.. అనే లింక్ ని ఎలా చెయ్యాలో మీకు ముందు పోస్ట్ లో చెప్పాను. ఇప్పుడు మిగిలిన లింక్ అంటే See your Orkut profile, scraps, testimonials & community to your computer using Google takeout అనే లింక్ ఉంది చూడండీ.. ఆ లింక్ ప్రక్కనే మరొక చల్లని కబురు కూడా చెప్పారు. ఇలా డౌన్లోడ్ చేసుకోవడం అన్నది - సెప్టెంబర్ 2016 వరకూ అన్నది. ఇలా మరో రెండు సంవత్సరాల సమయం ఉందన్నమాట. అయిననూ త్వరపడండి.
ఆ లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఇలా ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇందులో సభ్యుల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి. కమ్యూనిటీల ఓనర్స్ కి కొన్ని ముఖ్యమైన సూచనలని అక్కడ ఇచ్చారు. జాగ్రత్తగా చదివి, ఆచరించండి.
అకౌంట్ నీ, మన పోస్టింగ్స్ నీ ఎలా డిలీట్ చేసుకోవచ్చునో అందులో తెలియ చేశారు. అవన్నీ డిలీట్ ఎందుకూ అంటే - గూగుల్ సర్చ్ లో సర్చ్ చేస్తే - పబ్లిక్ ఆప్షన్ గా ఉన్న పోస్ట్స్ అన్నీ కనపడేలా ఎప్పటినుండో ఉంది. అలా ఇక గూగుల్ సర్చ్ లో కనపడకుండా ఉండాలంటే అలా చేసుకోక తప్పదు. మరిన్ని వివరాలకు క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, తెలుసుకోగలరు.
ఆర్కుట్ లోని మన ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే - చేసుకుంటే ఏమేమి వస్తాయో, ఎలా ఉంటుందో, అన్నీ ఇక్కడ విపులముగా ఇచ్చారు. అలా డౌన్లోడ్ చేసుకొనే వాటిల్లో - మన ప్రొఫైల్, మనకి వచ్చిన / పొందిన స్క్రాప్స్, వచ్చిన టెస్టిమోనియల్స్, మన ఫొటోస్, కార్యకలాపాలు.. ఇత్యాదివి ఉంటాయి. ఇక్కడ ఇచ్చిన గూగుల్ వారి టేకవుట్ Take out ఇలా ఈ లింక్ నొక్కితే వస్తుంది.. ( https://www.google.com/settings/takeout )
ఈ విషయం అంతా మనకి ఒక ZIP ( Joint Photographic Experts Group ) ఫార్మాట్ లో ఒక సింగిల్ ఫైల్ ( సైజుని బట్టి ) వస్తుంది. అందులో వచ్చే ఫైల్స్ అన్నీ HTML ( Hyper Text Markup Language ) ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఆ ఫైల్స్ అన్నీ గూగుల్ క్రోం లాంటి బ్రౌజర్స్ లాంటి వల్లే తెరవగలం / చూడగలం అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఫొటోస్ అన్నీ JPEG ఫార్మాట్ లో కనిపిస్తాయి. ఈ ఫార్మాట్ అన్ని సిస్టమ్స్, ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్స్ కీ, ఫోటో ఎడిటర్స్ కీ అన్నివిధాలా అనువుగా ఉంటుంది. కనుక అదీ మంచి అంశమే.
ఇచ్చిన టేక్ అవుట్ పేజీ లింక్ ని నొక్కితే ( పైన ఇచ్చాను చూడండి) ఇలా మీకు కనిపిస్తుంది. అప్పుడు ఈ క్రింద ఎర్రని బాణం గుర్తు కనిపిస్తున్న వద్ద Create an archive ని నొక్కండి.
అప్పుడు ఇలా గూగుల్ వారి సైట్స్ ఓపెన్ అవుతాయి. అందులో ఆర్కుట్ ప్రక్కన ఉన్న గడిలో టిక్ చెయ్యండి. ఆ తరవాత ఓకే చెయ్యండి. అది ఎలాగో ఈ క్రింది ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, చూడండి.
ఆ తరవాత ఇలా గూగుల్ వారి ఆర్కుట్ లోని డాటా కాన్ఫిగర్ చేసుకోవటానికి సిద్ధముగా ఉందని ఇలా కనిపిస్తుంది.
పై ఫోటోలో 1 Google product ప్రక్కన .zip format change అని ఉంటుంది. ఇది మనకి అవసరం లేదు అయినా డిటైల్స్ చెబుతున్నాను. దాని ప్రక్కన ఉన్న Change ని నొక్కితే ఇలా క్రింది విధముగా కనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న త్రికోణం కనిపిస్తుంది. ( ఎరుపురంగు బాణం గుర్తు వద్ద చూపాను )
అలా తెరచుకున్న దానిలో
.zip
.tgz
.tbz
ఫార్మాట్స్ కనిపిస్తాయి. అంటే మనం ఏదైనా గూగుల్ సైట్ నుండి మనం డాటా డౌన్లోడ్ చేస్తే ఆ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవుతుంది.
.tgz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.
.tbz ఫార్మాట్ ని ఎంచుకుంటే వాటిని మన కంప్యూటర్ లలో చూడటానికి ఆ అదనపు సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అని ఇక్కడ కూడా గుర్తు చేస్తున్నారు. ( క్రింది ఫోటో )
అందువల్ల .zip ఫార్మాట్ యే బెస్ట్. ఇది అన్ని సిస్టమ్స్ లలో ఉంటుంది. అదనముగా యే సాఫ్ట్ వేర్ అవసరం ఉండదు. మనం డాటా ఆర్కైవ్ 2 GB ( గిగాబైట్స్ ) దాటితే అది చిన్న చిన్న జిప్ ఫైల్స్ లలో మారి డౌన్లోడ్ అవుతుంది అని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు.
ఇదంతా అంటే .zip, .tbz, .tgz అంటూ చెప్పింది మీకు విషయ పరిజ్ఞానం కోసమే చెప్పాను. వాటిని సెలెక్ట్ చేసుకోవద్దని చెప్పటానికి అదంతా చెప్పాను. ఇక విషయానికి వస్తే - అలా .zip కనిపించాక ఇప్పుడు మీరు బాణం గుర్తు చూపిన వద్దనున్న Create an archive అనే ఎరుపురంగులో ఉన్న బటన్ ని నొక్కండి.
అప్పుడు ఇలా Download a copy of your data అని ఇలా వస్తుంది. మన డాటా అంతా ప్రిపేర్ అవుతున్నట్లు ఇక్కడ ఒక పట్టీలో కనిపిస్తుంది. ప్రక్కనే ఆకుపచ్చని రంగులో In progress లో ఉన్నట్లు చూపిస్తుంది. అలా రాకుంటే మళ్ళీ బ్యాక్ వచ్చి, నొక్కాలి.
ఇలా ఈక్రింది ఫోటోలో చూపిన మాదిరిగా నీలిరంగులో బార్ మొదలయ్యిందీ అంటే మన డాటా ఆర్కైవ్ అవుతున్నట్లు లెక్క. ఇలా వచ్చాక మీరు సిస్టం కట్టేసి, పనిమీద బయటకి వెళ్ళిపోవచ్చును కూడా. ఆగిపోతుందన్న భయపడాల్సిన పనిలేదు. ఇంకేదైనా పని చేసుకోవచ్చును కూడా..
ఇలా మన డాటా ఆర్కైవ్ గా మారాక మన మెయిల్ బాక్స్ కి ఈ క్రింది విధముగా - మన డాటా ఆర్కైవ్ డౌన్లోడ్ కి సిద్ధముగా ఉన్నట్లు మెయిల్ వస్తుంది.
ఆ మెయిల్ ని ఓపెన్ చేస్తే ఇలా వచ్చిన ఆర్కైవ్ ని వారు ఇచ్చిన తేదీలలోగా ఎన్నిసార్లైనా డౌన్లోడ్ చేసుకోవచ్చును.
అలాగే కంటిన్యూ అయ్యి, ఓపికగా ఎదురు చూసిన వారికి, ఇలా - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. ఇక్కడ మన డాటా సైజు ఎంతో, అది ఎప్పటివరకు అలా ఆర్కైవ్ గా ఉంటుందో, ఎంతకాలములో డౌన్లోడ్ చేసుకోవచ్చో సవివరాలు ఇక్కడ కనిపిస్తాయి. క్రిందన నీలిరంగులో Download అని బటన్ కనిపిస్తుంది. అలాగే ఫైల్ పేరు కూడా కనిపిస్తుంది. సాధారణముగా ఈ ఫైల్ పేరు మన ఈ మెయిల్ ఐడి పేరే ఉంటుంది. ( ఇక్కడ ఈ మెయిల్ ఐడి ని ఆరెంజ్ రంగు డబ్బాతో తీసివేయడం జరిగింది )
అలా డౌన్లోడ్ ని నొక్కగానే మన గూగుల్ పాస్ వర్డ్ ని మళ్ళీ అడుగుతుంది. స్వంత సిస్టం అయితేనే ఆ పాస్ వర్డ్ ని మళ్ళీ టైపు చెయ్యటం మంచిది. లేకుంటే ఆ డాటా అంతా ఆ సిస్టంలో అలాగే ఉండిపోతుంది. వేరేవారు చూసే వీలు ఉంటుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఏమిటో కూడా కనిపిస్తుంది. ( నేను దాన్ని కనిపించకుండా చేశాను )
మళ్ళీ ముందులా వస్తుంది. అప్పుడు Download బటన్ ని మళ్ళీ నొక్కాలి.
ఇలా మీ డాటా మీ సిస్టం లోకి డౌన్లోడ్ అవుతుంది. ఇలా చేసుకోవటం అన్నది మీ సిస్టం అయితే మంచిది. అందులోని ఫొటోస్, మీ స్క్రాప్స్... వేరేవారి కంట పడవు. డౌన్లోడ్ కాలం అన్నది మీ సిస్టం కాన్ఫిగరేషన్ ని బట్టి, ముఖ్యముగా మీ నెట్ కనెక్షన్ స్పీడ్ ని బట్టీ ఉంటుంది. పగలు కన్నా - రాత్రి పూట పొద్దుపోయాక ఇలా డౌన్లోడ్ పెట్టుకుంటే మరింత వేగముగా డౌన్లోడ్ జరిగిపోతుంది. అలా చేస్తే - నాకైతే 158.9 MB డాటాకి ఆరు నిమిషాలు డౌన్లోడ్ పూర్తవటానికి సమయం పట్టింది.
డౌన్లోడ్ అయ్యాక గూగుల్ క్రోం లో ఇలా కనిపిస్తుంది.
డిఫాల్ట్ డౌన్లోడ్ పాత్ అయిన Downloads ని ఓపెన్ చేస్తే అక్కడ ఇలా మన మెయిల్ ఐడి పేరుతో ఒక జిప్ ఫోల్డర్ కనిపిస్తుంది.
Zip folder |
ఆ జిప్ ఫోల్డర్ ని అన్ జిప్ చెయ్యాలి. అంటే అన్ జిప్ సాఫ్ట్వేర్ వాడి ఇలా ఓపెన్ చెయ్యాలి. అంటే అందులోని ఫైల్స్ ని ఎక్ష్ ట్రాక్ట్ చెయ్యాలన్నమాట.
Extract files |
అప్పుడు ఇలా వస్తుంది.
Extracting files |
ఇలా వచ్చిన ఆర్కైవ్ డాటా అన్ జిప్ Unzip అవటం మొదలవుతుంది.
Unzip ఇలా అప్పుడు మామూలుగా చూడటానికి వీలుగా ఒక ఫోల్డర్ వస్తుంది. |
ఆ ఫోల్డర్ తెరిస్తే మీకు ఇలా కనిపిస్తాయి.
అందులోని ఫొటోస్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తే మీ మీ అకౌంట్స్ లలో ఉన్న ఫొటోస్ కనిపిస్తాయి.
ఇలా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తున్నాను.
ఇక్కడ మీకు కొన్ని సూచనలు.
1. నెట్ కనెక్షన్ స్పీడ్ బాగున్నప్పుడు ఇలా డాటా ఆర్కైవ్, డాటా డౌన్లోడ్ పెట్టేసుకోండి.
2. మీ డాటా కనెక్షన్ లిమిట్ నీ ఒకసారి గుర్తుపెట్టేసుకోండి.
3. రాత్రి పూట - అదీ బాగా పొద్దుపోయాక డౌన్లోడ్ చేస్తే, ఆ సమయంలో డాటా కనెక్షన్ మీద ట్రాఫిక్ వత్తిడి ఉండదు కాబట్టి, బాగా త్వరగా మీ పని ముగుస్తుంది.
4. ఆర్కుట్ స్క్రాప్స్ ఒక్కో లింక్ కీ పది స్క్రాప్స్ వస్తాయి. అందులో ఫొటోస్, కామెంట్స్ కూడా ఉంటాయి. బాగున్నవాటిని అట్టే పెట్టేసుకోండి. బాగోలేనివి, వివాదాస్పదమైనవి శాశ్వతముగా డిలీట్ చేసెయ్యండి. వాటిని చూసుకొని బాధ పడటం మంచిది కాదు. కొన్నింటిని నిర్దయగా కాలగర్భములో కలిపేసేయ్యాలి. అలా అయితేనే భవిష్యత్తు జీవనములో హాయిగా ఉంటాం..
5. చివరి వరకూ ఆగకండి. అందరూ ఒకేసారి ప్రయత్నిస్తే - సర్వర్ క్రాష్ అయ్యి, పనిచెయ్యక పోవచ్చును. అప్పుడు శాశ్వతముగా మీ జ్ఞాపకాలు కోల్పోవాల్సి రావచ్చును.
6. ఆర్కుట్ అకౌంట్ లో మీరు ఇప్పుడు ఆక్టివ్ గా ఉంటున్న సోషల్ సైట్ అడ్రెస్ మరియు అందులోని మీ ప్రొఫైల్ లింక్ మీ స్నేహితుల వారికి అందించండి. అందరికీ కనపడేలా మీ స్క్రాప్ లో వ్రాసి, పబ్లిక్ / ఫ్రెండ్స్ కి కనపడేలా సెట్టింగ్స్ పెట్టి పోస్ట్ చెయ్యండి.
7. కొన్ని స్క్రాప్స్, పోస్ట్స్, ఫొటోస్ డౌన్లోడ్ లో మిస్ అవుతుండ వచ్చును. అందుకని వాటిని స్క్రీన్ షాట్స్ ద్వారా కాపీ చేసుకోగలరు.
1 comment:
ధన్యవాదాలు ...
నేను ఇప్పుడే orkut లో ఉన్న నా పాత ఫోటోలు , స్క్రాప్స్ download చేసుకున్నా..
Post a Comment