DP అంటే ప్రొఫైల్ కి పెట్టుకునే ఫోటో నే Display Picture అన్నమాట. ప్రొఫైల్ వ్యక్తి ఫొటోనే గానీ, ఇంకే ఇతర ఫోటో గానీ పెట్టుకోవటం అన్నమాట. చాలామంది తమ తమ ఫోటో పెట్టుకోవటం ఇష్టం ఉండదు.. ఆడవారు వారి వారి ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టుకోవటం చాలా తక్కువే అయినా చాలా మంది వారి వారి పెట్టుకోవాలనే చూస్తున్నారు. ఎందుకో తెలీదు కానీ, వారు పెట్టుకుంటేనే బాగుంటుంది అని నా అభిప్రాయం. అమ్మాయిలు వారి ఫోటోని డీపీ గా పెట్టుకోవచ్చును. కాకపోతే ఒక పద్ధతి చెబుతాను. ఒక ఫోటో కి ఫిక్స్ అవ్వండి. ఆ ఫోటో పెట్టుకుంటే ఇక మార్చకండి. ఆ సైట్లో ఉన్నన్ని రోజులూ అదే కంటిన్యూ చెయ్యండి.. రోజుకొక ఫోటో మార్చటం వల్ల మీకే ఇబ్బంది. ఒక ఫోటో తోనే కడవరకూ 'లాగిన్'చేసేయ్యటం చాలా మంచిది. ఆ ఫోటో కూడా డిజిటల్ కేమరాతో తీయకండి. మొబైల్ కెమరా తో తీసిన ఫోటో పెట్టండి. మొబైల్ తోనే ఎందుకు అంటే ఆ ఫోటో రిజోల్యూషణ్ చాలా తక్కువగా ఉంటుంది. అది కాపీ చేసి మార్ఫింగ్ కి వాడినా మీకు, ఇతరులకూ అది ఈజీగా మార్ఫింగ్ అని తెలిసిపోతుంది. కారణం - ఆ ఫోటో రిజల్యూషన్. అదే డిజిటల్ కేమరాతో తీసినది పెడితే రిజల్యూషన్ ఎక్కువగా ఉంటుంది. మార్ఫింగ్ కి అనుకూలముగా ఉంటుంది. ఇది చిన్న విషయమే అయినా ఆడవారికి బాగా పెద్ద వరం లాంటి సూచన. అలాగే మీ ఫుల్ ఫోటో గానీ, నడుము వరకూ ఉండే ఫోటో పెట్టండి. అంతే కానీ కేవలం ముఖం మాత్రమే కనిపించేసేలా ఫోటో ఎప్పుడూ పెట్టకండి. ఎందుకంటే మార్ఫింగ్ లో ఎక్కువగా వాడేది ముఖ బాగమే! ఈ హాఫ్ లేదా ఫుల్ ఫోటో లోని మొఖాన్ని కట్ చేసి యే స్వంత పనికి వాడుకున్నా సరిగా రాదు అది. ఈ విషయాన్ని బాగా గమనించండి.
ఇక అబ్బాయిల విషయములో ఆయితే స్వంత ఫోటో పెట్టుకోవటం చాలా తక్కువ. ఎక్కువగా సినీ తారల ఫొటోస్ పెట్టుకుంటారు. అలా పెట్టుకునే ఎదుటివారు ఫలానా హీరోలా ఉంటారని ఫీల్ అవుతారు అనుకుంటారు కానీ ఎవరూ ఆ విషయాన్ని పట్టించుకోరు. అయినా ప్రొఫైల్ అంతా మైంటైన్ చేసేది మనమే!.. యే హీరోకి మనం ఎజంట్స్ కాము. అయినా అలాగే మైంటైన్ చేస్తుంటారు. ఇది వారి ప్రొఫైల్ కి పెద్ద మైనస్ పాయింట్. కష్టం మనది, ఫలితం వారిది అని తెలుసుకోరు.
నిజం చెప్పాలంటే ఇలా యే ఫోటో లేని / వారి స్వంత ఫోటో లేని అబ్బాయి ప్రొఫైల్ ని మీ ఫ్రెండ్ లిస్టు లో ఆడ్ చేసుకుంటే - వారు బాగా స్వేచ్చగా కామెంట్స్, స్క్రాపింగ్ చేసే అవకాశం ఉంది. గుంపులో, చీకటిలో, చాటుగా ఉండి ఎవరైనా కామెంట్స్ చెయ్యటం చాలా ఈజీ. నోటికి హద్దు లేకుండా కామెంట్స్ చెయ్యొచ్చు. రేపు ప్రొద్దున ఎంత చెత్తగా వాగినా వారు దొరకడం కష్టం.(అయినా దొరికించుకోవచ్చు. ఆ పద్ధతులు ఇప్పుడు కాదు తరవాత మాట్లాడుకుందాం) చాలా మానసిక బాధని అనుభవించక తప్పదు. ఇది నిజం. ఇది చాలామందికి అనుభవమే!. మగవాడినైన నాకూ ఇలాంటి అనుభవం జరిగింది. స్వలింగ సంపర్కి అయిన హై టేక్ సీటీ లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ చాలా ఘోరముగా నాతో మాట్లాడాడు. నా స్థానము లో ఆడవారు ఉంటే ఇంకా ఎలా ఉండేదో..! అప్పటిదాకా మిత్రుల డీపీ లమీద అంతగా దృష్టి పెట్టనివాడిని - వెంటనే మేల్కొన్నాను. విరుగుడు గురించి ఆలోచించాను. అప్పుడే తట్టింది. అతని వివరాలు అన్నీ ఒక ఆల్బం లాగా చేసి పెట్టాను. ఇంకా ఎదోచేయ్యాలని అనుకున్నాను. ఒకసారి జరిగితే అనుభవం, రెండోసారి జరిగితే మన తప్పు, మూడోసారి జరిగితే మన మూర్ఖత్వం అని నాకు తెలుసు. అందుకే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాను.
చీకటిలో ఉండి - యే ఆధారం కూడా లేకుండా ఉండి, చాటుగా ఉండి, మాట్లాడేవాడు ఎంతకైనా తెగించి మాట్లాడగలడు అనీ. అదే వెలుతురులో ఉండి - అంటే అన్ని వివరాలూ ప్రొఫైల్ లో ఉంటే వారితో వచ్చే చిక్కులు చాలా తక్కువ. అతన్ని ఆడ్ చేసుకునేటప్పుడు, లేదా క్రొత్తలో అలా అన్నీ సేకరించాలి. (అది ఎలాగో ముందు చెబుతాను.)
వెంటనే ఆ ఆలోచనని అమలు చేశాను. ప్రొఫైల్ ఫోటో లేని వారు, లేదా ఆల్బం లో తమ ఫొటోస్ లేనివారిని ఎందరున్నారో గుర్తించాను. "మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. మీరు మీ ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టుకోండి. లేదా ఆల్బమ్స్ లో నాకు మాత్రమే కనిపించేలా పెట్టండి. నా ఇబ్బందిని మీరు గుర్తించే ఉంటారు. లేకుంటే నాకు జరిగిన అనుభవం వల్ల - నా ఫ్రెండ్ లిస్టు నుండి మిమ్మల్ని తీసేస్తాను" - అని వారందరికీ ప్రైవేటు గా స్క్రాప్ పెట్టాను. ఈ వారం లోగా పది మంది వరకూ వారి వారి ప్రొఫైల్ కి ఫొటోస్ పెట్టేసుకున్నారు. ఇంకొంతమంది తాటాకు బెదిరింపులు అనుకున్నారు. అప్పటికి పెట్టని వారు ఇంకో ఐదుగురు ఉన్నారు. ముందు రోజున మళ్ళీ స్క్రాప్ పెట్టాను - "వారం గడువూ అయిపోయింది. రేపు రాత్రి వరకూ పెట్టకుంటే ఎల్లుండిన ఇద్దరమూ దూరం అవుతాము. మళ్ళీ కలవలేము. జస్ట్ గుర్తు చెయ్యటానికి చెబుతున్నాను.." అని చెప్పాను.
ఒకతని దగ్గర నుండి ఒక రిప్లై ఇలా వచ్చింది. "నేను ఇప్పుడు ఉన్నది అడవి లాంటి ఏరియాలో ఉంటున్నా. ఇక్కడ సౌకర్యాలు ఏమీ ఉండవు. వీలున్నప్పుడు నేను నా ఫోటో దిగి పెడతాను" అన్నాడు. అది నిజమే అనుకుందాము. మొబైల్ కెమరా తో ఫోటో తీసి పెట్టొచ్చుగా. అయినా అడవి లాంటి ఏరియాలోనే నెట్ కనెక్షన్ ఉండి, నెట్ లోకి వస్తున్నాడంటే.. ఇక అతని మాటలు ఎలా నమ్మగలను.? తీసేశాను. నేను అతడికి మరీ అంత పువ్వు పెట్టుకున్నవాడిలా కనిపించానా?
ఇంకో అతను వైజాగ్ లో ఉంటాడు. నా బ్లాగ్ ని రెగ్యులర్ గా చూస్తాడు. అతనేమో - బాగా సీరియస్ అయ్యాడు. ఫోటో పెట్టని వారంతా మోసగాళ్ళు అని మీ అభిప్రాయమా అని. అవన్నీ పట్టించుకోలేదు. నా ప్రాబ్లం నాది మీ ఇష్టం అన్నాను. చివరికి పెట్టి ఇలా తీసేశాడు. ఆ ఫోటో క్లారిటీ లేదు. తను నిజమే ఆయితే ఎందుకు అంత భయం?
ఇక్కడ ఒకటే సూత్రం. మన ముఖ ఫోటో చూసేవారు - వారూ తమవి చూపించటం ధర్మం. నీవి మాత్రం చూపించు, నావి చూపించను అంటే మీకెలా ఉంటుంది.? మనమేమీ అండర్ గ్రౌండ్ డాన్ - దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్.. లతో స్నేహం చెయ్యటం లేదు కదా.. అలాని మీకుంటే నిరభ్యంతరముగా ఆడ్ చేసుకొండి. ఒసామా బిన్ లాడెన్ లాంటివాడు కూడా తన ఫోటో బయట పెట్టాడు. అదీ హీరోయిజం అంటే!.. స్నేహం అన్నాక నమ్మకం ముఖ్యం. అది లేనప్పుడు ఇక స్నేహం ఎందుకూ!! నేను పెట్టిన గడువు కాగానే వారి ప్రోఫైల్స్ ని నిర్దాక్షిణ్యముగా నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. అప్పటి నుండీ జాగ్రత్తగా ఉంటున్నాను. ఇప్పుడు నిజముగా - చాలా చాలా సంతోషముగా ఉంటున్నాను. డీపీ ఫోటో లేని వారి దిక్కూ చూడటం లేదు. వెంటనే రిజెక్ట్ చేసేయ్యటమే. నేను తొలగించిన ఫ్రెండ్స్ మళ్ళీ రిక్వెస్ట్స్ పెట్టారు. మళ్ళీ అదే కథ. వారు మారరు. బ్లాక్ లిస్టు లోకి చేర్చాక తప్పలేదు. ఎందుకో పక్కా కారణం తెలిశాక కూడా అలాగే ప్రొఫైల్ ఉంచి ఆడ్ రిక్వెస్ట్ పెడితే - అంతకన్నా మించి ఏమి చెయ్యగలను?
అందుకే ప్రొఫైల్ లోనో, లోపల ఆల్బమ్స్ లోనో ఫొటోస్ తప్పనిసరిగా చూడండి. ఉంటే మీకే మంచిది అని గుర్తించండి. వెలుగులో ఉన్నవాడు ఎప్పుడూ అవాకులూ, చెవాకులూ పలకడు. అలా పలకాలి అంటే వారికి చాలా ఇబ్బందే! లేకుంటే మీరే ఇబ్బంది పడతారు. అది మాత్రం నిజం.
ఒక అమ్మాయి ప్రొఫైల్ ఫేక్ అని ఒకరు చాలా నమ్మకముగా చెప్పారు. ఆ అమ్మాయిని తీసేశాను. తనకు ఆ తీసేసిన విషయం తెలీక మామూలుగా స్క్రాప్ చేశారు. అప్పుడు నా అంతట నేనుగా చెప్పాను "మిమ్మల్ని తీసేశానూ.. మీది ఫేక్ ప్రొఫైల్ అనీ.. ఒకరు చెప్పారు. పేరు మాత్రం చెప్పను. మీరు ఫేక్ కాదని నిరూపించుకోండి అప్పుడు ఆడ్ చేసుకుంటాను.." అనీ. "ఫలానా వారు చెప్పారా అలాని..?" అన్నారు. "వారు అని కాదండీ.. నామీద కూడా ఎవరైనా మీకు చెబితే మీరూ నాలా మారరా?.." అని అన్నాను. కొన్ని విషయాలు కూల్ గా మాట్లాడుకున్న తరవాత ఆమె బాగా ఫీల్ అయినా, వెంటనే సర్దుకొంది. నా భావాన్ని అర్థం చేసుకొంది. అమెరికాలో ఉండే మ్యూచువల్ ఫ్రెండ్ లింక్ ఇచ్చి.. అతన్ని అడగమన్నారు - తను ఏమిటో. ఆరోజే ఆ అమెరికాలో అతన్ని అడిగేశాను. పరిస్థితి వివరించాను. వారిద్దరూ ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్. అంతలోగా ఆవిడ తన ప్రొఫైల్ లో ఫోటో పెట్టేసుకున్నారు. అలా జీవితములో మొదటిసారిగా తన ఫోటో బయట పెట్టేశారుట. ఆ ఫొటోనే ఇంకా కంటిన్యూ అవుతున్నారు.. మార్చటం లేదు. ఇది చాలా మంచి పని. అందుకే ఆడవార్ని ఒక ఫోటో పెట్టుకోని దానికే ఫిక్స్ అయిపొమ్మని చెప్పింది!. నేను చెప్పక ముందే ఆవిడ నన్ను బాగా అర్థం చేసుకున్నారు. ఆమెని నేను మనసారా అభినందిస్తున్నాను.
వాతావరణ కాలుష్య మార్పులవల్లనో, ఇంకే ఇతర మార్పుల వల్లనో కానీ మొగవారి ముఖాలు 25-30 ఏళ్లకే కాస్త పెద్ద వయస్సు వచ్చిన వారిలా కనిపిస్తున్నారు. అలాని ఫీల్ అయ్యి తరవాత ఇబ్బంది పడుతూ ఉండే బదులు ముందుగా పెట్టేసుకోవటమే బెస్ట్.
ఇప్పుడు మీకు ఒక చిన్న కిటుకు చెబుతాను. బాగా నిద్రపోయాక లేచి వెంటనే మొఖం కడిగి, తయారవుతే ఫొటోస్ బాగా అందముగా వస్తాయి. ఇది బాగా అనుభవమున్న ఫోటోగ్రాఫర్ చెప్పిన కిటుకు ఇది.
అయినా అందమైన మొఖాన్ని చూస్తూ ఫ్రెండ్షిప్ చేసేవారు - చివరికి బోల్తా పడొచ్చు. రూపం ముఖ్యం కాదు. గుణం ముఖ్యం. నా ఫ్రెండ్ చెప్పాడు - వాడు ఒక అందమైన అమ్మాయి ప్రొఫైల్ (ఫోటో పెట్టలేదు) తో కొంతమందిని బాగా ఏడిపించాడుట. నన్ను మాత్రం కాదు. అతడి ధాటికి తట్టుకోలేక కొద్దిమంది అక్కౌంట్స్ డెలీట్ చేసుకున్నారు- ట. నిజం చెప్పాడు నాతో. అందుకే అన్నీ చూశాక - ఓకే చెయ్యండి.
దిండు లాంటి మొహం, ఒక తెల్లని చుడీదార్ తో, మెడలో ఆకుపచ్చని రాళ్లున్న హారం వేసుకున్న అమ్మాయి ఫోటో పెట్టిన ప్రోఫైల్స్ నేను నాలుగు చూశాను. ఒకే అమ్మాయి ఒకే ఫోటో తో నాలుగు ప్రోఫైల్స్ ఎందుకు పెట్టుకుంటుందో ఆలోచించండి. అందులో ఒక అమ్మాయిని తెలీక ఆడ్ చేసుకున్నాను. తను ఏమీ "వ్రాయదు." అర్ధరాత్రి పన్నెండు తరవాత "ఆవిడ" వచ్చేసి ఎప్పుడో ఒక స్క్రాప్ "వ్రాసేది." మన పేజీల్లో ఏమైనా ఓపెన్ గా ఉంటే చూసి కాపీ చేసుకోవటానికి వస్తుందేమో!.. ఇప్పుడు తీసేశాను.
ఇక వయస్సు విషయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.. మనం ఆడ్ చేసుకునేవారి వయస్సు ఎంత అని చూడద్దు. స్నేహం లో వయసు చూడొద్దు. అలా చూస్తే మీరు స్నేహం సరిగ్గా చేయలేరు. చాలామంది ఇక్కడే పొరబాటు చేస్తుంటారు. సీనియర్స్ తో మనకేమిట్రా అనుకుంటారు. కానీ అన్ని సీనియర్స్ ఒకేలా ఉండరు. కాలేజి లైఫ్ లో సీనియర్స్ తోడు ఉంటే ఎలా ఉంటుందో చవి చూశామే - అదింకా చిన్న పార్ట్. అంతకన్నా పెద్ద పార్ట్ అయిన జీవితములో ఎందుకు వారి సహచర్యాన్ని వద్దనుకుంటాము.? మనకన్నా సీనియర్స్ తో మాట్లాడితే వారి అనుభవాలు ఎంతగానో బాగా ఉపయోగ పడతాయి కూడా.. ఇప్పుడు నేనైతే తొమ్మిదో తరగతి చదువుతున్న ఆడపిల్ల నుండి - ఇంతే వయస్సున్న మనువలూ, మనవరాలు ఉన్న వారితోనూ స్నేహం చేస్తున్నాను. అన్ని వయస్సులవారూ ఉన్నారు.. అమ్మమ్మలూ, పెళ్ళిళ్ళకి ఎదిగిన పిల్లలున్నవారితోనూ, హై స్కూల్ లో చదువుకుంటున్న పిల్లలున్నవారితో.. బ్రహ్మచారులతో ఇలా.. ఇలా అన్ని రకాలున్నారు. ఇక్కడ స్నేహం ముఖ్యం గానీ వయస్సు ముఖ్యం కాదు. ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు.
updated on :
1st : 8-February-2011
2nd : 9-February-2011 morning
3rd : 11-February-2011 night

No comments:
Post a Comment