Tuesday, October 23, 2012

శమీ చెట్టు


శమీ చెట్టు.. మామూలురోజుల్లో ఈ చెట్టును అంతగా పట్టించుకోకున్నా దసరా రోజున మాత్రం, తప్పక దర్శించి, మోకరిల్లే చెట్టు ఇది. ఆకులు చింతచెట్టు ఆకులుగా ఉంటాయి. దూరాన నుండి చెట్టు కూడా అలాగే అనిపిస్తుంది. కాకపోతే చెట్టు కొమ్మలకి గులాబీ చెట్టుకి ఉండే వంపు తిరిగిన ముళ్ళు ఈ చెట్టుకీ ఉంటాయి. 

దీనినే ఆ రోజున ఎందుకు చూడాలని అంటే - మహాభారతం లో పాండవులు మాయాజూదములో కౌరవులతో ఓడిపోయి, పందెం ప్రకారం - పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాత వాసం చేస్తారు. ఆ అజ్ఞాత వాసములో తమ ఆయుధాలని విసర్జించి (వదిలి) తమని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలి. ఎవరైనా వారిని ఆ కాలములో గుర్తుపట్టితే, మళ్ళీ పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం, ఒక యేడు అజ్ఞాతవాసం మళ్ళీ చెయ్యక తప్పదు. 

అందుకే ఆ అజ్ఞాతవాసాన - పాండవులు తమ ఆయుధాలని, మూటగట్టి ఈ శమీ చెట్టుమీద దాస్తారు. అలా వారి ఆయుధాలని దాచిన కారణాన - ఈ చెట్టుకి దైవత్వం అపాదించబడినది. 

దసరా రోజున ఈ చెట్టు చుట్టూ అక్షతలు తీసుకొని, ప్రదక్షిణ చేస్తూ - " శమీ శమయతే పాపం, శమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం.." అని మననం చేసుకుంటూ.. అక్షతలు తలపై చల్లుకోవాలి. 

అందరికీ దసరా శుభాకాంక్షలు. 


No comments:

Related Posts with Thumbnails