క్రొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకున్నాను. మంచిరోజు, ముహూర్తం చూసి ఆ ఫోన్ వాడటం మొదలెట్టాను. అంతా సంతోషం.. ఉంటే ఈ పోస్ట్ వ్రాసేవాడినే కాదు. అలా వాడటం మొదలెట్టానా? అంతా బాగుంది.. కానీ ఒక చిన్న పొరబాటు వల్ల కూసింత టెన్షన్. ఆ పొరబాటు కొంత నాదీ, ఆపరేటర్ దీ ఇంకొంత.
ఆ ఫోన్ లో రెండు సిమ్ములు వేయాలి. ఆ రెండు సిమ్ములూ వేసి ఆ యూనిట్ ని ఆన్ చేశాను. ఆ సిమ్ము లలో ఒకటి - ప్రైవేట్ కంపనీ సిమ్. రెండోది ప్రభుత్వరంగ సంస్థది. అలా ఆన్ చేశానో లేదో, ఈ ప్రైవేట్ కంపనీ సిమ్ దానంతట అదే నెట్ వాడుకొని సెట్టింగ్స్ ని డౌన్లోడ్ చేసుకొని, ఇన్స్టాల్ చేసుకుంది. నాకు ఇంకో సిమ్ నుండి సెట్టింగ్స్ కావాలి. నేను వాడాలనుకున్నదీ ఆ సిమ్ నెట్ వర్క్ నే!
ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ ఎన్నిసార్లు డిలీట్ చేసినా పోవటం లేదు. ఈ మొదటి సిమ్ సెట్టింగ్స్ ని ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసినా లాభం లేదు. ఈ మొదటి సిమ్ నుండి నెట్ వాడుకోవాలని నా ఆలోచన. కారణం : ఆ మొదటి సిమ్ములో బ్యాలన్స్ Rs. 4,400 ఉన్నాయి. మూడు సంవత్సరాల క్రిందట ఆ బ్యాలన్స్ Rs. 9,450 గా ఉంది. అంతగా ఉండటానికి గల కారణం - సంవత్సరానికి కొన్నిసార్లు ఆఫర్స్ ఉంటాయి. అప్పుడు మనం వేసుకున్న అమౌంట్ కి కొంత అదనముగా బ్యాలన్స్ వస్తుంది. సంవత్సర కాలానికి ఒకేసారి అలా బ్యాలన్స్ వేసుకుంటే - చాలా ఎక్కువగా లాభం ఉంటుంది. అందుకే నా మొబైల్ బ్యాలన్స్ అలా తొమ్మిది వేలు చిల్లరగా మిగిలిపోయింది. ఈ మూడు సంవత్సరాలుగా ఆ బ్యాలన్స్ ని ఎస్పైరీ డేట్ పొడిగించుకుంటూ వాడుతున్నాను. ఆ మొత్తాన్ని తగ్గించాలని నా ఆలోచన.
ఈ మధ్యలో రెండుసార్లు నా మొబైల్ పోయినా, బ్యాలన్స్ ఫార్వర్డ్ అయ్యింది. ఈ బ్యాలన్స్ చూసి, అందరూ నా ఫోన్ వాడి, ఉన్న బ్యాలన్స్ తగ్గిస్తున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని, ఇప్పుడు నేనే బ్యాలన్స్ తగ్గిద్దామని డిసైడ్ అయ్యాను.
ఇక అసలు కథలోకి వద్దాం. ఆ రెండో సిమ్ సెట్టింగ్స్ డిలీట్ అవక, మాటిమాటికీ ఆ సెట్టింగ్స్ అడిగి.. కష్టమర్ కేర్ వారితో కూడా విసిగిచ్చుకున్నాను. పాపం.! :(
పోనీ ఫార్మాట్ చేద్దామని అనుకున్నా (ఇదే చెయ్యాలి కానీ రెండో దారి ఏదైనా ఉందా అని ఆగాను) కష్టపడి అందులో ఫీడ్ చేసిన డాటా అంతా పోతుంది. ఆ ఇబ్బంది వల్లనే ఆగాను. నాకు తెలిసిన అన్ని దారులలో ప్రయత్నించినా ఇక ఏ దారీ కనిపించలేదు. ఇక ఫార్మాట్ చేయడానికి రెడీ అయ్యాను.
ముందుగా ఫోన్ లోని నంబర్స్ అన్నీ మెమొరీ కార్డ్ లోకి కాపీ చేశాను. ఆ తర్వాత ఆ మెమొరీ కార్డ్, రెండు సిమ్ములనీ తీసేసి, ఆ ఫోన్ కంపనీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ కోడ్ వాడి, ఫార్మాట్ చేశాను. ఓకే అయ్యింది. ఆ తరవాత ఒక సిమ్ , మెమొరీ కార్డ్ పెట్టేసి, మళ్ళీ యధావిధిగా అన్నీ సిద్ధం చేసుకొని, వాడుతున్నాను.
ఇందులో నేను గమనించిన విషయాలు ఏమిటంటే :
1. మీరు ఏ సిమ్ము నుండి మీ ఫోన్లో మీరు ఆన్లైన్ కి వెళ్దామని అనుకుంటున్నారో - ఆ సిమ్ ని మొదటగా 1 వ సిమ్ స్లాట్ లో పెట్టేసి, GPRS సెట్టింగ్స్ (వెంటనే రాకుంటే కష్టమర్ కేర్ వాళ్ళని అడిగి) మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి.
2. ఆ తరవాతనే రెండో సిమ్ వేసుకోవాలి.
3. ఒకవేళ రెండో సిమ్ లోని GPRS సెట్టింగ్స్ మీ మొబైల్ లో ఇన్స్టాల్ అయితే, డాటాని మెమొరీ కార్డ్ లోకి బదిలీ చేశాక, ఆ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసి, ఆ సిమ్ములూ, మెమొరీ కార్డ్ తీసేసి, (మళ్ళీ బ్యాటరీ పెట్టి) అ ఫోన్ కంపనీ రిస్టోర్ సెట్టింగ్స్ వాడి, మీరు కొన్నప్పుడు ఎలా ఆ ఫోన్ ఉంటుందో అలా చేసుకోవాలి.
4. ఆ తరవాత ఆ సిమ్ డాటా, మెమొరీ కార్డ్ లోని డాటా ఆ ఫోన్ లోకి కాపీ చేసుకోవాలి.
5. సిమ్ లోని నంబర్స్ అన్నీ ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకోవాలి. (సిమ్ మెమొరీ, ఫోన్ మెమొరీ, మెమొరీ కార్డ్ మెమొరీ ఈ మూడు వేరు వేరు అని గుర్తుపెట్టుకోవాలి)
6. సిమ్ లలోని నంబర్స్ ని ఫోన్ మెమొరీ లోకి కాపీ చేసుకున్నాక - మీరు మీ ఫోన్ లోని కాంటాక్ట్స్ ని తెరచి చూస్తే, ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ మాత్రమే కనిపించేలా సెట్టింగ్స్ పెట్టుకోవాలి.
7. ఇలా ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కనిపించేలా పెట్టేసుకొని, వాటిని ఒక్కొక్కటీ నంబర్ ని ఎడిట్ చేసుకోవాలి. వారి గురించిన డాటా కూడా అక్కడే పెట్టేసుకోవచ్చును. వారి డిజిటల్ ఫోటోని వారి కాంటాక్ట్ కి పెట్టేసుకుంటే, వారు ఫోన్ చేసినప్పుడు వారి ఫోటో, పేరూ కనిపించి, తేలికగా వారిని గుర్తుపడతాము. ఇలా కేవలం ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి మాత్రమే చేయవచ్చును. సిమ్ లోని నంబర్స్ కి ఇలా చెయ్యరాదు.
8. అలాగే ఫోన్ మెమొరీ లోని కాంటాక్ట్స్ కి వారు కాల్ చేసినప్పుడు, వచ్చే రింగ్ టోన్ కి ప్రత్యేకమైన రింగ్ టోన్ ఇస్తే, వారు కాల్ చేసినప్పుడు వచ్చే రింగ్ టోన్ బట్టి, ఆ కాల్ ఎవరిదో దూరం నుండే విని గుర్తు పట్టవచ్చు.
9. మొబైల్ కంపనీ వారు కూడా రెండు సిమ్ముల నుండి ఇలా ఆన్ లైన్ వాడుకునేలా చేస్తే మరీ బాగుండేది. నా ఫోన్ కి ఒక సిమ్ నుండి మాత్రమే ఆన్లైన్ లోకి వచ్చేలా ఉంది. ప్యాకెట్ డాటా కనెక్షన్ కేవలం ఒక సిమ్ కి మాత్రమే పనిచేస్తుంది.
10. మీ ఫోన్ బుక్ లోని కాంటాక్ట్స్ ని వేరొక మెమొరీ కార్డ్ (1GB, 2GB సైజు మెమొరీ కార్డ్స్ ఇప్పుడు చాలా చవక) లోకి కాపీ చేసుకోండి. ప్రతినెల మొదటి తారీకున అలా మీ స్మార్ట్ ఫోన్ నుండి అలా కాపీ చేసుకుంటే - డాటా కోల్పోరు.

No comments:
Post a Comment