Monday, October 31, 2011

హలో!.. కాస్త ఆగండి..

ఈ క్రింది ఫోటో ని చూడండి. ఈ ఫోటోలో లావాటి చెట్టు వెనకాల, కారు కి మధ్య ఒకరు వెలుతున్నట్లుగా ఉంది కదూ.. గమనించారా?.. సరిగ్గా చూడండి.. వారు ఎవరో చెప్పుకోండి చూద్దాం..


ఒక అమ్మాయి షార్ట్ వేసుకొని, జుట్టు విరబోసుకొని, వెళుతున్నట్లుగా ఉంది కదూ.. నిజమే కదూ..!! హా.. అవును అంటున్నారా?.. అయితే వొకే! వొకే! ఇప్పుడు మనం తన దగ్గరగా వెళ్ళి చూద్దాం.. పదండి మరి. 

.
.

హలో!.. మీరు కాస్త ఆగుతారా? 
.
.

హలో!
.
.

వినిపించినట్లు లేదు.. మనమే కాస్త వేగముగా వెళ్ళి అందుకుందాము. 

హమ్మయ్య! దగ్గరగా వచ్చేశాం..
.
.
హా! 


షాక్!!

తుండుగుడ్డ ఉన్న కర్ర మోసుకెళ్ళుతున్న వృద్ధుడా? ఇందాక నుండీ మనం అమ్మాయి అని అనుకొన్నాము. ఛ!.. ఎంత దారుణముగా మోసపోయాము. 

మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.. 

Sunday, October 30, 2011

Mobile Key pad

మొన్న మొబైల్ లో బ్యాలన్స్ వేయిద్దామని వెళ్లాను. అక్కడ అంతకు ముందే ఒకతను తన ఫోన్ రిపేర్ కోసం వచ్చాడు. ఆ ఫోన్ క్రొత్తగా ఉంది.. కానీ బాగా వాడాడు కాబట్టి దాని కీ ప్యాడ్ బాగా అరిగిపోయి, నంబర్స్ ఏవి ఏవో కనిపించకుండా పోయాయి. అది ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాడు. నిజానికి అది చాలా చిన్న ప్రాబ్లెం. ఎలా సాల్వ్ చేస్తారు?.. ఎంత చార్జ్ చేస్తారో అని అని - నా ఫోన్ లో బ్యాలన్స్ వచ్చేవరకు అన్నట్లు ఆగాను.

ఫోన్ విప్పేసి, వెనకాల ఉన్న ప్యానెల్ తొలగించి, బ్యాటరీ మరియు సిమ్ కార్డులని తీసేసి, వాటికి ఉన్న చిన్నని, సన్నని స్క్రూస్ తీసేస్తే, ముందున ఉన్న కీ బోర్డ్ ప్యానెల్ ఫ్రేం ఓపెన్ అవుతుంది. క్రొత్తది కీ ప్యాడ్ ఎక్కించి, మళ్ళీ బిగిస్తే సరి. ఈమాత్రం దానికి ఎలా రిపేరింగ్ చార్జెస్ ఉంటాయో చూద్దామని ఆగాను.

ఆ షాప్ వాడు ఆ ఫోన్ ని చూసి కీ ప్యాడ్ మార్చాలి. మొత్తం నూటాఎనభై రూపాయలు అవుతుంది అని చెప్పాడు. అబ్బా అంతనా?.. అని నేను షాక్ లో ఉన్నాను. ఆ ఫోన్ యజమాని బేరం మొదలెట్టాడు. చివరికి నూటా అరవై కి బేరం కుదిరింది. ఇక నేను బయటకి వచ్చాను. బయట మొబైల్ ఫోన్ షాపుల్లో కేవలం పది, పదిహేను రూపాయలు ఉండే ఆ కీ ప్యాడ్ అంత ధర చెప్పటం మరీ షాకింగ్ గా ఉంది. కంప్యూటర్ కీ బోర్డ్ యే నూటా యాభై రూపాయలకి దొరుకుతున్నది.. అంత చిన్న దానికి అంత రేటా?

కొన్ని విషయాలు కాసింత జాగ్రత్తగా ఉంటే - చాలా అనవసర ఖర్చులు తగ్గించుకోవచ్చును. 

Saturday, October 29, 2011

Nenante - Oosaravelli

చిత్రం : ఊసరవెల్లి (2011) 
రచన : రామజోగయ్య శాస్త్రి. 
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్ 
గానం : అద్నాన్ సామి.

**************
పల్లవి : 

నేనంటే నాకు చా లానే ఇష్టం - నువ్వంటే ఇంకా ఇష్టం 
ఎచోటైనా ఉన్నా నీకోసం - నా ప్రేమ పేరు నీలాకాశం 
చెక్కిళ్ళు ఎరుపయ్యే సూరీడు చూపైన - నా చేయి దాటందే నిను తాకదే చెలి 
ఎక్కిళ్ళు రప్పించే ఏ చిన్ని కలతైనా - నా కన్ను తప్పించి 
నను చేరదే చెలి చెలి చెలీ // నేనంటే నాకు // 

చరణం 1 :

వీచే గాలీ నేను పోటీ పడుతుంటాం - పీల్చే శ్వాసై నిన్ను చేరేలా?
నేలా నేనూ రోజూ సర్డుకపోతుంటాము - రాణీ పాదాలు తలమోసేలా
పూలన్నీ నీ సొంతం - ముళ్ళన్నీ నాకోసం 
ఎండల్ని దిగమింగే నీడనై ఉన్నా - ఏ రంగు నీ నేస్తం అదేగా నా నేస్తం 
నీ నవ్వుకై నేను రంగు మార్చనా // నేనంటే నాకు // 

చరణం 2 :

చేదు బాధలేని లోకం నేనవుతా - నీతో పాటై అందులో ఉంటా 
ఆటా పాటా ఆడే బొమ్మై నేనుంటా - నీ సంతోషం పూచీ నాదంటా 
చిన్నారి పాపలకూ చిన్నారి ఎవరంటే - నీవంక చూపిస్తా అదుగో అనీ 
ప్రియాతి ప్రియమైన ప్రయాణం ఏదంటే - టకాలని చెప్పేస్తా నీతో - ప్రేమనీ.. // నేనంటే నాకు // 

Friday, October 28, 2011

New Orkut - New Changes

న్యూ ఆర్కుట్ వెర్షన్ మారింది.. మీరు క్రొత్తగా గమనించాల్సిన విషయాలు ఇవీ.. 

1. రీసెంట్ విజిటర్స్ - మీ హోమ్ పేజీలో కుడి కాలం లో అడ్వర్టైజ్ క్రింద ఉంటుంది. 

2. ఇంతకు ముందు మీరు వ్రాసిన స్క్రాప్ కి ఏమైనా అప్డేట్ వస్తే - అది Conversations లో చూసుకోవచ్చును. 

3. మీ డీపీ క్రింద ఉన్న Reminders లో మీకు వచ్చిన టెస్టిమోనియల్స్, Add request లు ఉంటాయి.

4. మీ ఫ్రెండ్స్ బర్త్ డేస్ ఇంతకు ముందులా ప్రొఫైల్ లో కాకుండా మీ DP క్రింద కనిపిస్తాయి. అక్కడ లింక్ నొక్కితే తెలుస్తుంది. 

5. మీరు గ్రూప్ స్క్రాప్ పంపినా అది ఎవరెవరికి పంపారో వారి DP లు థంబ్ నైల్ రూపములో ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా లింక్ రూపములో ఇస్తున్నారు. దీనివలన ప్రొఫైల్ పేరు మాటి మాటికీ మార్చేవారి ప్రొఫైల్ పేరు కనుక్కోవాలంటే - ఇక కష్టమే!. 

6. అప్పట్లో ఒక ఫోటో కొద్దిగా అంటే 25% విజిబిలిటీ వచ్చేది ఆ తరవాత read full post అని వచ్చేది.. ఇప్పుడు 75% ఇచ్చి, మిగతాది read full post అని వస్తున్నది. 

7. పోస్ట్ చేసిన సమయం అప్పట్లో పైన వచ్చేడిది. ఇప్పుడు క్రింద కుడి మూలన వస్తున్నది.

Tuesday, October 25, 2011

Deepavali - An idea

ఈ దీపావళి పండగ కి మీకు శుభాకాంక్షలతో పాటు మీకు ఒక చక్కని సుందరమైన ఐడియా ని ఇద్దామని అనుకుంటున్నాను.. అది వాడండి.

మామూలుగా ఇంటి ముందు దీపాల తోరణాలు గా దీపపు ప్రమిదలు పెడతారు. మట్టి ప్రమిదల్లో నూనె పోసి, వత్తులని పెట్టి, ఎంతో శ్రద్ధగా, భక్తిగా పెట్టేసి, నాయనాందకరముగా ఉండేట్లుగా తీర్చి దిద్దుతారు. లేదా క్రోవ్వోత్తులని అందముగా ఒక వరుసలో ఉండేట్లుగా వెలిగించుతారు. కాని ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే - గాలికి అవన్నీ ఉండవు. లేదా టపాసుల చప్పుళ్ళ లో అవన్నీ ఆరిపోతాయి. పండగ పూట ఈ ఆరిపోవటం, లేదా మాటి మాటికి వెలిగించటం కాస్త విసుగ్గా ఉంటుంది  కూడా.. 

సంప్రదాయవాదులు కాస్త కోపం చేయకుండా, తిట్టకుండా, ఏమీ అనకుండా ఉంటే - అభ్యంతరం లేకుంటే - ఈ రెండు పద్దతులని పాటించండి. 

చైనా మేడ్ సీరియల్ ల్యాంప్స్ ఉంటాయి. అవి మామూలుగా మార్కెట్ లో Rs. 30 కి దొరుకుతాయి. కొన్ని చోట్ల Rs. 50 కి అమ్ముతారు. వాటిని నేల మీద వరుసగా ప్లాస్టర్ల సహాయన అతికేసి, కనెక్షన్ ఇస్తే సరి. అప్పుడు చీకటి పడ్డాక లైట్లు వేస్తే దీపాల్లా వెలిగిపోతాయి. 

ఇంకా ఈ ఎలెక్ట్రికల్ లైట్లని నిజమైన దీపాల్లా వాడాలి అంటే కూడా అలాగే చెయ్యవచ్చును. (ఇది ఎలాగో కాసేపట్లో అప్డేట్ చేస్తాను)  కాకపోతే చిన్నగా మూడు రూపాయల ఖర్చు అంతే!.. నిజానికి ఈ పోస్ట్ కి సమయం లేక ఆదరాబాదరాగా చెప్పేస్తున్నాను.. లేకుంటే ఇంకా డిటైల్డ్ గా చెప్పెసేవాడినే.. 

ఇంకో పద్ధతి.. ఇది మరీ బాగుంటుంది. అందరికీ నచ్చుతుంది కూడా.. 

బర్త్ డే నాడు వాడే మ్యాజిక్ క్యాండిల్స్ ఇవి పది, పదిహేను రూపాయల్లో దొరుకుతాయి. వీటిని ఇంటి ముందు అలా వెలిగించి ఉంచితే మరీ మరీ బాగుంటుంది. ఎలా అంటే - వీటికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మామూలు క్రోవ్వోత్తులా ఉండి, వెలిగించినప్పుడు మామూలు క్రోవ్వోత్తుల్లానే వెలిగిపోతాయి. వీటిని అలా వరుసగా వెలిగించి ఉంచండి. గాలి వచ్చి ఆరిపోయినా, వాటంతట అవే కాకర పువ్వోత్తులకి లాగా చిన్నగా మిణుగురులు వచ్చి, మళ్ళీ మామూలుగా వెలిగిపోతాయి. ఇది బర్త్ డే పార్టీల్లో వీటిని వెలిగించినప్పుడు అందరికీ అనుభవమే. 

వీటిల్లో ఏదైనా వాడి మీ యొక్క దీపావళిని ఘనముగా జరుపుకుంటారని ఆశిస్తున్నాను.. 

Sunday, October 23, 2011

Nidurinche - Mutyala muggu.

చిత్రం : ముత్యాల ముగ్గు (1975) 
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ (ఏకైక సినీ గీత రచన) 
సంగీతం : కే,వి. మహాదేవన్ 
గానం : పి. సుశీల. 
**************

పల్లవి : 

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది.
కన్నుల్లో నీరు తుడిచి, కమ్మటి కల ఇచ్చింది. // నిదురించే తోట // 

చరణం 1 : 

రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది.
రమ్యంగా కుటీరాన - రంగవల్లులల్లింది.
దీనురాలి గూటిలోన - దీనముగా వెలిగింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
శూన్యమైన వేణువులో - ఒక స్వరం కలిపి నిలిపింది
ఆకురాలు అడవికి ఒక - ఆమని దయ చేసింది. // నిదురించే తోట // 

చరణం 2 : 

విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
విఫలమైన నా కోర్కెలు - వ్రేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి - అంతలో పోయాయి.
కొమ్మల్లో పక్షుల్లారా - గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న - నావను ఆపండి
రేవు బావురుమంటోందనీ - నావకి చెప్పండి. నావకి చెప్పండి..

Saturday, October 22, 2011

Nihaarika - Oosaravelli

చిత్రం : ఊసరవెళ్ళి (2011)
రచన : అనంత శ్రీరామ్, 

సంగీతం : దేవిశ్రీ ప్రసాద్,
గానం : విజయ్ ప్రకాష్, నేహా భాసిన్ 

************** 
పల్లవి : 


నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నువ్వే నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి అంటోంది నా ప్రాణమే 
నువ్వే నువ్వే రావాలి నువ్వే నువ్వే రావాలి అంటోంది నా హృదయమే 



నీహారికా నీహారికా -  నువ్వే నా దారిక నా దారిక 
నిహారిక హారిక నిహారిక నువ్వే నే-నిక 
నిహారిక నిహారిక - నువ్వే నా కోరిక నా కోరికా 
నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నీపై ఇష్టమెంతుందో మాటే చెప్పలేను - నిన్నే ఇష్టపడ్డానంతే నిహారిక నిహారిక నువ్వయ్యానిక 
నాకై ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకోను. 
నాతో ఎప్పుడూ ఉంటానంటే - చాలంతే // ఓ నీహారికా నీహారికా // 


చరణం 1:


రెండు రెప్పలు మూత పడవుగా - నువ్వు దగ్గరుంటే 
రెండు పెదవులు తెరచుకోవుగా - నువ్వు దూరమైతే 
రెండు చేతులు ఊరుకోవుగా - నువ్వు పక్కనుంటే 
రెండు అడుగులు వెయ్యలేనుగా - నువ్వు అందనంటే  
ఇద్దరోక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక - రెండు అన్నమాటెందుకో 
ఒక్కసారి నా చెంత కొచ్చినావు నిన్నింక - వదులుకోను చేయ్యందుకో // నిహారిక నిహారిక // 


చరణం 2 : 


నువ్వు ఎంతగా తప్పు చేసినా - ఒప్పులాగే ఉందీ 
నువ్వు ఎంతగా హద్దు దాటినా - ముద్దుగానే ఉందీ 
నువ్వు ఎంతగా తిట్టిపోసినా తీయతీయగుందీ
నువ్వు ఎంతగా బెట్టు చూపినా - హాయిగానే ఉందీ 
జీవితానికీవేళ చివరిరోజు అన్నట్లూ - మాటలాడుకున్నాముగా 
ఎన్ని మాటలౌతున్నా క్రొత్త మాటలింకేన్నో- గుర్తుకోచ్చేనే వింతగా // నీహారికా నీహారికా // 

Wednesday, October 19, 2011

Tuesday, October 18, 2011

Jean Pant - A tip

జీన్ ప్యాంట్ - ఇది యే శుభ నిమిషములో ఈ ప్రపంచానికి పరిచయం అయ్యిందో కానీ, ఎవరిని చూసినా జీన్ ప్యాంట్ యే!. నా జీన్ ప్యాంట్ అనుభవాలు వీలున్నప్పుడు చెబుతాను. ఇప్పుడు మీకు ఒక మీ జీన్ ప్యాంట్ మరింత సౌకర్యముగా ఉండే ఒక చిన్న మార్పు చెబుతాను. ఈ మార్పు కేవలం రెండే రెండు రూపాయల్లో అయిపోతుంది. నిజమే - రెండే రెండు రూపాయల్లో మీరు మరింత సౌకర్యముగా ఉంటారు.

మీరు జీన్ ప్యాంట్ కొన్నాక కొద్దిరోజులకి నడుము వద్ద కాసింత లూజుగా అనిపిస్తుంది. మాటి మాటికీ నడుము పట్టీని పైకి లాగుకోవటం మామూలు అవుతుంది. అది ఎంతగా అంటే - పదిమందిలో ఉన్నా మాటిమాటికీ చేసుకోవటానికి ఆపుకోలేనంతగా.

ఈ ఇబ్బంది తొలగించుకోవటానికి మీ జీన్ ప్యాంట్ నడుము వద్ద ఆల్టరేషణ్ అవసరం. అలా చేస్తే బాగుంటుంది కాని ఆలా చేసే టైలర్ వద్దకి వెళ్ళాలి. నడుము కొలత ఇవ్వాలి. మళ్ళీ తెచ్చేసుకోవాలి. అసలు జీన్ ప్యాంట్ ఆల్టరేషణ్ చేసేవారు చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా ఇబ్బందులే. కాసింత ఖర్చు ఎక్కువే అవుతుంది. అదంతా కాకుండా రెండు రూపాయల్లో మీ నడుముకి ఆ జీన్ ప్యాంట్ అడ్జస్ట్ అయ్యేలా ఒక ఐడియా చెబుతాను. ఇది మీరే చేసుకోవచ్చును కూడా. ఒక సుత్తి గానీ, స్పానర్ గానీ ఉంటే చాలు.

ఈ క్రింది ఫోటో చూడండి. ఈ ఫోటో లోలా మీ జీన్ ప్యాంట్ గుండీ ప్రక్కనే, ఒక ఇంచీ దూరములో గానీ, మీకు కావాల్సిన దూరములో మరో గుండీ వేయించండి. ఒక్కో గుండీ రెండు రూపాయలకి దొరుకుతుంది. కొన్ని చోట్ల మూడు, ఐదు రూపాయలు తీసుకుంటారు. దాన్ని మీ లాజు ప్యాంట్ కి చిన్న రంధ్రం చేసి, అది పెట్టి, పైన నుండి ఇంకో పార్ట్ పెట్టి సుత్తితో గుద్దేస్తే సరి!. అప్పుడు ఆ బటన్ కి మీరు ఆ జీన్ ప్యాంట్ కి ఉన్న ఖాజా అడ్జస్ట్ చేస్తే సరి. చాలా ఈజీగా మీ నడుముకి హత్తుకునేలా ఉంటుంది. ఈజీగా, తక్కువ ఖర్చులో మీకు పని అయిపోతుంది. ఇలా రెండు బటన్స్ ఉన్నాయని మీరు చెప్పేదాకా, విప్పి చూపేదాకా ఎవరికీ తెలియదు కూడా..


ఇలా చేసి, మీ జీన్ ప్యాంట్స్ ని మరింత సౌకర్యముగా వేసుకోనేలా చేసుకోవచ్చును. 

Monday, October 17, 2011

Green screen capture

ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా సీనుల్లో - బ్లూ మాట్ లేదా గ్రీన్ మ్యాట్ సీన్లు తీస్తున్నారు. ఇలా ఎందుకూ అంటే కొన్ని రిస్కీ షాట్స్ లేదా కొన్ని పరిమితులకి లోబడి తీసే సన్నివేశాలకి ఇలా చెయ్యటం తప్పేలా లేకుండా అయ్యింది. ఇది చెయ్యటం కూడా చాలా ఈజీ అయ్యింది కూడా. ఈ క్రింద ఈ మధ్యనే విడుదల అయిన ఊసరవెల్లి సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని చెబుతాను. ఈ ఫోటో చూడండి. 


నటీనటులతో ఒక సన్నివేశాన్ని తీయటానికి సెట్ వేసి, ఎక్కడ అయితే బ్యాక్ గ్రౌండ్ మార్చాలో అక్కడ నీలి రంగు పరదా గానీ, ఆకుపచ్చని పరదా వేసి, దాని ముందు నటీనటులతో ఆ సన్నివేశాన్ని షూట్ చేస్తారు. అలా చేశాక ఆ సన్నివేశములోని ఆ రంగు ఉన్న చోట్ల బ్యాక్ గ్రౌండ్ ని మారుస్తారు. అప్పుడు ఫైనల్ గా ఆ సీన్ మారిపోతుంది. ఈ విషయాన్ని పై ఫోటోలో చూడండి. పైన మొదట తీసినది. క్రింద ఎడిట్ చేశాక మారినది. 

Saturday, October 15, 2011

బ్లాగుల్లో ఫోటో ఆల్బం పెద్దగా చూడాలంటే!

నూతనముగా కొన్ని మార్పులు బ్లాగ్ స్పాట్ లో జరిగాయి. ఎవరి బ్లాగులోనైనా ఫొటోస్ పెడితే - వాటిని పెద్దగా చూడటానికి ఆయా పోస్ట్ లలోని ఆయా ఫొటోస్ మీద డబల్ క్లిక్ చేస్తే సరిపోయేది. అలాచేస్తే ఆ ఫొటోస్ ని పెద్దగా చూసేవాళ్ళం. ఇప్పుడు కొన్ని మార్పులు జరిగాయి. కొద్దిగా ఫోటో ఆల్బంలా మార్చారు. ఒకే ఒక చిన్న మార్పు తప్ప మిగతా అంతా అంతే!.. పెద్దగా చూసే ముందు ఫోటో ఆల్బం వ్యూయర్ లా వస్తుంది అంతే!. అదేమిటో ఎలానో ఇప్పుడు మీకు చెబుతాను. 

నా బ్లాగ్ లోన ఒక టపా - నా ఫోటోగ్రఫి టపా ఇక్కడ ఎన్నుకొని, మీకు చూపిస్తున్నాను. ఆ టపాలోని ఒక ఫోటోని ఎన్నుకొని - ఆ ఫోటోని పెద్దగా చూడాలని అనుకుంటే - ఆ ఫోటో ఇమేజ్ మీద క్లిక్ చెయ్యాలి. (ఈ క్రింది స్క్రీన్ షాట్ లోని పచ్చని ఆకుల ఫోటోని ఆరు మెగాపిక్సేల్ కెమరాలో తీశాను.)


అలా చేసిన ఆ ఫోటో ఇమేజ్ ఇలా క్రింద చూపిన దానిలా మీకు కనిపిస్తుంది. అలా వచ్చిన వ్యూ లో మీరు కుడి పై మూలన ఒక X బటన్ కనిపిస్తుంది. అది ఆ ఫోటో ఆల్బం క్లోజ్ చెయ్యటానికి వాడే బటన్. మధ్యలో పెద్ద సైజులో - ఏదైతే పెద్దగా చూడాలని అనుకొని, దాన్నిమీద నొక్కామో, ఆ ఫోటో మరియు ఆ ఫోటో క్రింద చిన్నగా ఆ టపాలోని మిగతా ఫోటోలు థంబ్ నైల్ రూపములో కనిపిస్తుంది (క్రింది ఫోటోలో అడుగుభాగాన మీకు వరుసగా ఫోటోల వరుస కనిపిస్తున్నది కదా! వాటినే థంబ్ నైల్స్ అంటారు). ఈ థంబ్ నైల్ ఫొటోస్ కీ, ఆ పెద్ద ఫోటోకి మధ్యన ఎడమ వైపున - ఆ పెద్ద ఫోటోకి సంబంధించి, ఒక లింక్ ఉంటుంది. (ఈ క్రింది ఫోటోలో ఉంది చూడండి.) ఆ లింక్ మీద నొక్కండి. 

ఇక్కడే మీరు ఫోటో ఆల్బం ని ఆ సైజులోనే - మొత్తం ఆల్బం చూడాలని అనుకుంటే - ఆ అలా ఓపెన్ కాగానే మీ మౌస్ స్క్రోలింగ్ వీల్ ని నెమ్మదిగా త్రిప్పండి. ఒక్కో ఫోటో పెద్దగా వస్తుంది. ముందుకు త్రిప్పితే ముందువీ, వెనక్కి త్రిప్పితే వెనకవీ వస్తాయి. 
లేదా 
మీ కీ బోర్డ్ లోని బాణం గుర్తుల కీ లను వాడితే కూడా నొక్కినా వరుసగా ఫొటోస్ మారుతాయి. 

అప్పుడు ఆ ఫోటో పాత వర్షన్ లోలా పెద్దగా - ఈ క్రింది ఫోటో లోలా కనిపిస్తుంది. 


ఇప్పుడు ఆ ఎన్నుకున్న ఫోటో మీద మీ మౌస్ మీద రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. అందులో మీరు Open image in new tab ని ఎన్నుకోండి. అప్పుడు ఆ ఫోటో ఇంకో టాబ్ లో పెద్దగా అంటే ఆ ఫోటో రిజల్యూషన్ లో ఓపెన్ అవుతుంది.

అలా పెద్దగా అయిన ఫోటో మీద కర్సర్ పాయింట్ వద్ద ఒక భూతద్దం లో - అని ఉంటుంది. మళ్ళీ కర్సర్ నొక్కగానే + గుర్తువస్తుంది. అప్పుడు ఆ ఫోటో ఒరిజినల్ సైజులో (క్రింది ఫోటో మాదిరిగా) ఆ ఫోటో కనిపిస్తుంది. అక్కడున్న సైడ్  బార్స్ జరుపుకుంటూ ఆ ఫోటోని పెద్దగా - ఒరిజినల్ సైజులో చూడొచ్చును.  

చూశారు కదా.. 6 మెగా పిక్సెల్ కేమరాతో తీసిన ఫోటో మీద నా బ్లాగ్ పేరు ని వ్రాశాను కదా. ఆ ఫోటోని మామూలుగా ఓపెన్ చేసినప్పుడు, ఆ పేరు మధ్యలోకి వచ్చింది కదా.. అదే ఫోటోని Open image in new tab లో ఓపెన్ చేసినప్పుడు మధ్యలో ఉన్న నా బ్లాగ్ పేరు ఒక మూలకు వచ్చింది. అలాగే సైడ్ బార్స్ కూడా వచ్చాయి. 

Thursday, October 13, 2011

మీ దగ్గర ఉందా?

నా మిత్రుడొకరు కాసింత బ్యాంక్ పని ఉంటే వెళ్లాడు. అక్కడ ఉన్న సంబంధిత అధికారి వద్దకి వెళ్లాడు. అప్పటికే ఆ అధికారి వద్ద చాలామంది ఉన్నారు. సరే! క్యూ పద్ధతి లో ఇక్కడ కూడా ఉన్నట్లున్నారు అనుకొని, ఆగిపోయాడు. చేసేది లేక ఇక అలాగే కూర్చోండిపోయాడు. అక్కడ జరిగేది ఆసక్తిగా గమనించాడు.

యే బ్యాంక్ లోని అధికారులైనా ఎక్కడా మూడు సంవత్సరాల కన్నా ఎక్కడా ఒక చోట పనిచెయ్యరు.. కాదు.. కాదు.. చెయ్యనివ్వరు. అన్ని బ్యాంకుల రూల్స్ అలాగే ఉంటాయి కూడా. ఆ తరవాత బదిలీ చేస్తారు. అంతకు ముందున్న ఆ సీటులోని వ్యక్తి ఇతనికి బాగా తెలుసు కూడా. తన ప్రక్కపోర్షన్ లోనే ఉండేవారు కూడా.

ఈ క్రొత్తగా వచ్చిన ఆయన బహుశా యాభై ఏళ్ళకి పైగా ఉంటాడు. తన చాలా అధికార దర్పం చూపించాడు. చిన్నగా కాల్ చేసి మాట్లాడితే, పని జరిగిపోయేదానికి - తన టెక్కు చూపి, జీపులో బ్యాంక్ మందీ మార్బలముతో, వెంట రిజిస్టర్స్ పట్టుకొని ఉదయాన్నే ఏడింటికి ఖాతాదారుల ఇంటింటికీ వెళ్ళి, ఇంటి బయటే నిలబడి, వారిని బయటకి పిలిచి - మాట్లాడటం చేశాడు. అది అక్కడికి వచ్చిన ఆ ఆయన చుట్టూ మూగిన వారి బాధ. "ఒక చిన్న కాల్ చేసి రమ్మంటే వచ్చేవాళ్ళం కదా.. ఇలా ప్రోద్దుప్రోద్దునే అలా మందీ మార్బలం తో ఇంటిమీదకి వచ్చేసి, చుట్టుప్రక్కల వారు చూసేలా - బయటకి పిలిచి, అడగటం చేసేసరికి మరీ అగౌరవపరచినట్లు"గా భావిస్తున్నారు. వారు చెప్పినదీ నిజమే!.. ఆయన మొదట అలా కాల్ చేసాక, వారు అలా రాకుంటే అప్పుడు ఇలా చేస్తే చాలామంచిది. ఆ జీపూ, డిజిలూ, సమయం మిగులుతుంది కదా.. ఇందరు ఆత్మన్యూన్యత కి గురి అయ్యేవారు కారుగా. వారి ఆత్మాభిమానం దెబ్బతినేది కాదుగా. ఒకనిది మహా అంటే పద్నాలుగు వేల రూపాయల బాకీ - అంతే! అతనికీ ఈ బాధ తప్పలేదు.. మొహం చిన్నగా అయ్యింది.

అక్కడికి వచ్చిన ఆ బాధితులందరూ నానామాటలు అన్నారు. అంటున్నారు కూడా. కొంతమంది కొట్టడానికి వచ్చాం అన్నట్లుగా కోపం చూపించారు కూడా. ఆయన్ని నానామాటలూ అన్నారు. కాస్త ముందుగా వచ్చి ఉంటే కేకలు వినేవాడేనని తెలిసిన ఫ్యూన్ చెప్పాడుట. "ఒకసారి మీరు చెప్పాక, మేము మీకు డబ్బులు కట్టకుంటే అప్పుడు అలా రావచ్చును.. కాని ఇన్ఫో ఇవ్వటానికి కూడా అలా వస్తే - మా విలువ మా చుట్టుప్రక్కల ఏముంటుంది.. మమ్మల్ని ఎవరు నమ్ముతారు?.." అని అన్నారు. అలా అలా హాటు హాటుగా సాగింది.

ఆతరవాత కాసేపటికి నా మిత్రుని వంతు వచ్చింది. మాట్లాడాడు.. చాలా కూల్ గా సమాధానాలు ఇచ్చాడు. ఆవెంటనే - ఆయన నా మిత్రున్ని గన్ షాట్ గా ఒక ప్రశ్న అడిగాడు. "నీ దగ్గర పది తులాల బంగారం కావాలంటే - ఉందా? అప్పటికప్పుడు ఇస్తారా?" అని అడిగాడు. నా మిత్రునిది చిన్న సైజు జేవేల్లెరీ షాప్ లెండి.

ఆయన ఉద్దేశ్యం ఏమిటో అర్థం అయ్యింది. అంత కెపాసిటీ కూడా లేనిది నీ స్థాయి అనీ. కాని ఏమీ కోపం తెచ్చుకోకుండా కూల్ గా చెప్పాడు.. "హా! ఇస్తాను.. ఒకవేళ నా దగ్గర లేకున్నా జస్ట్ ఐదు నిమిషాల్లో మీకు ఇవ్వగలను.. అయినా నేను అమ్మేది ఒక శాతం మార్జిన్ కూడా కాదు.. 0.005 % మీద బేరం కాబట్టి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను.."

ఆతరవాత వచ్చిన పని అయిపోయింది. నా ఫ్రెండ్ కుర్చీలోంచి లేస్తూ ఆయనతో - "సర్! నా దగ్గర లేకున్నా, నేను ఇవ్వలేని స్థితిలో ఉన్నా ఎలాగైనా అడ్జస్ట్ చెయ్యగలను. నా సంగతి సరే!.. పోనీ మీ సంగతి చూద్దాం. ఇందాక చూశాను - మీ బ్యాంక్ ఒక రోజు టర్నోవర్ (రాబడి + చెల్లింపులు) మొత్తం కలిపి ఎనబై లక్షలు. మీ ఖాతాదారుని నుండి, ఒక పది లక్షల చెక్ వస్తే - మనీ అడ్జస్ట్ చెయ్యటానికి రెండు మూడు రోజులు ఆపుతారుగా.. మాకొచ్చే కమీషన్ కన్నా మీ కమీషన్ ఎక్కువే! అయినా మీరు వెంటనే ఇవ్వరు.. ఇస్తే మిగతా ట్రాన్స్కషన్స్ కి మీకు ఇబ్బంది. మీకు హెడ్ ఆఫీస్ నుండి డబ్బు రావాలి.. మీకన్నా మేమే నయం లెండి.." అనేసి వెనక్కి చూడకుండా వచ్చేశాడు. ఆ ముసలాయన మొహములో ఎన్ని రంగులు మారి ఉంటాయో! ముందుగా ఇలాంటివారికి తమకి అర్హత, స్థాయి లేకున్నా ఒకరిని అంటే - ఎంతగా పెయిన్ గా ఉంటుందో తెలిసేలా చేయాలి.. 

Saturday, October 8, 2011

Tribute to Steve jobs


"It's really hard to design products by focus groups. A lot of times, people don't know what they want until you show it to them."

"మీ జీవిత కాలం చాలా చిన్నది, ఇంకొకరిలా జీవించేందుకు ప్రయత్నించి, దాన్ని వ్యర్థం చెయ్యకండి. మరొకరు ఏదో అనుకుంటారేమో అని అనుకుంటూ బ్రతికేయకండి. ముఖ్యముగా మీ మనస్సు, అంతరాత్మ ఏమి చెబుతుందో అదే చెయ్యండి.." - స్టీవ్ జాబ్స్ 


స్టీవ్ కి క్రోవ్వొత్తులతో నివాళి.


ఇది లండన్ లోని ఆపిల్ స్టోర్ బయట పెట్టిన - స్టీవ్ జాబ్స్ కి నివాళి అర్పిస్తూ, ఒక ఆపిల్ ని కొరికి, అలా పెట్టి నివాళ్ళు అర్పించారు. 


ఇది స్టీవ్ నెక్స్ట్ అనే సంస్థని స్థాపించినప్పుడు పేపర్లో వచ్చిన వార్త.


ఆపిల్ చిహ్నములో స్టీవ్. చాలా బాగుంది కదూ ఈ క్రియేటివిటీ. ఇది హాంకాంగ్ లోని పాలిటెక్నిక్ స్కూల్ ఆఫ్ డిజైన్ కి చెందిన పందొమ్మిది సంవత్సరాల జోనాథన్ మాక్ రూపొందించిన డిజైన్ ఇది. 


టాం గాఫ్నీ అనే ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అబ్బాయి ఆపిల్ మీద ఇలా స్టీవ్ జాబ్స్ రూపాన్ని చెక్కాడు. 


ఇది గ్రీక్ డిజైనర్ చరిస్ సెవిస్ - ఆపిల్ కంపనీ ఉత్పత్తుల తో చేసిన డిజిటల్ మొజాయిక్ చిత్రం. బాగా చేశాడు కదూ..


ఇది కూడా గ్రీక్ డిజైనర్ చరిస్ సెవిస్ - ఆపిల్ కంపనీ ఉత్పత్తుల తో చేసిన డిజిటల్ మొజాయిక్ చిత్రం. 


చైనా లోని శాండాగ్ ప్రోవిన్స్  లోని జినాన్ లో ఒక అభిమాని ఇలా పేపర్ కటింగ్ తో స్టీవ్ జాబ్స్ రూపాన్ని చేసి, నివాళి అర్పించాడు.


నేపుల్స్ లోని ఒక రెస్టారెంట్ లోని ఒక చెఫ్ ఇలా ఆపిల్ ఆకారములో పిజ్జా చేసి, నివాళి అర్పించాడు.


జాబ్స్ తన తమ మెకింతోష్ కంప్యూటర్స్ ని ప్రపంచానికి తెలియచేస్తున్నప్పటి చిత్రం.. 

updated on : 13-October-2011

Related Posts with Thumbnails