అన్నింటికన్నా ముందు నిన్ను నువ్వు గౌరవించుకో..
అవును.. మనలని మనమే గౌరవించుకోకపోతే - ఇంకెవరు మనకి విలువనిస్తారు? నేనో వెధవని, మూర్ఖుడిని, జఫ్ఫా.. అంటూ ఇతరుల ముందు అంటూ ఉంటే ఇక ఎదుటివారిలో మనపట్ల సదభిప్రాయం ఇక ఏమి ఉంటుంది? ఇక అప్పుడు వారూ మనల్ని మూర్ఖుడు, వెధవా అని పేర్లు పెట్టి పిలుస్తూ, నలుగురిలో పలుచన చేస్తుంటారు. ఈ మన ఆత్మ గౌరవాన్ని మన అనుమతి లేకుండా ఎవరూ మన విలువ తగ్గించలేరు. ఒకవేళ తగ్గించాలని చేసినా అది తాత్కాలికమే..
No comments:
Post a Comment