అన్నిటినీ అర్థం చేసుకోవడమే జీవితం.
జీవితం అన్నాక కష్టాలూ, సంతోషాలు అన్నీ ఉంటాయి. అవన్నీ జీవితములో ఒక భాగం. కష్టాలూ, కన్నీళ్ళు, బాధలు, సమస్యలూ, అడ్డంకులూ, అవరోధాలూ, ఇబ్బందులూ.... ఉన్నట్లే, సంతోషాలు, మధురాతిమధుర క్షణాలు, ఆనందకరమైన సన్నివేశాలు, మైమరచిపోయే అనుభూతులు, అందమైన జ్ఞాపకాలు... ఇలా అన్నీ ఉంటాయి. ఇవేకాక నిత్యజీవితములో ఎదురయ్యే వారినీ, వారి చేష్టలనీ, భావాలనీ, మనస్తత్వాలనీ అన్నీ అర్థం చేసుకోవాలి.. మనకి ముందు కనిపించేవాటి కన్నా వెనకాల సత్యాలనీ అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్ననాడు జీవితం సాఫీగా, సంతోషముగా, తక్కువ వత్తిడితో సాగిపోతుంది.
No comments:
Post a Comment