ఒకరకముగా చెప్పాలంటే ఓటమి కూడా గెలుపే! ఎందుకంటే ఆ ఓటమి మన ప్రయత్నములో ఏదో లోటు ఉందని తెలియచేస్తుంది.
అవును. ఓటమి ఒకరకముగా గెలుపే.. ఏమీ ప్రయత్నించక ఊరికే అలా కూర్చునే బదులు ఏదైనా చిన్న ప్రయత్నమైనా చేసి, అందులో ఓటమి పొందినా గొప్ప గెలుపుగా తీసుకోవాలి. మన ప్రయత్నములో ఎక్కడో ఏదో లోపం ఉంది.. కనుకనే మనం ఆ పనిలో విజయం సాధించలేదు - అని అనుకోవాలి. అలా అనుకొని ఉండిపోవటం కన్నా ఎక్కడ, ఏమి లోపం చేశామో గుణనాత్మకమైన విశ్లేషణ చేసుకోవాలి. ఒక్కో పొరనీ తరచి తరచి చూస్తూ, లోపం ఎక్కడ ఉందో కనిపెట్టితే - సగం విజం సాధించినట్లే. అంతే కానీ ఓటమి పొందాం అని దిగులుగా కూర్చుండబోతే - ఇక మన ఎదుగుదలని మనమే అక్కడితో ఆపేసుకున్న వారిమి అవుతాము.
ఇలా ఓటమిని చూసిన విషయాలు చాలానే ఉన్నాయి. అక్కడితో ఆ ప్రయత్నాలు ఆపేసేవాడిని. ఎప్పుడైతే ఆ పనులలో ఎక్కడ లోపం చేశానో సరియైన విశ్లేషణ చేసుకో సాగానో, అప్పటి నుండి అనేకానేక పనులలో విజయం సాధిస్తున్నాను. ఒక ఉదాహరణగా చెప్పాలీ అంటే - ఎప్పుడో పోస్ట్ చేసిన నా అనుభవాన్ని ( మళ్ళీ ఒకసారి ) చదవండి. మీకే తెలుస్తుంది. లింక్ : http://achampetraj.blogspot.in/2013/04/blog-post.html
No comments:
Post a Comment