మీరు మీ ఫేస్ బుక్ అకౌంట్ లో ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నారా ? అయితే ఈ క్రింది సూచనలని పాటించండి. ఇవన్నీ మీకు తెలిసే ఉండొచ్చు. కానీ క్రొత్తగా వాడుతున్న వారికీ, ఎలా చెయ్యాలో తెలీని వారికి ఈ టపా..
మీ ఫేస్ బుక్ టైం లైన్ లో కవర్ ఫోటో క్రింద ఆల్బమ్స్ Albums అనే టూల్ ఉంటుంది. దాన్ని నొక్కితే, మీ ప్రొఫైల్ లో ఏమేమి ఫొటోస్ ఉన్నాయో తెలుస్తుంది. అలా ఓపెన్ చెయ్యగానే పైన క్రియేట్ ఆల్బం / ఆడ్ వీడియో ( Create Album / Add video ) అని వుంటుంది. ఇందులో ఉన్న క్రియేట్ ఆల్బం ని నొక్కితే - మీరు మీ అకౌంట్ లో క్రొత్తగా ఒక ఆల్బం పెడుతున్నారని, దానికోసం తగిన విధముగా వివిధ ఆప్షన్స్ కల మెనూ వస్తుంది. అది ఈ క్రింది విధముగా ఉంటుంది.
1. క్రియేట్ ఆల్బం Create album ని నొక్కగానే మీకు ఇలా వస్తుంది. అలా నొక్కినప్పుడు - మీరు ఏ ఫోటో ఆల్బం అప్లోడ్ చెయ్యబోతున్నారో - అందులోని ఒక ఫోటో ని ముందుగా సెలెక్ట్ చేసుకొని, ఓకే చెయ్యాలి. అప్పుడే ఈ ఆల్బం తయారవటానికి తగిన ప్రాసెస్ జరగటానికి ముందుకు వెళుతుంది. ఈ ఎన్నిక చేసుకున్న ఫోటో ఆ ఆల్బం లోని విషయాన్నంతా ఆ ఒక్క ఫోటోలో అగుపించేలా ఉన్నది అయితే మరీ మంచిది. ఉదాహరణకి అంటే - ఏదైనా దేవాలయం ఆల్బం అప్లోడ్ చేస్తున్నారు అనుకుంటే ఆ ఆలయం పూర్తి ఫోటో ఒకటి అలా అప్లోడ్ చేస్తే చాలు. ఈ ఫోటోనే ఆ ఆల్బం కి కవర్ ఫోటోగా మారుతుంది. కనుక ఆ ఫోటోనే ఆల్బం కవర్ ఫోటో Album Cover Photo అని అంటారు. ఈ ఫోటో ని కవర్ ఫోటో కాకుండా వేరే మరొకటి కూడా - మనకిష్టం ఉన్నప్పుడు మార్చుకోవచ్చును. ఒక ఆల్బం లో ఫొటోలు అప్లోడ్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించినవే అప్లోడ్ చేస్తే - ఆ ఫోటో ఆల్బం చూడటానికి బాగుంటుంది.
2. వద్ద నున్న High Quality ని నొక్కండి. అంటే ప్రక్కన ఉన్న గడిలో నొక్కితే టిక్ మార్క్ వస్తుంది. అలా చేస్తే - మీరు అప్లోడ్ చేసే ఫోటోలు మరింత నాణ్యముగా అప్లోడ్ అవుతాయి. ఆ ఫోటోల క్లారిటీ మంత బాగుండి, వీక్షకుల మదిని మరింతగా ఆకట్టుకుంటాయి. ఇలా చెయ్యడం అనేది - మీ ఫోటోగ్రఫీకి చెందినవీ, పెళ్లి, ఏదైనా ఫంక్షన్స్ ఫోటోలకి వాడితే బాగుంటుంది. ఆ ఫోటోలని చిన్నగా మామూలుగా - వాటి మీద డబల్ క్లిక్ చేసి, ఓపెన్ చేసినప్పుడు కన్నా, ఆ ఫోటో మూలన ఉన్న డబల్ ఆరో Double arrow గుర్తుని వాడి, వాటిని పెద్దగా చేసి చూస్తే - మరింత అందముగా కనిపిస్తాయి. నిజానికి ఇలా పెద్దగా చేసి, చూస్తే పెళ్లి, పర్యాటక.. ఫొటోస్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయని చాలామందికి తెలీదు. ఎవరివైనా అలా చేసి చూడండి. తేడా, ఫీల్ Feel ఏమిటో మీకే తెలుస్తుంది. ఇలా టిక్ చెయ్యటం ఆల్బం అప్లోడ్ అయ్యే ముందుగా చెయ్యాలి.
దాని క్రిందన ఉన్న Changing date నోక్కకండి. అలా చేస్తే - ఆ ఫోటో ఆల్బం తీసిన డేట్ కానీ, మరేదైనా తేదీ కానీ మార్చుకొనే వీలు ఉంటుంది. ఇలా మారిస్తే ఆ తేదీకి ఆ ఫోటో ఆల్బం పోస్ట్ చేసిన వారు అవుతారు. ఉదాహరణకి ఈరోజు పోస్ట్ చేస్తూ - అలా నొక్కి వేరే తేదీ ఎంచుకుంటే ( నవంబర్ 1 అనుకుందాం ) ఆ తేదీకి ఆ ఆల్బం మారిపోతుంది. అంటే మీ టైం లైన్లో పైన కనపడాల్సిన పోస్ట్ లోపల ఎక్కడో నవంబర్ నెల టైం లైన్ లో పోస్ట్ అవుతుంది. అది మీ ఫ్రెండ్స్, ఇతరులు మీ ఆల్బమ్స్ ఏమున్నాయా అని చూస్తే కానీ - ఆల్బం ఉన్నట్లు తెలుసుకోలేరు. అందుకే జాగ్రత్త అన్నాను.
3. ఈపాటికి ఆల్బం కవర్ ఫోటో అప్లోడ్ అయి ( అవుతూ ) ఉంటుంది. అప్పుడే మిగిలిన ఫొటోస్ అప్లోడ్ చెయ్యటానికి 3 వద్దనున్న Add More Photos అనే టూల్ ని నొక్కండి. ఇప్పుడు ఆ అప్లోడ్ చెయ్యాల్సిన ఆల్బం తెరచుకొని, అందులోని మిగిలిన ఫొటోస్ ని ఎంచుకొని, ఓకే చేస్తే - ఆ ఫొటోస్ ఒకదాని వెనక మరొకటి అప్లోడ్ అవుతూ ఉంటాయి. అప్లోడ్ అవుతున్న ఫొటోస్ అన్నీ ఒక్కొక్కటిగా ఎంతవరకు అప్లోడ్ అయ్యాయో నీలిరంగులో ఉన్న ప్రాసెస్ లైన్ వల్ల తేలికగా తెలుసుకోవచ్చు. ఇలా అప్లోడ్ అవుతున్న సమయాన మిగతా సెట్టింగ్స్ పెట్టేసుకోండి. ఇలా అప్లోడ్ చెయ్యటానికి ముందుగా మీ డాటా ప్లాన్ ని చెక్ చేసుకోండి. 6 మెగా పిక్సెల్ డిజిటల్ కేమరాతో ఫొటోస్ అయితే ఒక్కొక్కటీ ( సెట్టింగ్స్ బట్టి ) మామూలుగా 3.0 నుండి 5.5 MB సైజులో ఉంటాయి. ఎడిట్ చేస్తే మరింతగా పెరగవచ్చును. ( ఇలా చేసిన ఒక ఫోటో ఈమధ్యే చూశాను - అది 70 MB సైజులో ఉంది. నిజం. నేనే నమ్మలేక పోయాను ) ఇప్పుడు వస్తున్నవి 16, 20 మెగా పిక్సెల్స్ లలో వస్తున్నవి. వీటి వల్ల తీసే ఫొటోస్ - ఇంకా పెద్ద సైజు రెజల్యూషన్ ల్లో ఉంటాయి. డాటా, అప్లోడ్ సమయాన్నీ, మీ సమయాన్ని, డబ్బునీ ఇవి బాగా తినేస్తాయి. ఇలా కాకుండా ఉండటానికి మరో పద్ధతి ఉంది. ఫోటో సైజుని ( రెజల్యూషన్ ని ) బాగా తగ్గించాలి. ఇది ఎలా చెయ్యాలో మరో టపాలో నేర్చుకుందాం..
4. Order by date taken అనేది - ఆ ఆల్బం లోకి చాలా రోజుల నుండి తీసిన ఫొటోస్ అప్లోడ్ చేస్తున్నట్లయితే ( లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పటి ఫొటోస్ లాంటివి ) ఇది వాడితే - ఆ ఫోటో తీసిన సమయాన్ని బట్టి లేదా ఫోటో క్రమసంఖ్య వల్లనే గానీ వరుసగా అప్లోడ్ అవుతాయి.
5. వద్ద నున్న Untitled Album వద్ద - ఆ ఆల్బం కి తగిన పేరు పెట్టాలి. ( టైప్ చెయ్యాలి ) అలా చేస్తే ఆ ఆల్బం ఫలానా దానికి చెందినదని తేలికగా తెలుసుకోవచ్చు. ఫలానా ఆల్బంలో అని చెప్పటానికి తేలికగా ఉంటుంది. ఇది ఇంగ్లీష్ లో ఉంటే బాగుంటుంది.
6. ఇక్కడ మీకు Say something about this album అని కనిపిస్తుంది. అక్కడ నొక్కితే - ఆ అక్షరాలూ మాయమైపోయి, వ్రాయటానికి ఒక బాక్స్ లా మారిపోతుంది. అందులో ఆ ఫోటో ఆల్బం ఫోటోల సందర్భం, సమయం, ఎక్కడ జరిగినదీ.. ఇలాంటి విషయాలన్నీ క్లుప్తముగా వ్రాయాలి. ఆ ఆల్బం తాలూకు ఒక Info సమాచారం మాదిరిగా ఉంటుంది.
7. ఇక్కడ మీకు మరో ఆప్షన్ - Where were these taken అని కనిపిస్తుంది. అందులో ఆ ఫొటోస్ ని ఎక్కడ తీశారో, ఆ ప్రదేశం పేరుని టైపు చేస్తే డ్రాప్ మెనూలో ఆ ప్రదేశం పేరులా ఉన్నవి వస్తాయి. అందులోంచి సరియైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఇలా ఎన్నుకొన్న ప్రదేశం పేరు - ప్రతి ఫోటోకి - ఫోటో డిస్క్రిప్షణ్ గా Photo description అటాచ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక్కదగ్గర వ్రాస్తే చాలు.. ప్రతి ఫోటోకీ అలా తీసిన ప్రదేశం వ్రాయాల్సిన అవసరం ఉండదు.. ఏ ఒక్క ఫోటో ఓపెన్ చేసినా ఆ ఫోటో వివరణలో ఆ ప్రదేశం పేరు కనిపిస్తుంది.
8. ఇక్కడ కనిపిస్తున్న Public వద్ద నున్న త్రికోణాన్ని నొక్కితే డ్రాప్ మెనూ వస్తుంది. అందులో ఇలా ఉంటాయి.
Public, Friends, Only Me, Custom తో బాటు Close Friends, Hyderabad Area అని కనిపిస్తాయి.
Public అనేది ఫేస్ బుక్ లోని అందరూ ఆ ఫొటోస్ ని చూడటానికి వీలు కల్పించడం అన్నమాట.
Friends అన్నది - మీకు అక్కడ స్నేహితులుగా ఉన్నవారే చూడటానికి అర్హులుగా చెయ్యడం. అంటే మీ ప్రొఫైల్ లోని స్నేహితులు మాత్రమే ఆ ఫొటోస్ చూడగలరు.
Only Me అనేది ఎన్నుకుంటే ఆ ఆల్బం ని మీరు మాత్రమే - మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి, చూడగలరు అన్నమాట.
Custom అంటే ఎవరినైన ప్రత్యేకముగా -ఎన్నుకున్న కొద్దిమంది స్నేహితులకూ, కొంతమంది ఫేస్ బుక్ లో లేని వారికి ఈమెయిల్ అడ్రెస్ వల్ల గానీ ఈ సెట్టింగ్ వల్ల వారికి మాత్రమే ఆ ఫోటో ఆల్బం చూపించగలం. ఇలా ప్రత్యేకమైనవీ, పర్సనల్ వీ, సున్నితమైన ఫొటోస్ నీ దగ్గరి వారికి చూపించుకోవచ్చు. ఇలా ఒక ఆప్షన్ ఉందని చాలామందికి తెలీదు. అది తెలీక ఫొటోస్ ని బహిరంగముగా అప్లోడ్ చేస్తుంటారు.
ఇవే కాకుండా ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్లోజ్ ఫ్రెండ్స్ Close friends అనే ఆప్షన్ ఎంచుకుంటే - ఫేస్ బుక్ లో మనం ఎంచుకున్న దగ్గరి స్నేహితులు ఈ ఫోటో ఆల్బం చూడటానికి అర్హత లభిస్తుంది.
ఇక ఉంటున్న ప్రదేశం బట్టి కూడా - ఆ ప్రదేశం లోని వారు మాత్రమే చూడగలిగేటట్లు చేసుకోవచ్చును. అంటే హైదరాబాద్ అని ఎంచుకుంటే - ప్రొఫైల్ లో హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్న వారు మాత్రమే చూస్తారన్న మాట. ఇది వాడకం తక్కువ.
9. ఇక ఆఖరున మిగిలింది Post అన్నది. దీన్ని నొక్కితే ఆల్బం అప్లోడ్ అయ్యాక - ఆ ఆల్బం ఎంచుకున్న సెట్టింగ్స్ లతో మన టైం లైన్ మీద ప్రత్యక్షమవుతుంది.
ఇలా ఈ విధమైన సెట్టింగ్స్ పెట్టుకుంటే మన ఫోటో ఆల్బం, అందులోని ఫోటోలు ఎవరు చూడాలో వారే చూస్తారు. దాని వలన మనకూ హాయిగా ఉంటుంది. నిజానికి ఇంత ఆలోచన అందరికీ ఉండదు... ముఖ్యముగా మహిళలకి. ఈ పోస్ట్ లోని జాగ్రత్తలన్నీ వారికి ఉపయోగపడాలనే వ్రాయటం జరిగింది.
No comments:
Post a Comment