చిత్రం పేరు : మన్మధ 
గేయరచన : వేటూరి 
పాడినవారు : యువన్ శంకర్ రాజా 
****************** 
పల్లవి: 
కాదన్న ప్రేమే అవునన్నా ప్రేమే - 
ఎవరెమన్న ఏమనుకున్న నేనే నీవన్నా 
తోడైన ప్రేమే నీడేన ప్రేమే - 
ఈడే జోడే గువ్వే గూడె నీలోనే ఉన్నా
నీ మనసులో పూసే పువ్వుల్లో - 
ఘుమ ఘుమ అంత ప్రేమే అనుకున్నా 
ఈ వయసుల్లో వీచే గాలుల్లో 
సరిగమ అంతా పిలుపే అనుకున్నా 
నా చిట్టి ప్రేమా నువ్వెప్పుడు పుట్టావో - 
నీ చిరునామా నాకెప్పుడు చెప్పావో 
నా పాప లాగా కళ్ళల్లో దాచానో - 
నా గుండె నీకే - ఇల్లల్లె చేసానో నా ప్రేమా.. // కాదన్న ప్రేమా //
చరణం 1: 
పూల మనసులో గాలి ఎరుగదా 
నిన్ను పరిచయం చేయాలా? 
మేఘమాలలో మెరుపు తీగవై 
నీవు పలికితే ప్రణయాలా.. 
శతకోటి కాంతలొస్తే - భూమికే పులకింతా 
ఒక చూపు చాలదా - మనసు దోచిన జోలగా 
నిను తలచి వేచిన వేళా
పదములా కదలదు కాలం 
కన్నీటి వర్షం మధురం కదా - బాధాయినా 
తండ్రి నీవే అయి పాలించు 
తల్లి నీవే అయి లాలించు
తోడు నీడవై నను నడుపు 
గుండెల్లో కొలువుండే  || నా చిట్టి ప్రేమ || || కాదన్నా || 
చరణం 2: 
నీవు తప్ప నాకు ఎవరు లేరులే 
ప్రాణమివ్వనా నీ కోసం 
ఆశ లాంటి నీ శ్వాస తగిలితే 
బతికుండదా నా ప్రాణం 
నీ మోము చూడకా 
నా కనులు వాలవే 
విరహవేళలో పగలు చీకటై పొయెనే
తన: మన: ప్రాణాలన్నీ  నీకు నే ఆర్పిస్తాలే 
నీ కొరకు పుడితే చాలు మళ్లీ - మళ్లీ 
చెలియ నీ పేరు పక్క ఇలా 
రాసిననులే - నా పేరే 
ఆది చెరిగిపోకుండా గొడుగు వలె 
నేనుంటే నానంటాలే || నా చిట్టి ప్రేమా || || కాదన్న ప్రేమే || 
Thursday, October 28, 2010
Subscribe to:
Post Comments (Atom)
 
 
 
 
 
 
 
 
 
 

 
No comments:
Post a Comment