ఓటమి అనేది నీ కృషిలో కొద్దిపాటి లోపం.
హా.. అవునండీ అవును..!! మనం ఏదైనా ప్రయత్నం చేసి, ఓటమి పాలు అయ్యామూ అంటే దాదాపు గెలిచాం అన్నమాటే. అస్సలు ఏమీ చెయ్యకుండా, కూర్చొని, నా తలరాత ఇంతే, నా బ్రతుకు ఇలాగే, వాడికి అదృష్టం బాగుంది... ఇలా అనుకుంటూ కాలయాపన చేసే వారికన్నా మనం ఎన్నో రెట్లు నయమని చెప్పుకోవాలి. జీవిత ప్రయాణములో ఎదురయ్యే అవాంతరాలని ఎలా ఎదురుకుంటామో, ఏమి చేస్తే వాటిని తేలికగా అధిగమిస్తామో తెలుసుకోవడం చాలా కష్టం. మొదటి ప్రయత్నం లోనే విషయం సాధించడం అంటే అదృష్టమనే చెప్పుకోవాలి. ఒక్కోసారి ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఓటమి పాలు అవుతాం. అలా వచ్చిన ఓటమి - మనకి ఎన్నెన్నో విషయాలని తెలియచేస్తుంది. అందునా - ఏమి చేస్తే గెలవగలమో చక్కగా అర్థమయ్యేలా చేస్తుంది. కానీ అందరూ ఇలా ఆలోచించక నిరాశా, నిస్పృహలకు లోనవుతారు. అక్కడే వారందరూ చేసే పెద్ద తప్పు.. అలా ఎన్నడూ కృంగి పోకూడదు. మనం విని బాధ పదాలని వచ్చే వెక్కిరింతలను - ప్రేరణగా మలచుకోవాలి.
మీరు నమ్ముతారో లేదో కానీ, అమెరికన్ స్విమ్మర్ - పోటీలకు సిద్ధమవుతూ, తన గదిలో తన సమీప ప్రత్యర్థి చిరునవ్వు చిందిస్తున్న నిలువెత్తు ఫోటోని ఉంచుతాడు. ఆ నవ్వు - తనలో మరింత కసిని రగిలించటానికి అలా ఏర్పాటు చేసుకున్నాడు. అలా పోటీలకు సిద్ధమై, చాలా సార్లు ఎన్నెన్నో బంగారు పతకాలను గెలుచుకున్నాడు.
No comments:
Post a Comment