Friday, October 12, 2012

బ్లాగ్ లో టపాలు మిస్ అయితే?

ప్రశ్న : నా బ్లాగ్ లో టపాలు మిస్ అయ్యాయి. కారణం ఏమిటీ? అవి మళ్ళీ కనిపించాలీ అంటే ఏమి చెయ్యాలి.? 

జవాబు : మీ బ్లాగ్ లో మిస్సయిన టపాలు - టెక్స్ట్ రూపకములో ఉన్నవియా? లేక ఇమేజెస్ రూపకముగా ఉన్నవియో మీరు తెలియచేయలేదు. 

అన్ని పోస్ట్స్ ఒకేసారి డిలీట్ అవటం నమ్మశక్యం కానిదే!.. అయిననూ కొన్నిసార్లు అలా కనిపించకపోవటానికి ఆస్కారం ఉంది. 

నాకు  తెలిసీ - అలా మీ టపాలు పోవటానికి ఈ దిగువ కారణాల్లో ఏదైనా ఉండవచ్చును. ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నేను విన్నవీ, కన్నవీనూ.. 

మీరు అప్లోడ్ చేసిన టపాలు ఇమేజెస్ అయితే మీ బ్లాగ్ హోం పేజీలో - మీరు క్రొత్త పోస్ట్ వేస్తున్నప్పుడు, ఆ బ్లాగ్ ఫోటో ఆల్బం లోని ఫొటోస్  లేదా  ఆల్బం ని (తెలీక) డిలీట్ చేసి, ఉండొచ్చును. అలా చేస్తే మీ బ్లాగ్ పోస్ట్ లలో ఫొటోస్ కనిపించవు.ఇదే కారణం అయితే - మీరు మీ బ్లాగ్ లో క్రొత్తగా ఆయా పోస్ట్ లలో ఫొటోస్ అప్లోడ్ చేసుకోవాలి. (ఇలా బ్లాగ్ స్పాట్ పోస్ట్ లలో సాధ్యం. వర్డ్ ప్రెస్ సంగతి తెలీదు) 

మీరు సిస్టం ఆన్ చేసి, ప్రక్కకి వెళ్ళిన తరుణములో - ఎవరైనా మీ బ్లాగ్ ఓపెన్ చేసి, మీ పోస్ట్స్ డిలీట్ చేసి ఉండాలి. ( మొన్నటికి మొన్న ఒక క్రికెటర్ ట్విట్టర్ ఖాతాని వారి బంధువు ఓపెన్ చేసి, " ఆ టీ-20 లో మాకంటే ఒకటీ, రెండురోజుల ఆలస్యముగా పొరుగుదేశం జట్టు ఇంటికి వెళ్ళింది.." అని పోస్ట్ చేసిన చందాన ఇక్కడా అలాగే జరిగి ఉండొచ్చును అని ఊహ )

మీ పాస్ వర్డ్ హ్యాక్ అయ్యి, ఎవరైనా మీ బ్లాగ్ ని తెరచి, డిలీట్ చెయ్యోచ్చును. 

మీరు మిస్ అయ్యాయి అని చెబుతున్న పోస్ట్ లలో అభ్యంతరకరమైన విషయం ఉండి, ఎవరైనా ఫిర్యాదు చేసి ఉంటే, అలా జరగవచ్చును. 

కాపీ రైట్ ఉన్నవి మనవే అన్నట్లుగా - వేరేవారివి కాపీ చేసుకొని, అవి మన స్వంత రచనలుగా బ్లాగ్ లో పోస్ట్ చేసి ఉంటే, వచ్చిన అభ్యంతరాల విజ్ఞప్తుల మేరకి, ఆ బ్లాగ్ స్పాట్ / వర్డ్ ప్రెస్ వాళ్ళు ఆ పోస్టింగ్స్ తీసేయ్యవచ్చును. 

మరీ అరుదుగా సర్వర్ ప్రాబ్లెం కూడా అయి ఉండవచ్చును. 

పైవేవీ కాకుండా ఉన్నట్లయితే, ఆ పోస్టింగ్స్ సంబంధించి ఏమైనా ఆధారాలు ఉంటే, ఆ బ్లాగ్ స్పాట్ / వర్డ్ ప్రెస్ వారిని సంప్రదించాలి. ఒక్కోసారి తప్పుడు సమాచారం మేరకి అలా మీ పోస్ట్స్ మిస్ అయి ఉండవచ్చును. ఇలా కొందరివి అప్పట్లో యాధృచ్చికంగా తొలగించబడ్డాయి. ఫిర్యాదు చేస్తే, తిరిగి మామూలుగానే వారి బ్లాగ్ లలో కనిపించాయి - అని తెలుగు బ్లాగర్స్ గ్రూప్ లో ఒకరి అభిప్రాయం చూశాను. 

అప్పటికీ పైవేవీ కాకపోతే  - ఆయా పోస్ట్స్ ని క్రొత్తగా - మీ బ్లాగ్ లో మళ్ళీ పోస్టింగ్ చేసుకోవటం తప్పదు

2 comments:

Anonymous said...

Wow, marvelous blog layout! How long have you ever been running a blog for? you make running a blog look easy. The whole look of your website is great, well the content material!

Raj said...

కృతజ్ఞతలండీ మీకు - లే అవుట్ నచ్చినందులకు. ఏదో వంట్లో ఓపిక ఉన్నంతవరకూ అలా కంటిన్యూ అవుతాను. చూడటానికి తేలికగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను. అందరికీ అర్థం అవ్వాలని నా ప్రయత్నం. ఇందులోని విషయాలు మరింతగా నాణ్యముగా ఉంచాలన్నది నా ప్రయత్నం కూడా. కానీ సమయం తక్కువ. :(

Related Posts with Thumbnails