Friday, March 1, 2013

ఐన్ స్టీన్ తెలుగులో అన్నాడా?

ఒక్కోసారి కొందరు తమ దూకుడు తనముతో ఏదేదో కామెంట్స్ పెడుతుంటారు. మనం సరిగ్గా కౌంటర్ జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన సంఘటన మొన్నే నాకు కలిగింది. ఆ అనుభవం ఇప్పుడు మీతో పంచుకుంటాను. 


నేను చేసిన ఈ కార్డ్స్ లో ఒకటి ఐన్ స్టీన్ వ్రాసిన కొటేషన్ కూడా ఒకటి ఉంది. ఆ కొటేషన్ ని నా ఆల్బమ్ లో పోస్ట్ చేసుకున్నాను. సాధారణముగా ఆ పోస్ట్స్ అన్నీ అందరికీ కనిపించేలా " పబ్లిక్ " అనే ఆప్షన్ లో పెట్టేస్తాను. ఆ కొటేషన్ మనవాళ్ళకి అర్థమయ్యేలా ఉండేందుకై తెలుగులో వ్రాశాను. ప్రతిదాంట్లో లోపాలని వెదికే ఒక పాఠకుడు ఆ పోస్ట్ ని చూడగానే తనలోని విశ్లేషకుడుకి ఒక మంచి అవకాశం వచ్చిందని ఉప్పొంగిపోయినట్లున్నాడు. వెంటనే ఒక కామెంట్ పెట్టాడు. " ఐన్ స్టీన్ అలా తెలుగులో చెప్పాడా?.." అనీ. 

నిజానికి అలాంటి తుంటరి ప్రేలాపనలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకక్షణం స్థిమితముగా ఉండి, ఆలోచించాను. సమాధానం దొరికింది. వెంటనే అమలులో పెట్టేశాను. 

ఆ కొటేషన్ ని ఇంగ్లీష్ లోకి మార్చాను. అలా మార్చగా - The difference between genius and stupidity is that genius has its limits అని వస్తుంది. ( మేధావికి, మూర్ఖత్వం కి మధ్య తేడా ఏమిటంటే - మేధావితనం కి పరిమితి / హద్దులు ఉంటుంది ) యూదుల భాష హిబ్రూ కాబట్టి, దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ లో పేస్ట్ చేసి, హిబ్రూ భాషలోకి మార్చాను. అప్పుడు ఇలా వచ్చింది. 

      అలా వచ్చినదాన్ని కాపీ, చేసి కామెంట్ బాక్స్ లో పేస్టు చేసి, సమాధానం చెప్పాను. ఐన్ స్టీన్ ఇలా ההבדל בין הגאונות לטיפשות הוא שגאונות יש גבולות. అన్నారు. ఇప్పుడు మీరు - ఆయన యే భాషలో ఆ మాట అన్నారో, ఆ భాషలోనే ఆ కొటేషన్ ని మీరు చదువుకోవచ్చును అని చెప్పాను. ఆ సమాధానం ఆ కామెంట్ పెట్టినతను చూసి ఉండొచ్చును. చూడక ఏమి చేస్తాడు.. తనే గొప్ప కామెంట్ పెట్టాను అనుకున్నవాడు విజయగర్వముతో - తాను పెట్టిన కామెంట్ కి జవాబు వచ్చిందా లేదా అని తప్పక చూస్తాడు. ఇంగ్లీష్ యే సరిగా వ్రాయరానివాడికి ఇక ఆ హిబ్రూ భాష ఏమి అర్థం అవుతుంది? మళ్ళీ ఇక కామెంట్ లేదు.. బాగా పంచ్ పడ్డట్లుంది. బహుశా ఇక ఎప్పుడూ అలా కామెంట్ చెయ్యకపోవచ్చును. 

Related Posts with Thumbnails