వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లింక్ నొక్కి ఆ పేజిలో ఉన్నారు కదా.. ఇప్పుడు ఆ పేజి ఓనర్ పేరు చూడండి. అలాగే ఊరు పేరు కూడా.. ఆడవారయితే ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఊరిపేరు వ్రాసుకోరు. వారి ప్రొఫైల్ పేరూ వేరుగా ఉంటుంది. వారికుండే ఇబ్బందుల వల్ల అలా పెట్టుకున్నారు అనుకుందాం. ఓకే. కానీ అలా వాడేవారు చాలా తక్కువ. చాలామంది ఆడవారు ధైర్యముగా వారి పేరూ, ఊరి పేరూ వ్రాసుకుంటున్నారు. ఇది నిజముగా హర్షించదగ్గ పరిణామం. కొన్ని ఇబ్బందులు ఉన్నా, ఒక రకముగా ఇదే బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. అలాని ఎందుకో ముందు ముందు వస్తుంది. ఒక పేరు పెట్టుకొని అ పేరు మార్చకుండా ఉండిపోతే అంతగా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. మాటిమాటికీ పేర్లు మారుస్తుంటేనే పెద్దగా వారి మీద ఆసక్తి కలుగ చేసుకున్నట్లుగా ఉంటుంది. ఒకే పేరుకి ఫిక్స్ అయిపోతే పెద్దగా ఆసక్తి ఉండదు. అసలు సోషల్ సైట్ వాడు కూడా First name, Last name అని రెండు ఆప్షన్స్ ఇస్తాడు. ఇందులో మొదటి ఆప్షన్ ని మీ పేరుతో ఫిక్స్ అయిపోయి, రెండో లైను ని తరచూ మార్చుకోండి. బాగుంటుంది.
ఇక అబ్బాయిల విషయానికి వస్తే - ప్రొఫైల్ నేమ్ మైంటైన్ చేసేవారు సగం మంది కనిపిస్తారు అంతే!. అందులో వారి ఒరిజినల్ పేరూ ఉండదు, ఊరూ ఉండదు. ఇలాంటివారు మనల్ని ఇబ్బంది చేసే అవకాశం ఎక్కువ. ఆడవారే తమ తమ పేర్లు పెట్టుకుంటూన్నప్పుడు వీరికేం భయం. దర్జాగా పెట్టేసుకోవచ్చుగా.. కానీ పెట్టుకోరు. ఊరిపేరూ నమ్మకం తక్కువే. వారి పేరూ ఉండదు. ఆ పేరూ ఏదోదో ఉంటుంది. ఇక ఊరి పేరు ఆయితే - ఈ భూమ్మీద, మా పక్కింటివారి పక్కింట్లో, మీ హృదయాన.. అన్నట్లుగా వారి ఊరిపేరు పెడతారు. ఎందుకు అంత భయం!. ఆ ఊరికి వచ్చి మమ్మల్ని కలవమని ఇబ్బంది పెడతారు అనా? నాకు తెలిసీ నాకీ అలాంటి ఇబ్బందులు ఏమీ ఎదురుకాలేదు. అయినా అంత తీరిక ఎవరికీ ఉండదు. నాకు - మీరు ఇటువైపు వచ్చినపుడు వచ్చి కలవండి అని ఎన్నో ఆహ్వానాలు వచ్చాయి, ఫోన్ నంబర్స్ కూడా ఇచ్చారు.. కానీ నేనే వెళ్ళలేదు. అటువైపు వెళ్ళినా కావాలని కలవలేదు.
ఇక ఈ ఊరిపేరు కూడా చాలా మందివి - ఒరిజినల్ గా ఉండేవి ఒకటి ఆయితే - పెట్టేసుకునేటివి ఇంకొకటి. వారి వారి హొం టవున్ ఒక చిన్న పల్లెటూరు ఆయితే - పేరుకి మాత్రం కాస్త గొప్పగా ఉండేందుకై - వైజాగ్, హైదరాబాద్, బెంగళూర్.. అని పెట్టుకుంటారు. నాకు అలా కొంతమంది కనిపించారు కూడా. ఒక అమ్మాయిది సంగారెడ్డి అయితే హైదరాబాద్ అని పెట్టేసుకుంటుంది. ఇక అబ్బాయిలదైతే ఎన్నో విచిత్రాలు కనిపిస్తాయి. ఇలాంటివారు అన్నీ దాచుకొని సాధించేది ఏమిటంటే - కాస్త స్వేచ్చగా భావోద్వేగాలను ప్రకటిస్తూ ఉంటారు. అవి ఒక్కొక్కసారి / చాలాసార్లు ఎదుటివారిని ఇబ్బందుల పాలు చేస్తుంటాయి. ఎక్కడైనా తేడా వచ్చినా వారి పేరు, ఊరూ తెలియదు కదా అని వారి ధీమా. ఇక్కడ మీకు నేను ఇచ్చే గొప్ప సలహా ఏమిటంటే : ఇలాంటివారితో - ముఖ్యముగా ఆడవారు జాగ్రత్తగా స్నేహం చెయ్యటం మంచిది.
ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది మొన్న మొన్ననే రీసెంట్ గా జరిగింది. ఇది బాగా ఎడిట్ చేసి పెట్టాను. ప్రోఫైల్స్ అన్నీ లేకుంటే ఎలా మాట్లాడుతారో! చూడండి. మాటలు కూడా ఎడిట్ చేశాను. అయినా మీనింగ్ అర్థం అవుతుంది. గొడవ అసలు ఏదైనా ఉండనీ, తప్పు ఎవరిదైనా ఉండనీ, అపార్థాలు ఏ రూపము లో అయినా ఉండనీ.. కానీ ఇంత ఘోరముగా తిట్టుకోవటం అవసరమా..? నేను సంచనాలకోసం ఇక్కడ ఇది చూపటం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పటానికీ, రేపు మనకూ ఇలా కూడా జరగవచ్చనీ చెబుతున్నాను అంతే! అంతే తప్ప వేరేగా కాదని నా మనవి.
ఇలా సబ్జెక్ట్ లోనికి వద్దాం.. ఇప్పుడు వారి ఈ డిటైల్స్ చూసి ఒక అవగాహనకి వచ్చేశారుగా. నచ్చితే - GOOD కి ఒకమార్కు, పరవాలేదు అనుకుంటే - FINE కి ఒకమార్కు, నచ్చకపోతే - WASTE కి ఒకమార్క్ వేసుకోండి.
ప్రొఫైల్ పేరు చూడటమే కాదు. ఆడ్ రిక్వెస్ట్ లో వచ్చిన మెయిల్ ID కూడా చూడండి. అందులో అనుమానాస్పదం కూడా ఉంటుంది. వారి పేరుతో మెయిల్ ID ఉంటే - నమ్మదగిన వ్యక్తే అనుకోవచ్చు.. అలా కాకుండా అదీ ఏదో పేరు మీద ఉంటే ఇక్కడ కాస్త అనుమానం పెట్టుకోవచ్చును. ఉదాహరణకి : నేను మీకు ఆడ్ రిక్వెస్ట్ పెట్టానే అనుకోండి. ఆ రిక్వెస్ట్ తో పాటు మీకు నా మెయిల్ ID కూడా అందులో భాగముగా వస్తుంది. అందులో నా పేరు రాజ్ ఆయితే నా మెయిల్ ID raj@xyz.com అన్నట్లు కాకుండా loverboy@xyz.com అని వచ్చిందే అనుకోండి. అంతే. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈమెయిల్ లో కూడా మీకు దొరకుండా జాగ్రత్తగా ఉంటున్నారన్న మాట. ఆలా కాకుండా ఆ రాజ్ అని పేరు మీద ఇందాకే ఏదైనా మెయిల్ ID రిజిస్టర్ అయి ఉంటే వారు raaj2011@xyz.com అని ఏదో ఒక అంకెలు చేర్చి పెట్టుకోవచ్చుగా.ఎప్పుడూ ఇలా చూడకుండా అలా ఆడ్ రిక్వెస్ట్స్ ఓకే చేసుకోకండి. ఆడ్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండండి. లేకుంటే ఇబ్బంది పడతారు.. గాలికి పోయే కంపలని మీదికి తెచ్చుకోవటం అంటే - ఇలా కూడా ఉండొచ్చు.
అందుకే ముందే మేల్కోండి.. మనకి హితువు చెప్పే వారు ఈ ఇంటర్ నెట్ లో ఎవరూ ఉండరు. ఎవడి గోల వాడిదే అన్నట్లు ఉంటుంది. ఎవరూ మీ గురించి పట్టించుకోరు. కనీసం షేర్ చేసుకోరు. ఇంకా ఏమైనా అంటే పెద్ద నానా యాగి చేస్తారు. అంతా తెలుసుకునేసరికి నెట్ కే దూరం అయ్యే పరిస్థితి వస్తుంది..
నేను నెట్ కి వచ్చినప్పటి నుండి గమనించాను - నా మిత్రురాళ్ళు ఇలా దూరం అయ్యారు. చాలా భయంకర అనుభవాలు. అవన్నీ వారి జీవితాల్లో పీడ కలలు లాంటివి. ఒకరకముగా చెప్పాలంటే అలాంటివారికి మేలు చెయ్యాలని ఇవన్నీ వ్రాస్తున్నాను. సినిమా కబుర్లు, రాజకీయాలు, పనికి రాని చెత్త ఊసులు వ్రాసి పేజీలు నింపొచ్చు. కనీసం ఒక్కరికైనా చేరాలనీ, వారికి ఉపయోగపడాలని, ఇదంతా చెప్పటం. ఇప్పటికే ఈ టపాలకి బాగా రెస్పాన్స్ వస్తున్నది. మిత్రుల అభినందనలు బాగానే ఉంటున్నాయి.. నిన్నటి నిన్న ఆ పైన ఫోటోలో అసహ్యముగా మాటలు పడ్డ ఆ అమ్మాయి ని ఇంటర్ నెట్ లోకి రానీయ్యకుండా బాగా కట్టడి చేశారు. బహుశా ఈ జన్మలో ఆ అమ్మాయి నెట్ కి రాలేదేమో. మామూలు చిన్న విషయాన్ని పెద్దగా చేశారు. అందులో తలా పాపం పిడికెడు. సామరస్యముగా ముగిసిపోతుంది అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదు. లేకుంటే మధ్యలో కలుగజేసుకునేవాడిని. ఇలాంటిదే చిన్న గొడవలో - ఒక అమ్మాయి, అబ్బాయి గొడవ పడితే - కలుగచేసుకొని - ఇక అలాంటిది మళ్ళీ కాకుండా ఆపాను. కానీ ఇలా ఎప్పుడూ ఎవరో ఒకరు ఆపుతారు అని అనుకోకండి. ఎవరూ ఆపరు. వినోదముగా చూస్తారు.
ఇక్కడ నేను చెప్పేది ఒకటే.. సోషల్ సైట్ల లోకి వచ్చే హక్కు అందరికీ ఉంది. తప్పులు మీలో ఉంచుకొని, మన చేష్టలవల్ల ఎదుటివారిని హర్ట్ చేసి , వారిని రాకుండా చేస్తే - బావుకునేది ఏముంటుందో కాస్త ఆలోచన చెయ్యండి. ఇలా ఫేక్ ప్రోఫైల్స్ వాళ్ళనీ ఆడ్ చేసుకొని, ఇంకొందరు అమాయకులు వారిని ఆడ్ చేసుకునేలా వంచించకండి. ఆడ్ చేసుకునే ముందు మ్యూచువల్ ఫ్రెండ్స్ ని అడగటం మంచిది. ఆ ఫ్రెండ్స్ కూడా వీరికి తగిన ఇన్ఫో ఇవ్వటం మంచిది. దారి తెలీనివాడికి - తెలీనప్పుడు నాకు తెలీదు అని చెప్పటం మంచిది కానీ తప్పుదారి పట్టించటం అంత సంస్కారం కాదు.
(తాజా కలము : ఇది చదివాక అనుకుంటా.. నా మిత్రుడూ, బ్లాగర్ అయిన ఒకతను చాలారోజుల తరవాత ఈరోజు చాట్ కి వచ్చేసి - నేను అడగక ముందే తన ఇన్ఫో ఇచ్చేశారు. అతను స్క్రాప్స్ చాలా తక్కువగా చేస్తుంటాడు. అయినాయన బాధ్యతగా మళ్ళీ చెప్పారు. నా స్నేహితురాల్లో - వారూ పరిఛయం అయిన క్రోత్తల్లోనే తమ తమ ఇంట్రో ఇచ్చారు. అలా ఇవ్వటం మూలానే అనుకుంటా - బాగా క్లోజ్ స్నేహితులమయ్యాము.)
చిన్ని చిన్ని పొరబాట్లు కొందరి సహచర్యాన్ని కోల్పోయేలా చేస్తుంటాయి. మీలో ఎవరి ప్రొఫైల్ అయినా గాని ఇలా ఉంటే - మిత్రులు కానివారు కూడా మీ స్క్రాప్ బుక్ లో స్క్రాప్స్ వ్రాసేలా (ఆర్కుట్) సెట్టింగ్స్ పెట్టుకోండి. అది ఎలాగో ఈ క్రింద చూడండి. ఒకవేళ ఎవరైనా మీ మిత్రులు కాకున్నా వ్రాస్తే - మీకు మాత్రమే, మరియు ఆ వ్రాసిన వారికి మాత్రమే కనిపిస్తుంది. ఏదైనా తేడాగా వ్రాస్తే - వారిని బ్లాక్ చెయ్యండి. అది ఎలా చెయ్యాలో ముందు ముందు టపాల్లో చెబుతాను. Old orkut >; Settings > Privacy కి వెళితే ఇలా వస్తుంది.
ఇలా పెట్టుకోండి. ఒక వేళ మీ స్క్రాప్ బుక్ ఎవరూ చూడొద్దు అనుకుంటే Only friends అని పెట్టుకోండి. సరిపోతుంది. ఇప్పుడు క్రిందన ఉన్న Save changes ని నొక్కండి. ఇప్పుడు హ్యాపీయేనా? నేను ఇలా పెట్టుకున్నందుకూ, నా మిత్రులు పెట్టుకున్నందులకూ నాకు ఆరేడుగురు మిత్రులుగా ఆడ్ అయ్యారు. ఇక పెట్టుకోకుండా (ఏదైనా అడిగే వీలులేక పోయేసరికి) రిజెక్ట్ అయినవారు చాలా మందే ఉన్నారు.
వారి ప్రత్యేకత :
ఆ ప్రొఫైల్ అంతా చూశాక - వారిలో మీకు ఏమైనా "స్పెషల్" కనిపించాలి. అలాంటి వారిని ఆడ్ చేసుకోండి. చాలా ప్రోఫైల్స్ రొటీన్ గా ఉంటాయి. ఏమాత్రం స్పెషాలిటీ / రొటీన్ కి భిన్నముగా వారి ప్రోఫైల్స్ ఉండవు. వారిలో టాలెంట్స్ కూడా ఉండవు. ఇదిగో ఇలాంటివారే - ముందే చెప్పానుగా ఇలా ఆడ్ అయ్యి ఓ మూలన నక్కి, మనం ఏమి చేస్తుంటాము అని చూస్తూ ఉంటారు. అదో టైపు ఎంజాయ్మెంట్ వారిది - విండో షాపింగ్ మాదిరిగా. మన ఫొటోస్ చూస్తారు. స్క్రాప్స్ చూస్తారు. ఎవరితో క్లోజ్ గా ఉంటున్నామో, ఏమేమి చేస్తున్నామో.. అన్నీ చూస్తూ వారు మాత్రం భలే ఎంజాయ్ చేస్తుంటారు. మనకి మాత్రం సంవత్సరములో ఒక్క రిప్లై కూడా వ్రాయరు. మనం వ్రాసిన వాటికి కూడా ఏమీ రిప్లైస్ స్క్రాప్స్ ఉండవు. ఇలాంటివారు ఉన్నా లేకున్నా ఒకటే. ఇలాంటివారిని కొద్దిరోజులు చూశాక - నేనైతే నా ఫ్రెండ్స్ లిస్టు నుండి పీకేస్తుంటాను.
నాకు ఒక అమ్మాయి అలా ఆడ్ అయ్యింది. బి టెక్ చేసింది. M. Tech చెయ్యక ఇంట్లో ఉన్నది. ఎన్నిసార్లు స్క్రాప్ పెట్టినా జవాబులేదు. తను మాత్రం వేరేవారికి జవాబు ఇస్తూనే ఉంది. నాకు మాత్రం లేదు. వారి ఫ్రెండ్స్ స్క్రాప్ బుక్స్ చూస్తే ఈ విషయం అర్థం అయ్యింది. ఆ విషయం ఆమెకి చెప్పేసి, ఆమెని నా ఫ్రెండ్ లిస్టు నుండి తీసేశాను. తను గోల చేసినా పట్టించుకోలేదు. ఆమెని బ్లాక్ లిస్టులో పడేశాను.
ఇలాంటివారిని ఉంచుకుంటే మన ఫ్రెండ్స్ సంఖ్య పెరుగుతుంది. కానీ నీకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని ఇక్కడ ఎవరూ అవార్డ్స్ ఇవ్వరు. యోగి వేమన చెప్పినట్లు - గంగిగోవు పాలు గరిటడైనను చాలు.. అన్నట్లు అసలు సిసలు టాలెంట్స్ ఉన్న స్నేహితులు కొందరు ఉంటే చాలు. మీరు సంతోషముగా ఉండాలంటే - ఈ సూత్రాన్ని తప్పక పాటించండి. ఇక్కడికి / మిత్రుల వద్దకి వచ్చేదే రిఫ్రెష్ అవటానికి.
ఇంకో అతను - నా మిత్రురాలు ఆడ్ చేసుకోమంటే - ఆడ్ చేసుకున్నాను. ఇలా ఈ ఆడ్ చేసుకోమని అనే పదం ఎందుకు స్పెషల్ గా చెబుతున్నానూ అంటే - నాకు అతను అంతకు ముందే తెలుసు. ఎక్కడ ఉంటాడో కూడా తెలుసు. ఆడ్ రిక్వెస్ట్ పెట్టడానికి కాస్త ముందుగా తాను ఉండే ఊరి పేరు హైదరాబాద్ నుండి - వుడ్లాండ్స్ స్ట్రీట్, సింగపూర్ అని మార్చుకున్నారు. కానీ ఇండియా ఫోన్ నంబర్స్ మాత్రం అలాగే ప్రొఫైల్ లో ఉన్నాయి. అది గమనించినా, నా అనుభవం వద్దని వారించినా, ఆమె కోరికమేరకు ఏమీ అభ్యంతరం చెప్పకుండా వెంటనే ఆడ్ చేసుకున్నాను. ఒకరోజు వీలు చేసుకొని ఆ ఫోన్ నంబర్స్ కి ఫోన్ చేశాను.. అవి రెండు నంబర్స్ +91988.... +91970... తో మొదలయ్యే పది అంకెల ఇండియా (ఆంధ్రప్రదేశ్) మొబైల్స్ ఫోన్ నంబర్స్. నాకు అప్పటికే మిత్రులని తీసెయ్యటం మొదలెట్టాను. కానీ నా మిత్రురాలి కోరిక మన్నించి ఆడ్ చేసుకున్నాను. ఆ తరవాత చాలారోజులకి అతన్ని తీసేశాను. తను చెప్పడం వల్ల ఆడ్ చేసుకున్నాను కాదా అని చెప్పి రిమూవ్ చేద్దామని చెప్పాను. అప్పుడు పెద్ద గొడవ. అయినా తన కోసం ఊరుకున్నాను. అప్పుడే తెలుసుకున్నాను. ఆడ్ చేసుకోవటం చాలా ఈజీ కానీ, రిమూవ్ చేసేటప్పుడు పెద్దగా గొడవలు కావచ్చును అని. ముందే చెప్పాగా నమ్మకం ఇక్కడ పునాది. నేను పెట్టేవన్నీ నిజమే ఉన్నప్పుడు ఎదుటివారూ అలా ఉండాలని కోరుకోవటం తప్పుకాదనుకుంటాను. పైననే స్మార్ట్ గై అని పెట్టుకుంటేనే (ఇది దానితో పోల్చితే ఇంకా చిన్న పొరబాటు) తీసేసినవాడిని. ఇక ఎలా కంటిన్యూ అవగలను.
ఇలా చేస్తే నాకు ఒక్కరూ కూడా స్నేహితులుగా మిగలకపోవచ్చును అని శాపనార్థాలు పెట్టినా సరే.. నిజానికి లేకున్నా సరే. చెప్పానుగా గంగిగోవు పాలు గరిటడైనా చాలు అనీ. పది మంది మిగిలినా చాలు. నాకున్న బీజీ లైఫ్ లోనుండి కాస్త రిలీఫ్ కోసం ఈ సోషల్ సైట్లలోకి వస్తే - ఇక్కడా ఇలా ఉండి, ఇక్కడా ఇబ్బంది / కష్టపడడం నాకు ఇష్టం లేదు.
updated on :
1st : 6 - February - 2011 night.
2nd : 8 - February - 2011 night.
3rd : 9 - February -2011 Morning
2 comments:
Raj Bro Superrrrrr correct ga chepparu !!
ధన్యవాదములు..
Post a Comment