నిజమే! మొదట్లో ఈ భావన చప్పున అర్థం కాదు.. కానీ ఆలోచించిన కొద్దీ బాగా అర్థమవుతుంది. ఇంకా స్పష్టముగా చెప్పాలీ అంటే - ఒకసారి మన జీవితాన దుర్భర పరిస్థితులని అనుభవించాల్సిన సమయం వచ్చినప్పుడు, మనకు ఏమీ, ఏవీ, ఎవరూ సహకరించకపోయినప్పుడు - ఆ పరిస్థితులు బాగా మదిలో నాటుకపోయి.. ఆతరవాత మన పరిస్థితులు బాగు అయ్యాక - అప్పటి పరిస్థితులు గుర్తుకు వచ్చినప్పుడు.. ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసుకున్నప్పుడు - ఎంతో హాయిగా, ఒక మధుర భావనలుగా కనిపిస్తాయి. మనకి మన జీవితాన చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, ఏమాత్రం అధైర్యపడక - ఇవి కేవలం కొద్దిరోజులే అని ధైర్యముగా ఉండండి. అలాగే ఆ పరిస్థితులు మీకు మీ జీవన గమనములో ఎలా ఉండాలో తెలియచేసే పాఠాలని బాగా గుర్తుపెట్టుకోండి.
నిజానికి ఈ దుర్భర పరిస్థితులు అంటూ కనీసం ఒక్కసారైనా రావాలి కూడా. అప్పుడే మన చుట్టూ ఉంటున్నవారు ఎవరో, వారి మనస్తత్వాలు ఏమిటో, ఎవరు మనవారు, ఎవరు పరాయివారు అనీ, నిజమైన శ్రేయోభిలాషులు ఎవరో, మనలోని లోపాలు ఏమిటో, మన బలహీనతలు ఏమిటో.. లాంటి సవాలక్ష నిజాలు ఈ దుర్భర పరిస్థితులు మనకి ఐమాక్స్ 3D సినిమా చూసినట్లుగా, చూపిస్తాయి. వాటి నుండి పాఠాలు నేర్చుకొని, భవిష్యత్తులో బాగుపడాలని ప్రయత్నించేవాడు ఉత్తముడు.
No comments:
Post a Comment