Monday, October 11, 2010

ఒక కామెంటు - ఒక మిత్రుడు దొరకటం.

మనం చేసే కొన్ని విషయాలు ఎక్కడెక్కడో లింకులు కలుస్తూ ఉంటాయి.. అలాని ఒకసారి వాటిని పరిశీలనగా చూస్తే చాలా గమ్మత్తుగా, విచిత్రముగా తోస్తూ ఉంటాయి. ఈమధ్యే జరిగిన అలాంటి చక్కని ఉదాహరణ ఇప్పుడు మీకు తెలియచేయబోతున్నాను.

నాకున్న కొద్దిపాటి సమయములో నా సోషల్ వర్కింగ్ సైట్లూ, చాట్లూ, మెయిల్సూ, మధ్య మధ్యలో నాకు ఇది కావాలంటూ విజ్ఞప్తులు, నాలుగైదు కమ్యూనిటీలు + నా బ్లాగ్ ఇవన్నీ చూడటానికే సమయం సరిపోవటం లేదు. అప్పుడప్పుడూ గ్రూపు నుండి నా ఫలానా బ్లాగ్ చూడమంటూ విజ్ఞప్తులు. కాస్త వీలు చూసుకొని, కాస్త సమయములో ఆ బ్లాగు చూస్తాను. చెప్పాగా - సమయం ఎక్కువగా ఉండదని. అయినా నేను ఇప్పటివరకూ చూసిన బ్లాగులు మహా అంటే ఇరవై లోపే అంటే ఏమాత్రం అతియోశక్తి కాదేమో.! ఆ బ్లాగులు చూస్తానా.. అక్కడ మాత్రం ఒక విషయాన్ని మాత్రం మరచిపోను.

అది ఏమిటని అంటారా? - అదే విషయం చెప్పబోతున్నాను. - నేను చూసిన బ్లాగులలో నాకు నచ్చిన ఏదైనా ఒక పోస్ట్ లో తప్పకుండా ఒక కామెంట్ వ్రాస్తుంటాను. అది అభినందిస్తో, లేక వివరముగా విశ్లేషిస్తో, తగు కారణములు చూపుతూ (అందులో ప్రావీణ్యం ఉంటేనే సుమా) కామెంట్స్ ని మాత్రం తప్పకుండా పెడుతూ ఉంటుంటాను.  (ఇంతవరకూ చెడుగా, నిందా పూర్వకమైన కామెంట్లని ఎవరికీ పెట్టలేదు.) ఒకసారి సూచనలు చేస్తూ పెట్టిన కామెంట్, ఒక పెద్దాయన్ని సోషల్ వర్కింగ్ సైట్లో నన్ను ఆయనకీ మిత్రునిగా చేసింది. అదే విషయం మీకు ఇప్పడు చెప్పబోతున్నాను అన్నమాట.

నా బ్లాగు చూడమంటూ వచ్చిన విజ్ఞప్తిని చూసి, సరదాగా ఆ బ్లాగ్ ఓపెన్ చేశాను. అది ఓపెన్ అయ్యేలోగా ఇంకో టాబ్ లో నా పని చేసుకుంటూ ఉండిపోయాను. నా పని అయిపోయాక అన్ని ట్యాబ్స్ క్లోజ్ చేస్తున్నప్పుడు, అప్పుడు గమనించాని ఈ బ్లాగుని. పూర్తిగా చూశాను.. ఏదో బ్లాగ్ పెట్టాలన్న ఉబలాటమే కాదు.. వీలైనంత ఎక్కువగా చెప్పాలని వారి ఆశ ఉన్నట్లుంది. కాని అక్కడ మూడు పోస్టింగ్స్ కన్నా ఎక్కువగా లేవు. సమయం వీలుకాక వ్రాయలేదేమో అని అనుకున్నాను. పేజి డిజైన్ నుండీ టపాల లోని కనీస మర్యాదలూ (వ్యాకరణ దోషాలు) చాలా లోపించాయి. వాటిని మార్చండి అంటూ చిన్నగా కామెంట్ పెట్టాను. సాధారణముగా కామెంట్ పెట్టాక రెండు, మూడు రోజుల తరవాత ఆ టపాని సందర్శిస్తాను.. ఎవరైనా ప్రతిగా కామెంట్ పెట్టారా అని.. అక్కడ వేరే కామెంట్ ఏమీ లేదు. ఇక ఆ విషయమే మరచిపోయాను.

ఒక సోషల్ వర్కింగ్ సైట్లో నా మిత్రురాలి స్క్రాప్ బుక్ లో నా స్క్రాప్ వాసినప్పుడు, అంతకు ముందే ఒకాయన వ్రాసిన స్క్రాప్ కనిపించింది. నాగురించి చిన్నగా ఆయన ఏదో వ్రాశారు.. కాస్త కుతూహలం కలిగింది. కొద్దిరోజులు గమనించాను. ఏమీలేదు.. కాని ఆయన తెలుగు టైపింగ్ తో మాటవిరుపు మాటలూ నన్నెంతో ఆకట్టుకున్నాయి. నా మిత్రురాలిని అడిగా నేను ఆయనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుదామని అనుకుంటున్నాను అనీ.

మంచివారు, పంపండి... అని సమాధానం ఇవ్వటం - నేను రిక్వెస్ట్ పంపటం - ఆయన అంగీకరించటం - ఈ సంవత్సరం ఆగస్ట్ పదమూడున : ప్రతిగా "it is my preivilage to have your ' friend's request. I think you are known to me . నా ' (బ్లాగ్ పేరు ) ' తెలుగు బ్లాగు కు కొన్ని సలహాలు ఇచ్చినట్లు గుర్తు ! ఈ విధంగా మీ స్నేహితుల చిట్టా లో కి ఎక్కినందుకు సంతోషం !.." అని నాకు పంపించటం. ఆ బ్లాగుకి నేనెప్పుడు వెల్లానబ్బా?.. వెళ్లి ఉండవచ్చు. కాని అంతగా బాగా గుర్తుంచుకున్నారే అని అనుకున్నాను. అదే విషయాన్ని నేను ఆయన్ని అడిగితే లింక్ ఇచ్చారు.. ఒహొ.. అప్పటిదా అని అనుకున్నాను. అంటే అప్పుడు నేను వ్రాసిన కామెంట్ వ్రాసిన బ్లాగ్ ఓనరు నా మిత్రురాలికి సోషల్ సైట్లో ఫ్రెండ్ అన్న మాట!. అలా అలా మాటలు కుదిరాయి. ఇప్పుడు చక్కని మిత్రులం.

కాని - నిజానికి ఆయన నాకన్నా అన్నింట్లో చాలా పెద్దమనిషి, పై చేయి వారూనూ.. కాని ఎందుకో అంతగా సరిగా మాట్లాడకపోవటం గమనించాను. నా బ్లాగ్ ఉన్నంత లుక్కు ఆయనది లేదని కావచ్చును.. లేదా మరేదైనా కావచ్చును. ఎక్కువగా మాట్లాడలేకపోతున్నారు. ఈ పరిస్థితిని మేమిద్దరం చక్కదిద్దుకోవాలి.

6 comments:

Anonymous said...

మీ బ్లాగుకున్న లుక్కు ఆయన బ్లాగుకి చేదు కనుక ఆయన మాట్లాడలేకపోతున్నారని మీ సందేహం. హ్మ్మ్. బాగుంది. ఆయన బ్లాగు లుక్కేమో గాని విషయం ఉన్న బ్లాగది.

Raj said...

నేను లుక్కు గురించి చెప్పటం అని కాదు గానీ ముందుగా బ్లాగులో "విషయం" ముఖ్యం. ఆయన బ్లాగూ బాగుంది. నేను చెప్పేది - మా ఇద్దరిమధ్య సమయం దొరకక ఎక్కువగా మాట్లాడుకోలేక పోతున్నామనే బాధ. కాని ఆయన వైద్య కళాశాల అధ్యాపకుడిగా బీజీ. నేనేమో అల్పుడిని. నన్ను మరీ గౌరవముగా చూస్తున్నారేమో అని, అందుకే సరిగా మాట్లాడటం లేదేమోనని ఫీలింగ్ తో ఈ టపా వ్రాశా.

ప్రభు said...

మీ బ్లాగు లుక్ గురించి నేనెప్పుడూ అనుకుంటూ ఉంటా ఎలా మైంటైన్ చేస్తారబ్బా అని!
మనసు ఉంటే మార్గం దొరకక పోదనీ, సమయం లేకపోవడం అనేది ఒక వంక మాత్రమే అనీ పెద్దలు చెబుతుంటారు !
ఆ సద్ది మూట మళ్ళీ ఘుభాళిన్చింది మీతో మిత్రమా !

Raj said...

హా హ్హా హహహా.. అంతగా చూసినట్లు ఎలా చెప్పారబ్బా?..

కుమార్ దేవరింటి said...

ఇంకెందుకు ఆలస్యం నా బ్లాగ్ చూసేయండి , మీ సలహాలు నాకూ అవసరమే ..........
http://chaduvukundamrandi.blogspot.in/

Raj said...

హేమకుమార్ గారూ.. మీ బ్లాగ్ చూశాను.. చాలా బాగుందండీ.. చక్కగా నిర్వహిస్తున్నారు.. అలాగే కొనసాగించండి.

Related Posts with Thumbnails