Telugu videos గారు Thursday, June 23, 2011 12:40:00 PM న అడిగిన ఒక ప్రశ్న :
యూ-ట్యూబ్ వీడియో - నాది మీరే కాపీ చేసారు.
టీవీ ప్రోగ్రాం లు పెట్టొద్దు అనే నిబంధన చూసి ఏవీ టీవీ ప్రోగ్రామ్లు అందులో పెట్టలేదు రాజ్ గారు మీరు వ్రాసిన పోస్ట్ చూసాను,
నాకు చిన్నా డౌట్ ?
టీవీ చానల్స్ లోని ప్రోగ్రామ్స్, టీవీ ట్యూనర్ కార్డ్ ద్వారా కాపీ చేసి youtube లో అప్లోడ్ చేస్తే ఏమైనా probelm మా, నేను యౌతుబే ద్వారా money సంపదిన్చాచు అని విన్నాను, దయ చేసి సలహా తెలప గలరు,
youtube లోని చాల తెలుగు videos టీవీ చానల్స్ లోనివే అని అంట్టునారు మా ఫ్రెండ్స్
నెట్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అంటారు నిజమేనా
దయ చేసి సలహా తెలప గలరు..
వారు అడిగిన సందేహానికి జవాబు :
TV ట్యూనర్ కార్డ్ వల్ల టీవీ ప్రోగ్రామ్స్ కంప్యూటర్ ద్వారా రికార్డింగ్ చేసుకోవచ్చును. నేను కొద్ది సంవత్సరాల క్రిందట Intex కంపనీ వారి ఇన్ బిల్ట్ టీవీ ట్యూనర్ తీసుకొని, నా CPU లో డాకింగ్ చేయించాను. దానివల్ల టీవీ ప్రోగ్రాములు చూస్తూ, రికార్డింగ్ చేసుకోవచ్చును. అది అద్భుతముగా పనిచేస్తున్నది. ఇలా టీవీ లోని ప్రోగ్రామ్స్ ఏవైనా నచ్చితే అవన్నీ రికార్డింగ్ చేసుకొని, వీలున్నప్పుడు మళ్ళీ చూసుకోవచ్చును. నాకు కావాల్సిన వీడియోలు అలా కొన్ని చేసుకున్నాను. అప్పుడప్పుడూ టీవీ చూస్తూ, నా సిస్టం పని చేసుకొనేవాడిని కూడా. కాకపోతే హార్డ్ డిస్క్ మెమొరీ బాగా తినేస్తుంది. అందుకే అవసరం అనుకున్న వీడియోస్ రికార్డింగ్ చేసుకోవటం బెస్ట్. ఒక సినిమా పాట 40 - 50 MB వరకూ స్థలాన్ని (క్వాలిటీ బట్టి) ఆక్రమించుకుంటుంది.
ఇలా రికార్డింగ్ చేసుకున్న సినిమా పాటలని, యు ట్యూబ్ లో సభ్యత్వం తీసుకొని, అందులోకి అప్లోడ్ చేస్తారు. ఆ పాటకి పెట్టే ట్యాగ్స్ వల్ల - సర్చ్ లో ఆ వివరాలు టైపు చెయ్యగానే ఈ వీడియో కనిపిస్తుంది. ఇదీ యు ట్యూబ్ లో పెట్టే టీవీ ప్రోగ్రాం ల వెనక ఉన్న కథ.
ఏదైనా టీవీ ప్రోగ్రాం అప్లోడ్ వెనక కారణం? :
కొంతకాలం వరకూ ఇలా టీవీ ప్రోగ్రామ్స్, కాపీ చేసి అప్లోడ్ చేస్తే ఏమీ అయ్యేది కాదు. కాని ఈమధ్య మారాయి. ఎవరికివారు మేథోసంబంధమైన హక్కుల వల్లనే గానీ, డబ్బులు కోల్పోతున్నాము అని వల్లే గానీ, పైరసీ అరికట్టడానికి అని గానీ, కాసిన్ని ఎక్కువ సొమ్ములు చేసుకుందాం అన్న ఆలోచన వల్లనే గానీ... కొద్దిగా ఈమధ్య వాటివాటి స్వంత హక్కుదారులు కూడా యు ట్యూబ్ లో అకౌంట్స్ నిర్వహిస్తున్నారు. అలాంటివారిలో టీవీ కంపనీలు కూడా ఉన్నాయి.
టీవీల్లో వచ్చే అర్ధరాత్రి తరవాత వచ్చే విదేశాలలో ఉండే వారికోసం ప్రసారం చేసే, పాటల ప్రోగ్రాం లలో వచ్చే పాటలని, ఇతర ప్రోగ్రామ్స్ ని - ఇంతకు ముందు ఎవరు పడితే వారు యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసేవారు. ఇప్పుడు ఆ ప్రోగ్రాం సదరు కంపనీ అయిన ఆ టీవీ కంపనీయే తమ సంస్థ పేరు మీద ఒక అక్కౌంట్ ఓపెన్ చేసి అప్లోడ్ చేస్తున్నాయి.
ప్రతి ఛానల్ ఇప్పుడు వారి ప్రోగ్రామ్స్ ఏమైనా కాస్త రేటింగ్స్ వస్తే చాలు.. యు ట్యూబ్ లోకి అప్లోడ్ చేసేస్తున్నాయి. ముఖ్యముగా సంచలన వార్తలు కూడా. దీనివల్ల టీవీ కి దూరముగా ఉంది ఆఫీస్ లలో, దారిలో, ఎక్కడైనా ల్యాప్ టాప్ వల్ల గానీ, అధునాతన 3G, 4G ఫోన్ ల వల్ల గానీ తెలుసుకోవటానికి వీలుగా ఇలా అప్లోడ్ చేస్తున్నారు. ఇలా చెయ్యటం వల్ల లాభం ఏమిటంటే - ఆ వీడియో మీద ఉండే వాటర్ మార్క్ వల్ల ఆ సదరు సంస్థకి ప్రచారం, కాపీ రైట్ హక్కులూ, ప్రపంచ వ్యాప్తముగా ఆ ఛానల్ కి, ఆ ప్రోగ్రామ్స్ కీ "హిట్స్" పెరిగి, తద్వారా ఆ సంస్థ అంతర్జాతీయముగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి.. ఆ ప్రోగ్రామ్స్ లో సత్తా ఉండి ఉంటే. అలా "విషయం" ఉన్న వీడియో వల్ల వారికి హిట్స్ పెరిగి ఆర్థికముగా లాభాన్ని అందిస్తాయి. అందుకే ఈ మధ్య టీవీ సంస్థలు TRP రేటింగ్స్ అంటూ బాగా జపం చేస్తున్నాయి.
ఒకవేళ మనం టీవీ ప్రోగ్రాం అప్లోడ్ చేస్తే ?
ఒక ప్రోగ్రాం మనకి నచ్చి, అందరికీ తెలియచేసేందుకు మనం యు ట్యూబ్ లో అప్లోడ్ చేశామే అనుకోండి. ఆ వెంటనే ఆ విషయం తెలుసుకున్న ఆ వీడియో హక్కుదారులు అయిన టీవీ సంస్థలే గానీ, సినిమా సంస్థలే కానీ, కంపనీలే గానీ.. యు ట్యూబ్ కి అభ్యంతరం తెలుపుతూ వారిని సంప్రదిస్తారు. ఇలా చేసేందుకై సదరు సంస్థలో కొంతమంది సిబ్బందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. వారి డ్యూటీ అంతా ఇదే.
ఇలా వీరి దగ్గర నుండి ఫిర్యాదు అందుకున్న తరవాత ఆ యు ట్యూబ్ వారు ఆ వాటర్ మార్కులూ, మూలాన ఉండే టీవీ సిగ్నేచర్ ఈ వీడియో అప్లోడ్ చేసిన వారికి వారి యు ట్యూబ్ లోని ఇన్ బాక్స్ కీ, మరియు మెయిల్ ID కీ ఈ విషయాన్ని తెలియచేస్తారు. అందులో ఫలానా వారి వారి వీడియోని, మీరు కాపీ చేసి అప్లోడ్ చేశారు.. ఈ మెయిల్ చూడగానే ఆ వీడియోని తీసెయ్యండి. లేదా వారు తీసుకొనే (లీగల్) చర్యలు కి బాధ్యత వహించండి.. అని క్లుప్తముగా దాని సారాంశం. అప్పటికీ మనం తీసేయ్యకుంటే వారే తీసేయ్యవచ్చును, లేదా మనం లీగల్ నోటీస్ అందుకోవచ్చును..
వారికీ తీసేసే అధికారం ఉంటుంది. ఇది ఆ యు ట్యూబ్ లో సభ్యత్వం తీసుకునే అప్పుడు వచ్చే రూల్స్ అండ్ రెగులేషన్స్ లలో ఉంటుంది. అలా వారికి హక్కు. ఇక టీవీ వారికి సంస్థ చిహ్నం, వాటర్ మార్క్ వారి స్వంతదారుని చూపిస్తాయి. ఇక మీరు లీగల్ గా ప్రొసీడ్ అయినా ఎక్కడా గెలవలేని పరిస్థితి. ఆ వీడియోని మనంతట మనం తీసేసిందే బెస్ట్. అక్కడితో ఆ గొడవ సద్దుమణుగుతుంది. లేకుంటే ప్రపంచములో ఆ టీవీ సంస్థ ఏరియాలో వేసే కోర్టు కేసులకి, తిరిగే ఓపికా, తాతముత్తాతల దండిగా ఆస్థీ ఉంటే వారిని ఎదురుకోవచ్చును. అయినా సాక్ష్యాలు మనవైపు చాలా వీకుగా, ముక్కుతో ఊపినా వీగిపోయేలా ఉంటాయి. కనుక గెలవలేం.
మీరు యే కంప్యూటర్ తో, దాని కాన్ఫిగరేషన్ తో సహా, యే నెట్ వర్క్ నుండి, ఎక్కడి నుండి, ఎప్పుడు ఆ వీడియో అప్లోడ్ చేశారో ఆ డాటా అంతా ఆ యు ట్యూబ్ వారి వద్ద ఉంటుంది. కేసు తీవ్రత బట్టి సైబర్ క్రైమ్ పోలీస్ కి ఫిర్యాదు చేస్తే - వారు ఈ డాటా అంతా సేకరిస్తారు. అలా అప్లోడ్ చేసిన వారు తేలికగా దొరుకుతారు. వారి సాక్ష్యాలూ బలముగా ఉంటాయి. (ఇదంతా చిన్నగా, క్లుప్తముగా చెప్పాను. అయినా పెద్దగా అయ్యింది.)
youtube లోని చాల తెలుగు videos టీవీ చానల్స్ లోనివేనా? :
అవును.. ఎక్కువగా తెలుగు టీవీ చానల్స్ వారివే. కొంతమంది కొన్ని క్రొత్తగా వచ్చే టీవీ చానల్స్ వారి చిహ్నాలూ, వాటర్ మార్క్స్ లేనివి అప్లోడ్ చేస్తున్నారు. నెట్ నుండి వీడియోలు డౌన్ లోడ్ చేసుకొని, అందులోని భాగాలని కత్తిరించి వాటిని అప్లోడ్ చేస్తున్నారు. సదరు హక్కుదారులు అభ్యంతరం చెప్పేదాకా అలా యు ట్యూబ్ లో ఉండిపోతాయి. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే - ఇక వీడియో కథ ముగిసినట్లే.
నెట్ ద్వారా మనీ సంపాదించ వచ్చు అంటారు నిజమేనా
అవును.. నిజమే! సంపాదించవచ్చును. మనం అప్లోడ్ చేసిన వీడియోలు బాగుండి, మన టైం బాగుంటే (అందరికన్నా ముందుగా, బాగా నాణ్యత వీడియో ఉండి, ఎవరూ కంప్లైంట్ చెయ్యకపోతే), "హిట్స్" బాగా ఉంటే (ఎవరి అక్కౌంట్ లలో వారికి ఈజీగా, వివరముగా కనిపిస్తాయి.) అప్పుడు మీరు ఆదాయం పొందటానికి అర్హత సాధించారన్న మాట. మీరు అర్హత సాధించారో, లేదో యు ట్యూబ్ సంస్థ నుండి ఒక మెయిల్ మీ మెయిల్ ID కీ, మీ యు ట్యూబ్ అక్కౌంట్ ఇన్ బాక్స్ కీ, వస్తుంది. బహుశా ఆ హిట్స్ యాబై వేలకి పైగా ఉండాలి అనుకుంటా.
అప్పుడు మీ యు ట్యూబ్ అక్కౌంట్ ఓపెన్ చేసి, ఆ మెయిల్ లో ఉన్న లింక్ ని నొక్కితే, అప్పుడు మీకు ఒక అప్లికేషన్ లా వస్తుంది. అది ఫిల్ చెయ్యాలి. అలా మూడు పేజీలు ఉంటాయి. అందులో మీ పేరూ ఊరూ, అడ్రెస్స్, మెయిల్ ID, మీ మొబైల్ ఫోన్ నెంబర్ అన్నీ అడుగుతారు. ఏ ఒక్కటి నింపకపోయినా సర్వర్ అంగీకరించదు. నియమ నిబంధనలు ఇక్కడ మళ్ళీ ఉంటాయి. ఓకే చేసి అంగీకరించాలి. రేపెవరైనా ఆ వీడియో మాది అంటూ వచ్చేవరకూ ఏ ఇబ్బందీ ఉండదు. ఒకవేళ వస్తే! ఇక చిక్కులే. కాపీరైట్ చట్టం క్రింద ఇక చర్యలు ఉండొచ్చు. ఇండియా లో చట్టం అంతగా అమలు ఉండదు కాని, విదేశాలలో మాత్రం చాలా పకడ్బందీ గా ఉంటుంది. అందుకే మీ స్వంత వీడియోలకి ఇలా అప్లికేషన్ నింపి, ఆ డబ్బులకోసం ఎదురుచూడోచ్చును. క్వాలిటీగా ఉండే HD హై డెఫినేషన్ వీడియోలు అయితే మరీ మంచిది. రానురాను వాటికే హిట్స్ పెరుగుతాయి అన్నది ఒక అంచనా..
మీ ప్రశ్నకి నాకు తెలిసినదంతా చెప్పాను.
2 comments:
valuable Information.. Thank you so much..Raj garu.
ధన్యవాదములు..
Post a Comment