మీరు తలంటు స్నానం చెయ్యటానికి, షాంపూ ప్యాకెట్స్ వాడేవాళ్ళు అయితే ఈ క్రింది సూచనని ఫాలో అయిపోండి. సాధారణముగా ఈ షాంపూ సాచెట్స్ తో తలంటు కుంటున్నప్పుడు కాసింత షాంపూ వంపుకున్నాక, ఆ మిగిలిన సాచెట్ ని ఎక్కడ పెట్టాలో కాసింత ఇబ్బందిగా ఉంటుంది. ఆ ఇబ్బందిని ఇలా తొలగించుకోవచ్చును. చూడటానికి ఫన్నీగా అనిపించినా, ఒక ఉపయోగకర విషయం ఇది.
షాంపూ బాటిల్ కన్నా షాంపూ సాచేట్స్ ని వాడితే చాలా డబ్బు పొదుపు అవుతుంది. కారణం - డబ్బా ప్యాకింగ్ మీద ఉన్న పన్నులు. ఈ సాచెట్స్ వాడితే, షాంపూ వాడకం కూడా హద్దుల్లో ఉంటుంది అనుకొని, వాడకం కూడా ఎక్కువే.
ఈ సాచెట్స్ వాడి, మళ్ళీ అందుకోవటానికి వీలుగా ఎలా చెయ్యాలో చూద్దాం!
ముందుగా మీరొక బట్టలు ఆరేసేందుకు వాడే ఒక క్లిప్ ని తీసుకోండి. ఇది ఫ్లాట్ గా, సమతలముగా ఉండేది తీసుకోవాలి. కొద్దిగా డబల్ సైడ్ గమ్ ఉండే స్టికర్ తీసుకొని దీనికి ఒక వైపు అతికించి, సర్రిగ్గా ఉండునట్లు కత్తిరించాలి. ఆ తరవాత ఇంకో వైపున గమ్ పైన ఉన్న స్టికర్ రిలీజింగ్ పేపర్ తీసేయ్యాలి.
లేదా ఏదైనా సిలికాన్ జెల్ వల్ల గానీ, ఫేవీ క్విక్ తో గానీ అలా అతికించవచ్చును.
ఇప్పుడు మీ బాత్ రూం లో మీరు స్నానం చేసే వద్ద సిరామిక్ టైల్ మీద, ముందుగా ఆ టైల్ ని బట్టతో బాగా శుభ్రం చేసి, అతకాలి. ఇప్పుడు మీకో హెల్పింగ్ హాండ్ వచ్చినట్లే.
స్నానం మధ్యలో సాచెట్ ని ఇలా ఆ క్లిప్ కే పెట్టి ఉంచొచ్చును. చిన్న పనివల్ల మీ కార్యక్రమం క్రొత్తగా కనిపిస్తుంది.

No comments:
Post a Comment