Saturday, October 2, 2010

గాంధీ పుట్టిన దేశం

పల్లవి :
గాంధీ పుట్టిన దేశం - రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు - సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతారం
ఈశ్వర్ అల్లా తేరే నాం 
సబ్కో సన్మతి దే భగవాన్ //గాంధీ పుట్టిన //

చరణం 1:
భేధాలన్ని మరచి - మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి - ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ... ఈ కమ్మని వరమే మా కివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు // గాంధీ పుట్టిన //

చరణం 2:
ప్రజలకు శాంతి సౌక్ష్యం - కలిగించే దేశమే దేశం
బానిస భావం విడనాడి - ఏ జాతి నిలుచునో అది జాతి
బాపూ.. - నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు //గాంధీ పుట్టిన //

No comments:

Related Posts with Thumbnails