Friday, February 18, 2011

Social NW Sites - 16 - ఫొటోస్.

ఈ సోషల్ సైట్లలో మరో పెద్ద అట్రాక్షన్ ఏమిటంటే - ఫొటోస్. ఫోటోగ్రఫీ అభిరుచి ఉన్నవారికి ఈ ఆప్షన్ ఒక వరం లాంటిది. మనం దిగిన ఫొటోస్, ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు దిగిన ఫొటోస్, ఆయా ప్రదేశాలలో తీసిన అందమైన దృశ్యాలూ.. ఇలా అన్నీ తీసి ఇందులో అప్లోడ్ చేసుకోవచ్చును. చాలామంది సినిమా తారల ఫొటోస్ అప్లోడ్ చేస్తుంటారు. ఇందులో కూడా కొంత స్పెషలైజేషన్ చేసినట్లు - కొంతమంది హీరోయిన్ ఫొటోస్ మాత్రమేనో, ఒకరివే మాత్రమే ఫొటోస్ పెడుతూ ఉంటారు. సాధారణముగా ఇలాంటి ఫొటోస్ పెడుతూ ఉంటే - వీరి మనస్తత్వం ఈజీగా గుర్తుపట్టొచ్చు. మీకు ఎవరైనా ఆడ్ రిక్వెస్ట్ వస్తే - వారి అక్కౌంట్ లో ఇలా కనిపిస్తే - వారు అందమైన ఊహాలోకములో విహరించేవారు, తమని ఒక ప్రత్యేక వ్యక్తిగా చూడాలని వారు కోరుకుంటున్న మనస్తత్వం అని గమనించుకోవాలి. వారితో ఇలా చెప్పినా అదేమీ కాదని అంటారు. అలాని అనిపించుకొని దూరం చేసుకొనే బదులు వారు ఇలాని గమనించనట్లే ఉండటం చాలా చాలా మంచిది. ముందే చెప్పాగా ప్రొఫైల్ చూసి ఎన్నో విషయాలు గమనించవచ్చును అనీ.

ఫొటోస్ రెండు రకాలు. ఒకటి ప్రింట్స్ (ఫిలిం) పద్దతిలో, రెండోది డిజిటల్ పద్ధతి లోనివి. పిలిం పద్ధతి లోని ఫొటోస్ డిజిటల్ కి మార్చాల్సి ఉంటుంది. అలా డిజిటల్ లోకి మార్చినవే / తీసినవే వీటిలోకి అప్లోడ్ చెయ్యాల్సివస్తుంది. ఈరోజుల్లో 10 మెగాపిక్సేల్ కెమరా మూడున్నర వేల రూపాయల్లో వచ్చేస్తున్నది.

ఫొటోస్ అప్లోడ్ చేసే ముందు -

1. ఆ ఫొటోస్ ని ఒక ఫోల్డర్ లో అప్లోడ్ చేసుకోండి.

2. ఆ ఫోల్డర్ లో అప్లోడ్ చేసిన వాటిల్లో మీరు మీ ఆన్లైన్ స్నేహితులకి ఏమేమి చూపించాలో వాటిని సెలెక్ట్ చెయ్యండి.

3. ఆ సెలెక్ట్ చేసిన వాటిని కాపీ చేసి, మై డ్యాకుమెంట్స్ లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, దానికి UPLOAD అని పేరు పెట్టి, అందులో పేస్ట్ చెయ్యండి. ఇలా చేస్తే - మీరు అప్లోడ్ చేసేవాటి మీద మీకు క్లారిటీ వస్తుంది.

4. అంటే - ఈ ఫోల్డర్ లోనివే మీరు అప్లోడ్ చేస్తారు అన్నమాట.

5. ఇలా చేసినవాటిని వెంటనే అప్లోడ్ చెయ్యక ముందుగా వాటిని మీ సిస్టం లోని MS ఆఫీస్ లోని Picture Manager లో ఎడిట్ చెయ్యండి.

6. వాటిలో ముందుగా క్రాప్ చెయ్యండి. ఎంతవరకు ఫోటో చూపాలో అంతే చూపగలరు.

7. ఆ తరవాత ఆ ఫోటో ని కంప్రెస్ చెయ్యండి. కంప్రెస్ ఎందుకూ అంటే - ఇండియా లో నెట్ కనెక్షన్ అంతా స్లో నెట్ స్పీడ్ కలవి. ఈ 256 kbps స్పీడులో వాటిని అప్లోడ్ చెయ్యాలంటే చాలా సమయం పడుతుంది. 10 మెగా పిక్సెల్ కేమరాతో తీసినవే అంటే ఒక్కో ఫోటో 4 - 5 MB ఉంటుంది. ఇది అప్లోడ్ అయ్యేసరికి బాగా సమయం పడుతుంది. అలాగే డాటా వాడకం బాగా ఉంటుంది. మీరు 5 MB క్లారిటీతో ఫోటో అప్లోడ్ చేసినా అక్కడ 50 - 60 KB  ల్లోకి మారిపోతుంది. అందుకే కంప్రెస్ చెయ్యాలి. కంప్రెస్ చేస్తే ఇంకొన్ని లాభాలూ ఉన్నాయి. అవి చెప్పలేను.

8. ఆ తరవాత వాటిని ఎడిటింగ్ చెయ్యాలి. అప్పుడు డల్ గా ఉన్న ఫొటోస్ చాలా కాంతివంతముగా, చూడ ఆకర్షణీయముగా మారుతాయి. అప్పుడు మన సైట్లో పెట్టుకున్నా అందరికీ బాగా నచ్చేస్తాయి. మీరు డొక్కు డబ్బా కెమరాతో ఫోటో తీసినా, మొబైల్ తో తీసినా, ఈ ఎడిటింగ్ వల్ల ఇంకా ఆకర్షణీయముగా మార్చొచ్చు. అతి కొద్దిమంది తప్ప - ఇంకెవరూ ఇలా పాటించరు. బహుశా తెలీకపోవటమో, వారి నిరాసక్తత కారణం వల్లనో, ఎలా చెయ్యాలో తెలీకపోవటమో, తెలుసుకోవాలని ఇంటరెస్ట్ లేకపోవటమో..

9. ఆతర్వాత అప్పుడు మీ ఫోటో ఆల్బం లోకి అప్లోడ్ చెయ్యండి. మీకు ఫోటో కామెంట్స్ రూపములో అభినందనలు వస్తాయి.

ఇప్పుడు ఒక ఫోటోని ఎలా ఎడిట్ చెయ్యగలమో చూద్దాం.. సినిమా తీసిన తరవాత ఎడిటింగ్ ఎలాగో, కేకు చెయ్యగానే - ఐసింగ్ చెయ్యటం ఎందుకో, ఇదీ అంతే. ఎక్కువగా సుత్తి కొట్టను.. ఇక డైరెక్ట్ గా విషయం లోకి వద్దాం!. ఈ క్రింది ఫోటో డిజిటల్ కెమరాతో తీసినది. ఎంతగా డల్ గా ఉందో ఈ కుక్క ఫోటో చూశారా? గమనించండి.


ఇది నా మిత్రురాలు తీసిన పెట్టుకున్న ఫోటో ఇది. ఇది వారింటి పెంపుడు కుక్క ఫోటో. ఈ ఫోటో ఎడిటింగ్ గురించి చెప్పటానికి ఈజీగా ఉంటుందని ఈ ఫోటో ఎంచుకున్నాను. పై ఫోటో చూశారు కదా. ఎంతో డల్ గా ఉంది కదూ.. ఇప్పుడు ఆ ఫోటోని MS ఆఫీస్ లోని PICTURE MANAGER లో ఓపెన్ చెయ్యండి. చేశారు కదూ.. ముందుగా CROP చెయ్యండి.


ఆ డల్ గా ఉన్న భాగాన్ని ఈ క్రాప్ టూల్ ద్వారా తీసేస్తాము అన్నమాట. ఈ క్రాపింగ్ ఎందుకూ అంటే ఆ ఫోటో లోని అనవసర దృశ్యాన్ని తీసెయ్యటం అన్నమాట!.. అలా చేసి ఎక్కువగా ఉన్న SIDES మార్క్ చేసుకొని OK నొక్కటం ద్వారా తొలగించుకోవాలి. ఇప్పుడు ఆ ఫోటో ఇలా వస్తుంది..


ఇప్పుడు ఆ కుక్క దగ్గరగానూ, పెద్దదిగానూ వస్తుంది కదూ. ఆ మొదటి ఫోటో కన్నా ఈ రెండో ఫోటో చాలా బాగుంది కదూ.. మీరు మరింతగా గమనించాలంటే ఆ ఫొటోస్ మీద క్లిక్ చెయ్యండి. పెద్దగా కనిపిస్తాయి. ఇప్పుడు పైన ఉన్న AUTO CORRECT అన్న టూల్ నొక్కటముతో ఇప్పుడు ఇలా కనిపిస్తుంది. 


చూశారు కదూ.. ఎంత తేడా వచ్చిందో!.. ఇంకా ఓపిక ఉంటే - ఇంకా బాగా ఎడిట్ చేసుకోవచ్చును కూడా.. అదీ మీకోసం మరీ బాగా ఎడిట్ చేసి క్రింద పెట్టాను. అదీ చూడండి. క్లారిటీ ఎలా ఉంటుందో. అసలు ఇవి మీరు తీసినవి అంటే మీ మిత్రులు అసలే నమ్మరు కూడా. (పెద్దగా చేసి చూడండి. అప్పుడే తేడా ఏమిటో మీరే చూస్తారు.)


ఇలా మీ టాలెంట్ ఉపయోగించి చెయ్యవచ్చు. ఆన్ లైన్ ఫోటో ఎడిటర్స్ వాడి ఇలా కూడా చేసుకోవచ్చును. కానీ మన సిస్టం కి ఎంతో ప్రమాదకరమైన మాల్వేర్ లని ఈ JPEG ఫొటోస్ లలో చొప్పించటం అన్నింటికన్నా ఈజీ. ఇలా ఆయా సైట్లలో ఎడిట్ చేసుకున్న ఫొటోస్ లలో ఆడ్ అయ్యి,  డౌన్లోడ్ చేసుకోగానే - అలా మన సిస్టం లో తిష్ట వేస్తాయి. ఇక మన ఫోటో వివరాలూ, సిస్టం లోని ఇతర వివరాలూ ఆయా సైట్లకి రహస్యముగా చేరవేస్తాయి. ఇలా అన్ని సైట్లూ చేస్తాయనికాదు. చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. ముందు జాగ్రత్తగా చెబుతున్నాను.

ఇక ఇలా అప్లోడ్ అయిన ఫొటోస్ మీ ఆల్బమ్స్ లలో పెట్టేసుకోండి. అప్పుడు మీ ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. మీ మిత్రుల నుండి ప్రశంసలూ బాగుంటాయి. కొన్ని విషయాలు తెలుసుకుంటే - మరెంతో ఆనందిస్తాం అన్నదానికి ఇదే ఒక చక్కని ఉదాహరణ. ఈ సోషల్ సైట్లో అప్లోడ్ చేసే ఫొటోస్ మాత్రమే కాదు.. మీ పర్సనల్ ఆల్బమ్స్ కూడా ఇలా ఎడిట్ చేసుకొని అందముగా తీర్చిదిద్దుకోవచ్చును.

జెనరల్ ఫొటోస్ అందరికీ కనిపించేసేలా పెట్టండి. 

మీ పర్సనల్ ఫొటోస్ అంటే - మీ ఇల్లూ, మీ కుటుంబ సభ్యులవీ ఒక ఆల్బం క్రియేట్ చేసి అందులో అప్లోడ్ చేసి మీరు బాగా ఎరిగినవారికే షేర్ చెయ్యండి. వారికే కాకుండా మీ బంధువులకీ, దగ్గరి వారికీ ఇలా షేర్ చెయ్యవచ్చును. ఇలా చెయ్యటం మూలాన మీ ఫొటోస్ పర్సనల్ గా ఉండిపోతాయి. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే - మీరు ఎప్పుడు అంటే అప్పుడు షేర్ చెయ్యవచ్చును, ఎప్పుడు కాదంటే అప్పుడు షేర్ తీసేయ్యవచ్చును. అంటే మన ఫొటోస్ ఎంతసేపు చూపించాలో వెసులుబాటు అంతా మన చేతిలో ఉంటుందన్న మాట!. నాకు ఆర్కుట్ లో నచ్చిన విషయాల్లో ఇది ఒకటి. 

ఈ షేరింగ్ కూడా బాగా తెలిసిన వారికి షేర్ చెయ్యటం చాలా మంచిది. చాలామందికి ఈ విషయం తెలీక - అన్నీ ఒక్క చోటే కలుపుతారు. మీకో విషయం తెలుసా.. ఒకసారి ఆన్లైన్ లో పెట్టిన ఫోటో ఇక శాశ్వతం అని గుర్తు పెట్టుకోవాలి. అది ఎవరైనా కాపీ చేసుకోవచ్చును. ఆఖరికి షేర్ చేసుకున్నవారు కూడా!. అందుకే షేర్ లో అయినా, ఎక్కడైనా కాపీ చేసుకున్నా ఇబ్బంది లేని ఫొటోస్ పెట్టడం మంచిది అని బాగా గుర్తుపెట్టుకోండి.  

ఫొటోస్ అన్నీ కుప్పగా కాకుండా ఒక్కో ఆల్బం లో ఒక హెడ్డింగ్ పెట్టి వాటికి సంబంధించిన ఫొటోస్ మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. అలా చేస్తే చూడటానికి చాలా బాగుంటుంది. అన్నీ ఒక్క దగ్గర కలిపేస్తే - వారిది కాస్త ఏమీ పట్టించుకోని మనస్తత్వం అని అర్థం అని అనుకోవాలి.

ఫోటో అప్లోడ్ చెయ్యగానే కాదు.. ఆ ఫోటో క్రింద ఆ ఫోటో గురించి ట్యాగ్ లైన్ తప్పకుండా వ్రాయాలి. ఇది నిజానికి ఫోటోకి ప్రాణం. ఇలా ట్యాగ్ లైన్ వ్రాస్తేనే - ఆ ఫోటో కి అందం వస్తుంది. ఎలా వ్రాయాలో తెలీకపోతే - వేరే వారి ఆల్బమ్స్ చూస్తే ఈజీగా అర్థం అవుతుంది. అప్పుడే మీ యొక్క టాలెంట్ ని పదిమందీ గుర్తిస్తారు. ఇలా ఫొటోస్ పెట్టగానే - ట్యాగ్ వ్రాయందే ఆ ఫోటోని సంపూర్ణముగా పెట్టినట్లు కాదని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఉదాహరణకి ఒక టూర్ కి వెళ్ళినప్పుడు దారిలో ఒక గుడికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో పెట్టారు అనుకుందాము. ఆ ఫోటోకి ట్యాగ్ గా ఆ గుడి గురించిన సమాచారం పెడితే / వ్రాస్తే చూసేవారూ అనుభూతి చెందుతూ చూస్తారు. ఇలా ట్యాగ్స్ చూసేవారికి బాగా ఉపయోగ పడుతుంటాయి.

ఇప్పుడు వారు మీ ఫొటోస్ చూశాక మీకు ఫోటో కామెంట్స్ పెడతారు. చాలామంది ఫొటోస్ చూసి ఏమీ అనరు. నిజానికి కామెంట్స్ వ్రాస్తేనే బాగుంటుంది. ఒకరు చేతికి గోరింటాకు పెట్టుకొని ఫోటో తీసి చూపించారు అనుకోండి. మీరు చూసి ఊరకుంటే - నేను పెట్టుకున్న గోరింటాకు డిజైన్ బాగాలేదని వారు ఫీల్ అవుతారు. నిజానికి బాగుందే అనుకోండి. మనకి మనం అనుకోక అప్పుడు అక్కడ ఫోటో కామెంట్ గా "బాగుంది" అని వ్రాయండి. ఇంకా బాగా నచ్చిందే అనుకోండి. అలా చిన్నగా కాకుండా - కాస్త విడమరిచి చెప్పండి ఇలా - "వావ్! ఎంత బాగా పెట్టుకున్నారు.. నిజముగా మీలో ఇంత ప్రతిభ ఉందని అనుకోలేదు సుమీ!. అది చూస్తుంటే నాకూ ఇప్పుడే గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది" అని వ్రాస్తే చాలు.. అవతలివారికి ఎంత సంతోషముగా ఉంటుందో..

మన మిత్రులని సంతోషపెట్టే బాధ్యత మనదే కదా!.. సోషల్ సైట్లలో తరచూ రావాలని అనిపింపచేసేది ఈ ఫొటోస్ మరియు ఫోటో కామెంట్స్. (కమ్యూనిటీలు కూడా). ఇవే లేకుంటే కేవలం స్క్రాప్స్ కోసమని వచ్చేసేవారు చాలా తక్కువ అని నా అభిప్రాయం. నిజానికి ఎదుటివారు మెచ్చుకుంటే - సంతోషపడనివారు ఎవరున్నారు ఈ రోజుల్లో!. మీరూ, నేనూ, అందరమూ అంతేగా.  సూరి బావ కళ్ళల్లో ఆనందం కోసం మొద్దు శీను అంతటి సహాయమే చేశాడే కదా.. మనం అంత చెయ్యాల్సిన అవసరం లేదు - మనస్పూర్తిగా ఒక కామెంట్ వ్రాస్తే చాలు. ఇలా అన్ని ఫొటోస్ కి కాదు. బాగున్నవాటికి మాత్రమె వ్రాసి చూడండి. అవతలి వారు మానసికముగా బాగా దగ్గర అవుతారు. మీ మధ్య స్నేహమూ చాలా బాగుంటుంది. ఇది నిజం. 

ఒకవేళ మీకు వ్రాయటం రాదే అనుకోండి - ముందే చెప్పాగా పదిమందివి చూస్తే ఇట్టే అర్థం అయిపోతాయి. కాస్త వ్యంగముగా, చలోక్తిగా, కవ్వింపుగా, హృదయాలని గిలిగింతలు పెట్టేదానిలా మీ కామెంట్స్ ఉండేలా చూసుకోండి. మీకు బాగా స్నేహితులవుతారు. "నేను ఎవరికీ ఇలా చెప్పను.. చెప్పటం రాదు. నాకు ఇలా వ్రాయటం రాదు.." అనుకుంటే - ఎవరూ మీకూ వ్రాయరు. చెక్కంగా చెక్కంగా శిల్పి అవుతాడు అనేది తెలిసుకోండి చాలు. నాకూ మొదట్లో ఈ ఫోటో కామెంట్స్ వ్రాయటం వచ్చేది కాదు. చాలా భయపడేవాడిని. పదిమందివీ చూసి స్టడీ చేశాను. ఆ ప్రేరణ వల్ల వ్రాస్తున్నాను. ఇప్పటికీ ఇంకా స్టడీ చేస్తాను.. ఇంకా బాగా ఎలా వ్రాయోచ్చో అనీ!

ఈ ఫోటో కామెంట్స్ ని మీకు మనసు బాగా లేనప్పుడు - ఏమీ తోచనప్పుడు - ఒకసారి మీ ఆల్బమ్స్ లోని ఒక్కో ఫోటో చూస్తూ వచ్చిన కామెంట్స్ చూడండి. మీకు ఎంత ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందో - మీరే చవిచూస్తారు.

ఆ పెట్టిన కామెంట్స్ కి - వారు ఏదైనా డౌట్స్ అడిగితే - అక్కడే రిప్లై ఇవ్వండి. రిప్లై ఇవ్వటం మరచిపోకండి. మీకు ప్రశంసలు ఇచ్చినవాటికి కృతజ్ఞతలు చెప్పటం మీ ధర్మం. అంత సమయం కేటాయించి - ఫోటో చూసి - వెళ్ళిపోక - కామెంట్ చేసిన వారికి - కర్టెసీ కోసం - కనీసం కృతజ్ఞతలో, ధన్యవాదములో చెప్పటం మంచి పద్ధతి. ఫోటో కామెంట్స్ గురించి ఇంకో టపాలో చెబుతాను. 

3 comments:

Anonymous said...

ఫోటో ఎడిటింగ్ ఎలా చెయ్యాలో మీ వల్ల తెలుసుకున్నాను. థాంక్స్.

murthy said...

chala chala thanxandee .yenno teliyani vishayalu chebuthunnaru .computer parignanam lenatuvanti maalanti vaariki idi chala usefl .once again thnks.

Raj said...

మీ ఇరువురుకీ - నచ్చి కామెంట్స్ పెట్టినందులకు చాలా కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails