అవును కదూ.. ఆ చిన్నప్పటి రోజులు తిరిగి వస్తే - ఎంతో బాగుండును కదూ.. దేవుడు ప్రత్యక్షమై - మీకు మీ బాల్యాన్ని తిరిగి ఇస్తున్నాను.. ఇక హాయిగా అనుభవించండి అని మనకో వరం గానీ ఇస్తే, మీరేమిటో గానీ నేను మాత్రం ఒక్క క్షణం కూడా వృధా చెయ్యకుండా విచ్చలవిడిగా వాడుకుంటాను.
ఆరోజులే వేరు.. ఆ మధుర క్షణాలు మరుపురానివి. ఆస్థి, అంతస్థు, ఆడామగా, ఎక్కువా తక్కువ.. మొదలగు తారతమ్యాలు అంటూ ఏమీ కల్మషాలు పెట్టుకోకుండా, ఇప్పటిలా ప్లాస్టిక్ నవ్వులు కాకుండా, స్వచ్చమైన నవ్వులు నవ్వుతూ ఉండే ఆరోజులే వేరు. చిలిపి పనులు, గిల్లికజ్జాలూ, వెటకారాలు, నేస్తం కి ఏదైనా లేకుంటే - ముందే గమనించి అది అందివ్వటం.. చనువుగా ఒరేయ్ అనే పిలుపులూ, పిచ్చిపిచ్చి ప్రయోగాలూ చేస్తూ, ఏదైనా అర్థం కాకుంటే ప్రక్కవాడి నోట్స్ చూస్తూ పని వెల్లదీయటం, ఫ్రెండ్ ఏదైనా తెచ్చేసుకుంటే ఇద్దరు ఉంటే కాకేంగిలి (కాకి+ఎంగిలి) చెయ్యటం, నలుగురు ఉంటే చిన్న బండతో నాలుగు ముక్కలు చెయ్యటం, వచ్చిన చిన్న ముక్కలే అద్భుతమైన రుచితో ఉన్నట్లు తినేయ్యటం.. ఓహ్! అపూర్వం.. ఆరోజుల గురించి ఎంత చెప్పినా తక్కువే!
2 comments:
మంచి కోరిక. సగం మంది ఇలాగే కోరుకుంటారు!! ;)
అవును కదూ..
Post a Comment