vanajavanamali said...
Saturday, February 19, 2011 10:46:00 PM న ఒక బ్లాగ్ వీక్షకురాలు అడిగిన సహాయానికి ఇప్పుడు మీకు చెబుతాను.
ఒక బ్లాగ్ మనకి నచ్చితే కుడివైపున క్రింద ఉన్న FALLOW దగ్గర ఫాలోయర్ గా ఉంటాము.. అలా చెయ్యటం ఎందుకంటే ఆ బ్లాగ్ లోని విషయం మనకి నచ్చటం వల్ల మరియు అందులో అప్డేట్స్ ఏమైనా జరిగితే మనకి వెంటనే మన హోమ్ పేజిలోనే తెలియటానికి ఇలా ఫాలోవర్ గా ఆడ్ అవుతుంటాము. ఓకే.
ముందుగా ఇలా ఫాలోవార్ గా ఎలా ఆడ్ అవుతామో చూద్దాం.. :
ఆయా బ్లాగ్ లో ఎడమ వైపున పైన స్టేటస్ బార్ లో కనిపించే FALLOW మీద క్లిక్ చెయ్యాలి. ఈ క్రింది ఫోటోలో ఎర్రని డబ్బాలో కనిపిస్తున్న 1 వద్ద నొక్కండి.
ఇప్పుడు ఆ ఫాలో మీద నొక్కగానే ఇలా ఒక బాక్స్ వస్తుంది. ఇక్కడ 2 వద్ద కనిపిస్తున్న Fallow publicly ని నొక్కండి. 3 వద్ద Fallow ని నొక్కండి.
ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ ని ఫాలో అవుతున్నట్లు అని ఒక బాక్స్ వస్తుంది. దాని క్రింద ఉన్న 4 వద్ద ఉన్న close ని నొక్కండి.
ఇప్పుడు మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా మారిపోయారు అన్నమాట. ఇప్పుడు మీరు వారి బ్లాగ్ లో ఫాలోవర్ లిస్టు లో కనిపిస్తారు.
ఇప్పుడు మీకు అలా ఫాలోయర్ గా ఉండటం ఇష్టం లేదు అనుకుందాము.. ఏమి చెయ్యాలో చూద్దాం.
ఇప్పుడు మీరు ఏ బ్లాగ్ కి ఫాలోవర్ గా ఉండటానికి ఇష్టం లేదో ఆ బ్లాగ్ పేజీని ఓపెన్ చెయ్యండి. 1 లో చూపినట్లుగా మళ్ళీ ఆ Fallow ని నొక్కండి.
అప్పుడు ఇలా క్రింది దానిలా ఇంకో బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఉన్న 5 దగ్గర Stop following ని నొక్కండి.
నొక్కారా?.. ఓకే.. ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది.. అంతే!. మీరు ఆ బ్లాగ్ కి ఫాలోయర్ గా లేరు అన్నమాట.
6 comments:
good information for bloggers..keep it up..
thankyou very much.. Raj..garoo.. thankyou.. andhariki upayuktham kadhaa.. naaku kalige ibbandhi yemi ledhu. nalaa kondhariki upayogam kaligelaa viluvaina samayanni vecchisthunnaaru. vivaramgaa chebuthunnaaru. once again thankyou very much..
ఏదో నాకు తెలిసింది చెప్పానండీ!..
నేను పొందిన చోట కొంత తిరిగి ఇవ్వాలని అంతే!..
పైన ఉన్న సుధ నేను కాదండీ.
మీరిచ్చిన సమాచారం చాలా ఉపయోగపడుతుంది. శ్రమ తీసుకొని చెప్పినందుకు ధన్యవాదాలు.
నాకు ఒక సహాయం కావాలి. బ్లాగ్ లో మన టపాలు వాటికి మనం పెట్టిన పేర్లతో కనిపించేలా చెయ్యాలంటే ఏం చెయ్యాలో చెప్పగలరా దయచేసి...
blog archive ని add చేసాక ఏం చేస్తే మన టపాలు వాటి పేర్లతో కనిపిస్తాయో అర్థం కాలేదు. వాటిని ప్రచురించిన తేదీలు మాత్రమే కనిపిస్తున్నాయి.
వీలయితే దీనిగురించి కూడా ఓ టపా....
సుధ గారూ.. ముందుగా మీరు నా బ్లాగ్ చూస్తున్నందులకు కృతజ్ఞతలు. మీకు బాగా ఉపయోగపడుతుందని తెలిసి బాగా సంతోషం వేస్తున్నది.
మీ టపా పేర్లతో కనిపించేలా చేయటం చాలా చిన్న సెట్టింగ్ అది. మీకు వివరముగా తెలిసేలా త్వరలో టపాలో చెబుతాను.
(పైన ఉన్న)సుధ గారూ.. మీకు కూడా కృతజ్ఞతలు..
Post a Comment